నెల్సన్ Vs ఎన్టీఆర్…!

డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. 'జైలర్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నెల్సన్, ఇప్పుడు అంతకు మించి అనేలా తన తర్వాతి ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు.

Post Published By: dialnews
Updated : 20 February 2026, 9:20 PM IST

డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. 'జైలర్' సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నెల్సన్, ఇప్పుడు అంతకు మించి అనేలా తన తర్వాతి ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నాడు. రజనీకాంత్ హీరోగా వచ్చిన 'జైలర్' సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ స్వయంగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా జూన్ 12, 2026న విడుదల కానుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైతే ఇండిపెండెన్స్ డే వీకెండ్ కి మారే అవకాశం ఉంది. ఈ సినిమాలో పాత నటీనటులతో పాటు సీక్వెల్‌లో కొత్తగా ఎస్.జె. సూర్య, విద్యాబాలన్ కూడా కనిపిస్తారని సమాచారం. నందమూరి బాలకృష్ణ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారనే బలమైన ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే తలైవా తన షూటింగ్ పార్ట్ పూర్తి చేశారు. ప్రస్తుతం నెల్సన్ ప్యాచ్ వర్క్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, రజిని కాంత్ కమల్ హాసన్లు కూడా నెల్సన్ దర్శకత్వంలో మరో కొత్త సినిమాలో నటించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించి "Red Giant Movies" ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది నెల్సన్ మార్క్ "డార్క్ కామెడీ యాక్షన్" ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ 'రాజ్ కమల్ ఫిలిమ్స్'లో దీన్ని నిర్మిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంబో నెల్సన్ విత్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కోసం నెల్సన్ ఒక పక్కా యాక్షన్ విత్ డార్క్ కామెడీ కథను సిద్ధం చేశారట.

ఎన్టీఆర్ టైమింగ్ నెల్సన్ మేకింగ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్టైన్మెంట్స్' ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2', 'దేవర 2' మరియు ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ 2026 చివరిలో లేదా 2027లో పట్టాలెక్కే అవకాశం ఉంది. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా, నెల్సన్ తన సొంత బ్యానర్ 'ఫిలమెంట్ పిక్చర్స్' ద్వారా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'బ్లడీ బెగ్గర్' తర్వాత, ఇప్పుడు తెలుగులో కూడా ఒక చిన్న సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.

Published : 
  • 20 February 2026, 9:20 PM IST