పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రి అయితే మాకేంటి? మనం అధికారంలో ఉన్నాం ఇప్పటికే రెండు ఏళ్ళు గడిచిపోయాయి. మిగిలిన రెండేళ్లలోనే ఏమైనా చేసుకోవాలి.... ఎంతైనా తవ్వుకోవాలి. మళ్లీ వస్తావా ఏంటి? కృష్ణాజిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుల మాట. మైలవరంలో వందల లారీల్లో మట్టిని తరలిస్తున్న వీడియోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. ఎంత ఓపెన్ గా వందల లారీలో మట్టి తవ్వుకొని వెళ్ళిపోతుంటే.... ఒక్క అధికారి గాని, నాయకుడు గాని అడ్డుకోవడం లేదు. మైలవరం టిడిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని ఏంటి అని ప్రశ్నిస్తే.... అమరావతి కోసం మట్టిదవుకుంటున్నాం తప్పేముంది అని చెప్తున్నాడు ఆయన. అమరావతి పేరుతో యదేచ్ఛగా ఎర్రమట్టి తరలించేస్తున్నారు స్మగ్లర్లు. ప్రజలకి పర్యావరణం పాటలు చెప్పే ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇదంతా పట్టించుకోవడం లేదు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ కి తెలిసే జరుగుతుందా అని నిలదీస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంలో కొత్తూరు తాడేపల్లి, వేమవరం, షాబాది గూడెం, జక్కంపూడి, వెలగలేరు పరిసర ప్రాంతాల్లో ఎర్రమట్టిని తవ్వి తరలిస్తున్నారు.మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుందని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు... వసంత కృష్ణప్రసాద్ మైలవరం పుష్ప అంటూ సోషల్ మీడియా లో విమర్శలతో విరుచుకుపడుతుంది వైసిపి. మట్టి లోడ్‌తో వెళ్తున్న వందలాది టిప్పర్ల వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివి వైరల్ అవుతున్నాయి.
రెండు నెలల క్రితం మాజీ మంత్రి జోగి రమేష్ మైలవరంలో మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఆందోళన చేశారు. అప్పుడు నాలుగు రోజులు మట్టి తవ్వకాలు మిగిలిపోయిన ఆ తర్వాత మళ్లీ ఏదేదో కొనసాగుతున్నాయి.ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇలా మట్టి తగ్గించడానికి ఎందుకు తెగబడుతున్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నీ ప్రశ్నిస్తే, రాజధాని నిర్మాణానికి CRDA అనుమతితో మట్టి తరలిస్తున్నామన్నారు ఆయన. కొత్తూరు తాడేపల్లి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా రాజధాని గ్రామాలకు మట్టి తరలిస్తున్నట్టు వివరించారు. ... మొత్తానికి మైలవరం రాజకీయం ఇప్పుడు మట్టి చుట్టూ తిరుగుతుంది. ఇలా వందల వేల టన్నులు మట్టితో పోతుంటే పర్యావరణం మంత్రి పవన్ కళ్యాణ్ తెలిసి నోరు మెదపడం లేదా అని స్థానిక జనం ప్రశ్నిస్తున్నారు.