బ్రేకింగ్: టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు

నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తున్న టీటీడీ పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. టీటీడీ చైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడును ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ

Post Published By: Vencateshg
Updated : 30 October 2024, 7:30 PM IST

నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తున్న టీటీడీ పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఖరారు చేసింది. టీటీడీ చైర్మన్ గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడును ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు 24 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, తెలంగాణా టీడీపీ నేత నర్సిరెడ్డి, జాస్తి సాంబశివ రావు, నన్నపనేని సదాసివ రావు, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, ఆర్ఎన్ దర్శన్, జస్టీస్ హెచ్ ఎల్ దత్, శాంతారాం, ప రామమూర్తి, జానకి దేవి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అంగోలు రంగశ్రీ, బురగపు ఆనంద్ దేశాయ్, సుచిత్ర ఏళ్ళ, నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్, సౌరభ్ బోరాలను బోర్డు మెంబర్లుగా ప్రకటించారు.

Published : 
  • 30 October 2024, 7:30 PM IST