Siddharth: సిద్ధార్థ్‌తో పెళ్లి.. సోషల్ మీడియాలో అదితి పోస్ట్ వైరల్

సిద్దార్థ్, అదితిరావు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయ్‌. వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా.. అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేశారు.

Post Published By: narender Thiru
Updated : 28 March 2024, 4:04 PM IST

Siddharth: స్టార్‌ కపుల్‌ సిద్ధార్థ్‌, అదితి రావ్​హైదరీ ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాము ఎంగేజ్‌డ్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతను ఎస్ చెప్పాడంటూ ఆమె.. ఆమె ఎస్ చెప్పిందంటూ అతను పోస్ట్ పెట్టారు. ఈ ఇద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్న టైమ్‌లో.. ఈ జంట ఇలా పోస్ట్‌ చేయడంపై ఫ్యాన్స్‌ అవాక్కవుతున్నారు. సిద్దార్థ్, అదితిరావు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ చేసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయ్‌.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఊరట.. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు

వాటిపై ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడకపోయినా.. అవి నిజమే అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కలిసి తిరగడం చేశారు. ఐతే వనపర్తిలోని ఓ ఆలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారని.. ప్రచారం మొదలుకాగా.. ఎంగేజ్డ్ అంటూ ఇప్పుడు ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో ఇద్దరి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయ్‌. ఐతే ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వలేదు. ఇలాంటి టైమ్‌లో అదితిరావు హైదరి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అదితి, సిద్దార్థ్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోని.. అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఇద్దరూ కొత్త ఉంగరాలతో ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ అదితి.. అతను ఓకే చెప్పాడు, ఎంగేజ్డ్ అని పోస్ట్ చేసింది.

దీంతో ఈ జంట నిన్న కేవలం నిశ్చితార్థం చేసుకున్నారని, పెళ్లి కాదని క్లారిటీ వచ్చింది. మొత్తానికి దాదాపు మూడేళ్లుగా సాగుతున్న ప్రేమని అధికారికంగా చెప్పేసింది అదితి. మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వగా అభిమానులు, పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

Published : 
  • 28 March 2024, 4:04 PM IST