రెబల్ స్టార్ ప్రభాస్ ఈవారం తీసుకున్న నిర్ణయం మహిమో, లేదంటే అలా టైం కలిసొచ్చిందో, ఒకేసారి మూడు సర్ ప్రైజులు కన్పామ్ అయ్యాయి. అందులో ఒకటి కల్కీ సీక్వెల్ .. రెండోది ఫౌజీ రిలీజ్ డేట్.. మూడోది స్పిరిట్ టీం ఇస్తున్న షాక్.. ఒకేసారి మూడు ప్రాజెక్టుల్లో ఊహించని పరిణామాలు జరిగాయి.. అందులో షాకింగ్ అప్ డేట్ మాత్రం కల్కీ సీక్వెల్ ఉన్నట్టుండి, ఒక్కసారిగా ఊపొచ్చేయటం.. అంతటికి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చనే.. తన నుంచి వచ్చిన ఒక్క పిలుపు కల్కీ సీక్వెల్ లో ఊహించని మార్పులు తెచ్చింది. ఇలాంటి టైంలో ఫౌజీ టీం కి రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన అల్టి మేటం, రెబల్ ఫ్యాన్స్ కి పండగ తెచ్చేలా ఉంది. ఐతే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ కి వచ్చిన బంపర్ ఆఫర్ మాత్రం మైండ్ బ్లాక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, 1000 కోట్ల ఆ ఆఫర్ దెబ్బకి, వారాణాసి టీమే షాక్ అవ్వాల్సి వస్తోంది. పాన్ వరల్డ్ సినిమా జర్నీలో స్పిరిట్ కూడా ఉందని వెయ్యికోట్ల ఆఫర్ తో తేలుతోంది.. ఇంతకి ఏంటా వెయ్యికోట్ల ఆఫర్...?
సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేస్తున్నస్పిరిట్ మూవీకి 1000 కోట్ల బంపర్ ఆఫర్ వచ్చేలా ఉంది. వారణాసి మూవీకి నెట్ ఫ్లిక్స్ సంస్థ 1000 కోట్ల ఓటీటీరైట్స్ ఆఫర్ చేస్తే, అదే మొత్తంలో స్పిరిట్ టీం కి అమేజాన్ ప్రైమ్ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా ఇదిచర్చల దశలోనే ఉంది. 650 కోట్ల నుంచి 900 కోట్ల మద్య స్పిరిట్ ఓటీటీ రైట్స్ డీల్ ఫైనల్ అవ్వొచ్చనేది సారంశం.అదే జరిగితే, పాన్ వరల్డ్ సినిమాల్లో దేశం పేరు మారుమోగేలా చేసే మూవీల్లో వారణాసి తర్వత స్పిరిట్ చేరేలా ఉంది. ఐతే ఇంకా చర్చల దశల్లోనే ఉన్నా... ఒక వేళ 900 కోట్లు లేదా 1000 కోట్లు స్పిరిట్ ఓటీటీ రైట్స్ పలికితే, బాలీవుడ్ లో ఎవరికీ సౌండ్ ఉండదు.. అసలే వారణాసి మూవీకి వసూల్లు కాదు, కేవలం ఓటీటీ రైట్సే 1000 కోట్లంటే అక్కడ అసూయ వాళ్లని మింగేస్తోంది. అలాంటి టైంలో మరో తెలుగుు మూవీకి 1000 కోట్లు ఓటీటీ ఆఫర్ అంటే బాలీవుడ్ తట్టుకోలేదు..ఇలా స్పిరిట్ సెన్సేషన్ క్రియేట్ చేసే టైంలో సడన్ గా కల్కీ 2 షూటింగ్ మొదలయ్యేలా ఉంది.
కల్కీ 2 మూవీ షూటింగ్ ఉన్నపలంగా ప్లాన్ చేయటానికి రీజన్ అమితాబచ్చనే అని మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఔను ప్రభాస్ తో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్లే ముందు తీయబోతున్నారు. ఎందుకంటే ఆ కాంబినేషనల్ సీన్లలోనే ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లున్నాయని తెలుస్తోంది. హెవీ గ్రాఫిక్స్ కూడా ఈ సీన్లలోనే ఉండటంతో, వాటి గ్రాఫిక్ వర్క్ కే ఏడాది టైం పట్టేలా ఉందట.సో ఒకవైపు అమితాబ్ బచ్చన్ కొత్త ప్రాజెక్టుల డేట్లు క్లాష్ కాకూడదనే కారణంతో, తన వర్షన్ షూటింగ్ ముందే తీయాలని ఆయన చెప్పటం.. మరో వైపు కల్కీ తీసేప్పుడే 30శాతం షూటింగ్ జరగటంతో, మిగతా 70శాతం షూటింగ్ ని ఈ ఏడాది ఎండ్ కల్లా ఎలాగైనా పూర్తి చేయాలని నిర్మాత ప్రెజర్ పెంచటంతో, కల్కీ 2 సడన్ గా పట్టాలెక్కుతోంది.ఏదేమైనా కల్కీ మొదటి భాగంలో ఎక్కువగా ప్రభాస్ కి అమితాబ్ పోటీ ఇస్తే, రెండో భాగంలో కమల్ హాసన్ విశ్వరూపం చూపించబోతున్నాడట. తన పాత్ర ఏకంగా 50శాతం డ్యూరేషన్ తో రాబోతోందట. ఏదేమైనా కల్కీ 2 షూటింగ్ ఈనెలాఖర్లోగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే సీక్వెల్ లాంచింగ్ ని అఫీషియల్ చేసే ఛాన్స్ లేనట్టుంది.