మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అఖిల్ స్పెషల్ గెస్ట్ గా కనిపించబోతున్నాడన్నారు. కట్ చేస్తే 24 గంటల్లోనే అదంతా ఫేక్ న్యూస్ అని తేలింది. రూమర్ గా కన్ఫామ్ అయ్యింది. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుణ్యామాని అఖిల్ కి 24 గంట్లోల బాగా కలిసొచ్చింది. కంప్లీన్ ఒకరోజంతా అఖిల్ మీదే గూగుల్ లో జనం సెర్చ్ చేశారట. కేజీయఫ్, సలార్ సక్సెస్ ల తర్వాత ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ తీస్తున్న ప్రశాంత్ నీల్, మధ్యలో చాలా సార్లు అఖిల్ ని కలిశాడు. ఒకానొక దశలో అఖిల్ నెక్ట్స్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే అన్నారు. అంతగా ఈ ఇద్దరి మధ్య కథ కనెక్షన్ కుదిరిందనుకున్నారు. అలాంటి టైంలో మూడు సార్లు డ్రాగన్ సెట్లో అఖిల్ కలవటంతో, ఇందులో తను స్పెషల్ రోల్ వేయబోతున్నాడన్న ప్రచారం మొదలైంది. కట్ చేస్తే, ఇప్పుడది రూమరనే తేలింది.. కాని అఖిల్ కి ఎన్టీఆర్ పుణ్యామాని చాలా పెద్దగానే కలిసొచ్చింది. మహేశ్, ప్రభాస్ వల్ల కూడా యంగ్ హీరోలకు ఇలానే కలిసొచ్చిన దాఖలాలున్నాయి... ఇంతకి అఖిల్ కి ఎన్టీఆర్ పరోక్షంగా చేసిన సాయమేంటి? అంతగా తన వల్ల అఖిల్ కి ఏం కలిసొచ్చింది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న మూవీ డ్రాగన్. ఇది కేవలం వర్కింగ్ టైటిలే అయినా, అసలు టైటిల్ మే 19న రివీల్ కాబోతోంది. కాని ఈ సినిమా లో హీరో కి బ్రదర్ గా మరో ఇంపార్టెంట్ రోల్ ఉందని, దాన్ని అఖిల్ వేస్తాడని ప్రచారం జరిగింది. అలా కాకుండా నెగెటివ్ రోల్ లో ఒక పాత్ర అఖిల్ వేయొచ్చని కూడా ప్రచారం జరిగింది.కాని అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఫిల్మ్ టీం కూడా ఇవన్నీ గాలివార్తలే అని తేల్చింది. కాని అఖిల్ మాత్రం ఈవిషయంలో ఫుల్ లక్కీ.. తనెంత కింగ్ నాగార్జున కొడుకైనా, సరైన హిట్ లేక, చాలా కాలాంగా అడ్రస్ లేకుండాపోయాడు. అసలు తననెవరూ పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అలాంటి తనకోసం, తన మీద వచ్చిన రూమర్స్ పుణ్యమాని గూగుల్ లో చాలా పెద్ద ఎంక్వైరీనే జరిగిందని తెలుస్తోంది.
ఓరకంగా ఇది అక్కినేని అఖిల్ కి ఫ్రీ పబ్లిసిటీ లాంటిది. పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ మూవీలో కింగ్ నాగార్జున కొడుకు విలన్ అంటూ నార్త్ ఇండియాకు ,చెంది చాలా హిందీ ఛానల్స్ పదులు కాదు వందలకొద్ది ఛానల్స్ లో వార్త స్ప్రెడ్ అయ్యింది. ఇదంతా ఫేక్ అని 24 గంటలకు తేలినా, దాన్ని కూడా వాళ్లు కవర్ చేస్తారనుకోలేం.. ఏదేమైనా ఇటు గూగుల్ సెర్చ్ లో అటు, హిందీ యూ ట్యూబ్ ఛానల్స్ లో అక్కినేని అఖిల్ పేరు మాగిపోయేలా చేసింది డ్రాగన్ మూవీనే..అంతా భాయ్ కే సాత్ చోటు అంటూ అన్నతో తమ్ముడి ప్రయోగం అని ప్రచారం చేశారు. ఏదేమైనా గతంలో మహేశ్ బాబు వారణాసి సినిమాలో నాని గెస్ట్ రోలని, విజయ్ సేతుపతి కనిపిస్తాడని ప్రచారం జరిగింది. ఈవిషయంలో నానికి కొంత పబ్లిసిటీ కలిసొచ్చినట్టే అన్నారు. ప్రభాస్ కల్కీలో విజయ్ దేవరకొండకి నిజంగా కలిసొస్తే, అదే సలార్ లో అడవిశేష్ స్పెషల్ ఎంట్రీ అన్నారు. అలా తన పేరు అప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగింది. సో ఇలా కొన్ని సార్లు రూమర్ల పుణ్యమాని కొందరు లోకల్ హీరోలకి, పాన్ ఇండియా లెవల్లో ప్రచారం దక్కడం అరుదుగా దక్కే అద్రుష్టం.