AVATAR బ్యాచ్ వచ్చింది.. అంతా OPEN..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న వారణాసి మూవీ కోసం అవతార్ టీం రంగంలోకి దిగిందా.? అందుకు అన్న పూర్ణ స్టూడియో వేదికగా మారిందా? ఈ రెండుడౌట్లకు టాలీవుడ్ ఫేట్ పేలిపోయే సమాధానాలు రెడీ చేశాడు రాజమౌలి

Post Published By: dialnews
Updated : 27 February 2026, 3:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న వారణాసి మూవీ కోసం అవతార్ టీం రంగంలోకి దిగిందా.? అందుకు అన్న పూర్ణ స్టూడియో వేదికగా మారిందా? ఈ రెండుడౌట్లకు టాలీవుడ్ ఫేట్ పేలిపోయే సమాధానాలు రెడీ చేశాడు రాజమౌలి. ఔను అవతార్ తీసిన దర్శకుడినే టీజర్ లాంచింగ్ కి గెస్ట్ గా మార్చే ప్రయత్నాల్లో ఉన్న జక్కన్న, ఈసారి అవతార్ టెక్నాలజీ, అవతార్ కోసం పని చేసిన టెక్నీషియన్స్ అందరినీ రంగంలోకి దింపేశాడు. ఈవిషయంలోనే అవతార్ మేకర్ జేమ్స్ కామెరున్ నుంచి సాలిడ్ సపోర్ట్ దొరికినట్టుంది. ఇలాంటి టైంలో టంగ్ స్లిప్ అయ్యి వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా వారణాసి లీకులకు కారణమైందా? మొన్నటి వరకు తను ఏం చెప్పినా న్యూస్ గా మారింది. ఇప్పుడ న్యూస్ గా కాదు రాజమౌళికి ప్రియాంక టంగ్ స్లిప్ అయ్యే లక్షణం న్యూసెన్స్ గా మారుతోందా? ఇంతకి తన మాటల్లో లీకైన మ్యాటరేంటి? అలానే ఐమ్యాక్స్ కెమెరా తర్వాత అవతార్ టీం వాడిన టెక్నాలజీ వాడిన మూవీగా వారణాసికి మరో రికార్డు కూడా దక్కబోతోందా?

అవతార్ దర్శకుడు జేమ్స్ కామేరున్ వచ్చి వారణాసి గ్లింప్స్ రిలీజ్ చేస్తానుకుంటే, అవతార్ మూడో సీక్వెల అట్టర్ ప్లాప్ అవతంటో సీనే రివర్స్ అయ్యింది. అంతకుముందే వారణాసి కాన్సెప్ట్ గ్లిప్స్ రిలీజ్ ప్లాన్ చేసినా, పరిస్థితులు అనుకూలంగా లేక, జేమ్స్ కామెరున్ రంగంలోకి దిగలేదు. కాని అసలు టీజర్, లేదంటే ట్రైలర్ ఇందులో ఏదో ఒకటి తన చేతులు మీదుగా రిలీజ్ చేయించాలనే ఐడియాని మాత్రం రాజమౌళి పక్కన పెట్టేలా లేడు.అందుకు సాక్ష్యం అవతార్ టీం రంగంలోకి దిగటం. ఔను వారణాసి లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడారు. చాలా పెద్ద ఎపిసోడ్ ని తీశారు. అవతార్ మూవీ కోసం వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, ఆ టెక్నీషియన్సే ఇప్పడు వారణాసికోసం పనిచేసేశారు. ఒక పెద్ద ఎపిసోడ్ పూర్తి చేశారు. ఇందుకు అన్నపూర్ణా స్టూడియోస్ వేదికైంది. అక్కడే వారణాసి లో 25 నిమిషాల ఎపిసోడ్ షూటింగ్ జరిగింది.

ఇప్పటి వరకు 1349 కోట్ల భారీ బడ్జెట్ తోతెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ అనిపించుకుంటున్న వారణాసి, అవతార్ టీంతో కలిసి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో నెక్ట్స్ లెవల్ సీన్స్ తీసిన మూవీ రికార్డు కూడా సొంతం చేసుకుంటోంది. ఆల్రెడీ ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా ఈ సినిమాకు రికార్డు దక్కింది. దాంట్లో అవతార్ మోషన్ క్యాప్షర్ టెక్నాలజీ వాడిన తొలి భారతీయ సినిమా రికార్డు కూడా యాడ్ కాబోతోంది.బాహుబలి నిర్మత శోభూ యార్లగడ్డ గ్రాఫిక్స్ టీం కూడా వారణాసి మోషన్ క్యాప్షర్ టెక్నాలజీ ప్రాజెక్ట్ లో భాగమైంది. ఇక వారణాసిలో రామ రావణ యుద్ధ ఘట్టం మోషన్ క్యాప్ఛర్ టెక్నాలజీతోనే తీసినట్టు వీడియో రిలీజ్ చేసిన షాక్ ఇచ్చింది ఫిల్మ్ టీం.

ఇలాంటి టైంలో హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ప్రమోషన్ లో భాగంగా నోరు జారిన ప్రియాంక చోప్రా వారణాసి తాలూకు లీకులతో ఫిల్మ్ టీం ని షాక్ కి గురిచేసింది.ఇప్పటి వరకు వారణాసి బడ్జెట్ 1300 కోట్ల పైమాటని, హీరో మల్టిపుల్ రోల్స్ వేస్తాడని ఇలా కొన్ని ఇంటర్వూల్లో చెబితే, అది ప్రమోషన్ కి పనికొచ్చింది. అప్పటి వరకు రాజమౌళి నుంచి నో కంప్లైంట్స్. కాని తన హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ని ప్రమోట్ చేసుకునే ప్రాసెస్ లో ప్రియాంక టంగ్ స్లిప్ అయ్యింది. వారణాసి మూవీలో ఏడు వింతల జర్నీ, మూడు లోకాల్లో హీరో కష్టాలు, అలానే టైం ట్రావెల్ తాలూకు కీ పాయింట్స్ ని మాటల్లో మాటగా లీక్ చేసింది. 14 నెలల షూటింగ్ తర్వాత 5 నెలల షూటింగ్ పెండింగ్ అని కూడా తను చాలా ముఖ్యమైన సమాచారం లీక్ చేసి వారణాసి టీం ని షాక్ కి గురి చేస్తోంది.

Published : 
  • 27 February 2026, 3:50 PM IST