Tollywood Hero: ప్రభాస్, మహేష్ ముసలివాళ్ళు అయితే ఇలా ఉంటారా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆర్ట్ సోషల్‌ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ఇటీవల జిమ్‌ చేస్తున్న బిజినెస్‌ టైకూన్స్‌ ఐఏ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్గా మారాయి. ఇపుడిక సూపర్‌స్టార్ల వంతు వచ్చింది.

Post Published By: Srikar Creator
Updated : 12 May 2023, 5:11 PM IST

టాలీవుడ్‌, బాలీవుడ్‌ పాపులర్‌ నటులను ఏఐ ఫోటోలు హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ప్రభాస్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ మొదలు షారూక్‌ ఖాన్‌, రణబీర్‌కపూర్‌ వరకు ఏఐ ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ సూపర్‌ ప్టార్లంతా ముసలివాళ్ళు అయ్యాక ఏలా కనిపిస్తారో చూపిస్తోంది. ముడతలుపడిన తమ హీరోల ముఖాలు చూసి కొంతమంది ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతున్నప్పటికీ, మరికొంతమంది మాత్రం టెక్నాలజీ మహిమ మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏఐ ఆర్టిస్ట్ SK MD అబూ సాహిద్ స్టార్‌ యాక్టర్స్ ను ముసలివాళ్లను చేయడానికి ఇలా ఏఐ ఫోటోలు చేయడం స్టార్ట్ చేసాడు. ఏఐ నటులను ముసలాళ్లుగా ఊహించుకుంటోందనే క్యాప్షన్‌తో వీటిని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ ఫోటోలను ఆయన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్‌, మహేష్‌ బాబు ఫోటోలు చూసి తీరాలి. ఇటీవల ధోని, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాలతో సహా భారత క్రికెట్ జట్టులోని స్టార్ ప్లేయర్లు భారీ కాయులుగా, ముసలాళ్లుగా మారితే ఎలా ఉంటారనే ఏఐ ఫోటోలను కూడా ఆయా షేర్ చేసాడు.

 

View this post on Instagram

 

A post shared by SAHID (@sahixd)

Published : 
  • 12 May 2023, 5:11 PM IST