పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా హిట్టు, హరి హర వీరమల్లుతో సినిమా పరంగా ఫ్లాప్ అన్నారు. కాని అప్పుడే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ పడింది. మొత్తం ఇండస్ట్రీ షేక్ అయ్యింది. కాని ఇదే సౌండ్ పాన్ ఇండియాలెవల్లో వస్తే లెక్క వేరుగా ఉండేది.. ఐతే ఆ వెలితిని ఉస్తాద్ భగత్ సింగ్ తీరుస్తుందా? ఔరా ఆఫ్ భగత్ అంటూ వచ్చిన కొత్త పాట ప్రోమో పేలింది... మరీ ఎక్కువ ఇన్ ఫో ఇవ్వకున్నా, మాస్ కమ్ యూత్ మతిపోగొట్టేలానే ఉంది. కాని నిజంగా ఓజీ రేంజ్ లో మాత్రం ఊపు, పూనకాలు కనిపించట్లేదు. మరి గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ సినిమా పవర్ స్టార్ కి క్రేజ్ ని పవర్ సప్లై చేసినట్టు చేస్తుందా? ఇలాంటి డౌట్లు రావటానికి రీజనేంటి? హిట్లు ఫెల్యూర్స్ కి అతీతుడిగా పవన్ మారొచ్చు.. అలాని బ్లాక్ బస్టర్లు తగ్గినా కష్టమే... ఆ వెలితినే ఉస్తాద్ భగత్ సింగ్ తీరుస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా అంటే, గబ్బర్ సింగ్ మించి ఉంటుందనే అంచనాలున్నాయి. అసలే ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తోన్న సినిమా అంటే, ఎక్స్ పెక్టేషన్స్ భారీగా పెరగటం కామన్. ఎలాగూ జమానాలోనే గ్లాస్ తో వచ్చిన టీజర్ పేలింది. ఇప్పుడు ఔరా అంటూ సాగే ప్రోమో కి కూడా భారీ రెస్పాన్సే వస్తోంది.అసలు పాట వస్తే అదెంత తూటాలా దూసుకెళుతుందనే దాని మీదే, హైప్ లో ఊపు పెరుగుతుంది. కాకపోతే పొలిటికల్ గా పవన్ బిజీ అయ్యాక, సినిమాలకు దూరమయ్యాడని, ఫ్యాన్స్ కి మరింత దూరమయ్యాడనే కంప్లైట్స్ వినిపించాయి. అలాంటి టైంలో హరి హర వీరమల్లు వచ్చి షాక్ ఇచ్చింది. కాని సుజిత్ తీసిన ఓజీ ఇండస్ట్రీని షేక్ చేసింది.
కాకపోతే పాన్ ఇండియా లెవల్లో సరిగా రిలీజ్ చేయకపవటంతో, ఒక సాలిడ్ పాన్ ఇండియా హిట్ మిస్ అయ్యిందనే అభిప్రాయం అభిమానుల్లో కనిపించింది. ఐతే పవన్ ని క్రేజ్ తగ్గుతున్న టైంలో ఓజీ వచ్చి దుమ్ముదులిపింది. కాని ఆ స్థాయి ఊపు ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తుందా? డెఫినెట్ గా రావాలి...? పవన్ ఎంతగా పొలిటికల్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్నా... తనకి ఇంతగా అభిమానులని క్రియేట్ చేసిందే సినిమా,అదే లేకపోతే, అక్కడే క్రేజ్ తగ్గితే, డెఫినెట్ గా అది మంచి సిగ్నల్ కాదు.
అలాని హిట్లు, ఫెల్యూర్స్ తో తగ్గి పెరిగే ఇమేజ్ తనదా అంటే, కానేకాదు. అలాని అసలే హిట్లు లేకపోతే ఎలాంటి స్టార్ కైనా, తన అభిమానులకైనా ఊపు తగ్గటం కామన్. అదే తగ్గకుండా, బాక్సాఫీస్ షేక్ అయితే, ఫ్యాన్స్ లో పూనకాలే... అలా జరిగేలా ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుందా?ఈ డౌట్ కి గేట్ వేయాలంటే, టీజర్ రావాలి.. ఔరా పాట తూటాలా పేలాలి...హరీష్ శంకర్ కి మాస్ పల్స్ మాత్రమే తెల్సిన దర్శకుడు కాదు.. హీరో రేంజ్, ఇమేజ్ కితగ్గ పాత్రలు పంచ్ లు రాసే రైటర్ కూడా... అందుకే తన మేకింగ్ లో వస్తున్న ఉస్థాద్ భగత్ సింగ్ మీద భారీ అంచానాలున్నాయి.. వాటిని మరింత పెంచుతాయో, లేదంటే తుంచుతాయ రాబోయే టీజర్, వచ్చేస్తున్న ఔరా సాంగ్ తో తేలబోతోంది.