5వ సారి సెన్సేషనల్ కాంబో.. జోనర్ తెలిస్తే పూనకాలు…!

వారాణాసి మూవీ షూటింగ్ జూన్ లో పూర్తైనా, 2027 జూన్ లోనే రాజమౌళి కొత్త సినిమా పట్టాలెక్కుతుంది. కాని అందుకు ఏడాది ముందునుంచే కథ సిద్దం అవ్వాలి...

Post Published By: dialnews
Updated : 20 February 2026, 7:24 PM IST

వారాణాసి మూవీ షూటింగ్ జూన్ లో పూర్తైనా, 2027 జూన్ లోనే రాజమౌళి కొత్త సినిమా పట్టాలెక్కుతుంది. కాని అందుకు ఏడాది ముందునుంచే కథ సిద్దం అవ్వాలి... ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ తోనే రాజమౌళి నెక్ట్స్ మూవీ అని తేలుస్తోంది. అలాంటి సూచనలే వస్తున్నాయి కూడా... అంతా బానే ఉంది. కాని ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా తీస్తే, అది ఏజోనర్ లో ఉండొచ్చు.... ఇప్పటికే నాలుగు సార్లు ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఐదో సారి, అది కూడా పాన్ వరల్డ్ మూవీ వారణాసి తీశాక అంటే, జోనర్ తోనే ఫీవర్ రావాలి... అలాంటి కాన్సెప్ట్ ప్లాన్ చేశాడా? బేసిక్ హింట్లు కూడా రావట్లేదా? లేదంటే విజయేంద్ర ప్రసాద్ దగ్గర సాలిడ్ ప్లాట్ కూడా రెడీ అయ్యిందా?

ఎన్టీఆర్ తో రాజమౌలి సినిమా ఆల్ మోస్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంటే బ్యాలెన్స్.. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తన టీంకి ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చేశాడు. డ్రాగన్ టైటిల్ బ్రూస్లీగా మారుతుందా లేదా అటుంచితే, ఈనెలాఖర్లో డ్రాగన్ మొదటి భాగం 95 పర్సెంట్ పూర్తువుతుంది. సెప్టెంబర్ లోగా సెకండ్ పార్ట్ ని పూర్తి చేసేలా టీం షెడ్యూల్ రెడి చేసింది.. ఇక దేవర 6 నెలల్లో పూర్తయ్యేలా కొరటాల శివ ప్లాన్ చేస్తోంది కూడా, రాజమౌళి ఫ్రీ అయ్యేలోపు ఎన్టీఆర్ కమిట్మెంట్స్ అన్నీ పూర్తవ్వాలనే ఉద్దేశ్యమే.ఏదేమైనా రాజమౌలి మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా కన్ఫమా్ అవటం, కాదు అదే జోనర్ లో ప్లాన్ చేస్తున్నారనేది హాట్ టాపిక్ అయ్యింది.

వారణాసి జూన్ కల్లా పూర్తవుతుంది. ఆతర్వాత వరల్డ్ టూర్ లో రాజమౌళి బిజీ అయినా, తనతండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఎన్టీఆర్ కథ రచనతో బిజీ కాబోతున్నాడు. ఆ పనులకు ఏడాది టైం తీసుకుంటాడని తెలుస్తోంది.అదంతా ఓకే కాని, ఎన్టీఆర్ తో ఐదో సారి రాజమౌళి తీసే సినిమా జోనర్ ఏంటనే దగ్గరే అందరికీ క్యూరియాసిటీ పెరుగుతోంది. మొదట్లో ఒక క్రిమినల్ లాయర్ గా మారే స్టూడెంట్ నెంబర్ వన్ తీశాడు. తర్వాత సింహాద్రిగా సింగమలై మాస్ ఎలివేషన్లు చూపించాడు. ఆతర్వాత పౌరాణికం తీయాలని యమదొంగలో యమగోల చూపించాడు.. కట్ చేస్తే పీరియాడిక్ డ్రామాకు దేశభక్తిని, దైవ భక్తిని యాడ్ చేసి త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గాదుమ్మదులిపాడు.

కట్ చేస్తే ఈసారి ఏం తీస్తాడు? ఫాంటసీనీ, రివేంజ్ డ్రామాని ఎన్నడూ వదలని రాజమౌలి ఆఫ్లేవర్లు వాడుతూనే, జోనర్ మాత్రం ఈసారి సూపర్ హీరో జోనర్ వాడబోతున్నాడా? జై హనుమాన్ మూవీ తో ఆల్రెడీ లార్డ్ హనుమాన్ ని సూపర్ హీరోగా చిన్న దర్శకుడు సినిమా తీశాడు.. దుమ్ముదులిపాడు.. కాని అదే అంజిని బేస్ చేసుకుని పాన్ వరల్డ్ సూపర్ హీరో కాన్సెప్ట్ కి రాజమౌళి ప్రిపేర్ అవుతున్నాడా? మహాభారతం, రామయాణాన్ని కలిపేసేలా ఏదో సాలడ్ స్టోరీ లైన్ దొరికిందా? ఇలాంటి డౌట్లకు కారణం, విజయేంద్ర ప్రసాద్ టీం ఇప్పుడు, హనుమంతుడి మీద ఫోకస్ చేయటమే.. రామాయణ, మహాభారతాల్లో తన ప్రాధాన్యతని ఎలివేట్ చేసే సీన్ల కోసం వేట మొదలు పెట్టడమే.. అసలు కారనం.సో రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అసిస్టెంట్స్ అంతా రామాయాణ,మహాభారతాల్లో హనుమంతుడి రెఫరెన్స్ సీన్లు, ఎవరూ చూపించని కోణంలో చూపించే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్ పెరిగింది. ఆ కారణంగానే ఈసారి రాజమౌళి ఎన్టీఆర్ ని అసలు సిసలు భీముడిగా, ఊహకందని హనుమంతుడిగా చూపిస్తాడా? అన్న ఊహాగానాలు పెరిగాయి.

Published : 
  • 20 February 2026, 7:24 PM IST