Kaliki : కల్కి 2898 ఏడి ఆ డేట్‌కే పక్కా..

పాన్ ఇండియన్ (Pan Indian) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా (Naga Ashwin) నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కల్కి 2898 ఏడి..(Kalki 2898 AD) వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రిలీజ్‌కి సంబంధించి కొంతకాలంగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 February 2024, 10:40 AM IST

పాన్ ఇండియన్ (Pan Indian) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా (Naga Ashwin) నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ రేంజ్ మూవీ కల్కి 2898 ఏడి..(Kalki 2898 AD) వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి రిలీజ్‌కి సంబంధించి కొంతకాలంగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. మూవీ టీమ్ అనౌన్స్ చేసినట్లుగా చెప్పిన డేట్‌కి రిలీజ్ కాదన్న వార్తలు ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టాయి..అయితే.. ఈ వార్తలపై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది.. కల్కి 2898 ఏడి రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది.

 

 

కల్కి 2898 ఏడి మూవీని మే 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. .. అయతే.. ఆ డేట్ కి కల్కి వచ్చే అవకాశం లేదని, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా కొంత పెండింగ్ ఉందని రెండు రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.. ఈ వార్తల్లో నిజమెంతో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యారు.. అయితే.. దీనిపై స్పందించిన మూవీ టీమ్ తమ మూవీ పక్కాగా మే 9న థియేటర్స్ లో ఉంటుందని, అందులో ఎటువంటి మరుపు లేదని చెప్పినట్లు టాక్.. దీంతో.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ఈ న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు.

కాగా.. గతంలో వైజయంతి సంస్థ నుండి జగదేకవీరుడు అతిలోక సుందరి, కంత్రి, మహర్షి, మహానటి వంటి సినిమాలు మే 9న రిలీజ్ అయ్యాయి. ఇక వీటిలో చాలావరకు మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ స్పెషల్ డే రోజునే కల్కి 2898 ఏడి ని కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. మరి ఎన్నో అంచనాలను మోస్తున్న ఈ భారీ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో వేచి చూడాల్సిందే..

Published : 
  • 7 February 2024, 10:40 AM IST