బ్రేకింగ్: బెజవాడలో దేవర బ్లాక్ మార్కెట్ దందా

దేవర సినిమాకు ఉన్న క్రేజ్ చూసి... పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్ దందా మొదలయింది. ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో... అధికారులు అలెర్ట్ అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 26 September 2024, 2:30 PM IST

దేవర సినిమాకు ఉన్న క్రేజ్ చూసి... పెద్ద ఎత్తున బ్లాక్ టికెట్ దందా మొదలయింది. ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో... అధికారులు అలెర్ట్ అయ్యారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం 'దేవర' ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేసారు అధికారులు. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

థియేటర్లో టికెట్లు రేట్లు పెంచి అమ్ముతున్న ఆరోపణలపై విచారణ నిర్వహించిన తహసీల్దార్... అర్ధరాత్రి షో కు ముందుగానే అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. థియేటర్ అనుమతి, అధిక షోలకు అనుమతులు, టికెట్ల పెంపుపై అనుమతులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సమాధానం ఇవ్వడంలో థియేటర్ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరించడంతో థియేటర్ యాజమాన్యంపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తహసీల్దార్ తనిఖీలతో మిగిలిన థియేటర్ల యాజమాన్యాలు జాగ్రత్త పడుతున్నాయి.

Published : 
  • 26 September 2024, 2:30 PM IST