శోభిత వ్యాఖ్యలు ఇన్‌డైరెక్ట్‌గా సమంతకే తగిలాయా?

డివోర్స్‌ తర్వాత సామ్‌ టాపిక్‌ వచ్చినా.. చైతు ఇంతవరకు ఎవరినీ నొప్పించకుండా.. జాగ్రత్తగా మాట్లాడాడు. ఏవీ పట్టించుకోని శోభిత లేటేస్ట్‌ చేసి వ్యాఖ్యలు సామ్‌ను వుద్దేశించే అన్నదా?

Post Published By: dialnews
Updated : 18 February 2026, 10:50 AM IST

డివోర్స్‌ తర్వాత సామ్‌ టాపిక్‌ వచ్చినా.. చైతు ఇంతవరకు ఎవరినీ నొప్పించకుండా.. జాగ్రత్తగా మాట్లాడాడు. ఏవీ పట్టించుకోని శోభిత లేటేస్ట్‌ చేసి వ్యాఖ్యలు సామ్‌ను వుద్దేశించే అన్నదా? లేదంటే.. ఆమె కామెంట్ష్‌ను సామ్‌ ఫ్యాన్స్‌ మరోలా అన్వయించుకున్నారా? ఈ ప్రశ్నలు టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. డివోర్స్‌ తర్వాత చైతు శోభితాను పెళ్లాడితే.. కాస్త లేటైనా.. సామ్‌ కూడా ఓ ఇంటిది అయింది. ది ప్యామిలీమ్యాన్‌2 తీసిన దర్శకుడు రాజ్‌ను ప్రేమించి పెళ్లాడింది సామ్‌. చేతిలో పెద్ద సినిమాలు లేకపోయినా.. ఖుషీ.. శకుంతల డిజాస్టర్స్‌ అయినా.. పెల్లి తర్వాత హుషారుగా కనిపించింది సామ్‌.

చైతు, సమంత మళ్లీ ప్రేమించిన వారితో కొత్త జీవితాలు ప్రారంభించారు. డోవోర్స్‌ తర్వాత ఇద్దరి జీవితాలకు పెళ్లితో శుభం కార్డ్‌ పడింది. అంతాబాగానే వుందనుకుంటే.. రీసెంట్‌గా శోభిత వ్యాఖ్యలు సమంతకు తగిలాయంటూ.. ఫ్యాన్స్‌ ఫీలయ్యారు. పిఆర్‌ వ్యవస్థ గురించి మాట్లాడుతూ..సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చానని.. ముంబాయి నుంచి కాకుండా.. వైజాగ్‌ నుంచి వచ్చానని.. తనలాంటి వారికి పిఆర్‌ వ్యవస్థ సెట్‌ కాదన్నారు. అక్కడివరకు బాగానే వుంది. '24 గంటలూ అందరికీ కనిపిస్తూ వుండాలి.. అందరూ తన గురించే మాట్లాడుకోవాలను- కోవడంలేదని చెప్పుకొచ్చింది. పిఆర్‌ కల్చర్‌ కొందరికే వర్కవుట్‌ అవుతుందని.. తనకు అవసం లేదన్నారు.

పిఆర్‌ వ్యవస్థపై శోభిత ధూళిపాళ్ల ఇచ్చిన వివరణ.. సమంతకు తగిలాయి. చేతిలో సినిమాలున్నా లేకపోయినా.. ఫామ్‌లో వున్నా లేకపోయినా.. సోషల్‌ మీడియాలో సామ్‌ యమా యాక్టీవ్‌గ కనిపిస్తుంది. ఎప్పటివరకు పోస్టులు పెడూతూ ఆడియన్స్‌కు టచ్‌లో వుంటుంది. అందుకే ఫేడౌట్‌ అయినా.. అందరూ సామ్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈలెక్క శోభిత సామ్‌ను వుద్దేశించే మాట్లాడిందంటూ ఆమె ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. పి.ఆర్‌ వ్యవస్థ గురించి మాట్లాడితే.. ఆ మాటలు సామ్‌ అభిమానులు తమ హీరోయిన్‌కే అన్నట్టు అన్వయించుకున్నారని.. చైతు ఫ్యాన్స్‌ కౌంటర్స్‌ ఇస్తున్నారు.

సామ్‌ ప్రస్తుతం నిర్మాతగా..నటిగా..పికెల్‌ బాల్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా బిజీ. మరోవైపు యాడ్స్‌తో ఎప్పుడూ కనిపిస్తూనే వుంటుంది. తనకున్న ఆరోగ్య సమస్యలఅనుభవంతో.. హెల్త్‌ టిప్ప్‌ ఇస్తూ వుంటుంది. ఇన్ని అవతారాల్లో కనిపించే సామ్‌ ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే వుంటుంది. శోభిత పిఆర్‌ వ్వవస్థ గురించి మాట్లాడింది సమంతకు సరిపోవడంతో.. చైతు, సామ్‌ ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్థం మొదలైంది.

Published : 
  • 18 February 2026, 10:50 AM IST