గజిని తర్వాత అదిరే లవ్ స్టొరీ…!

కోలీవుడ్ స్టార్ సూర్య ఫ్యాన్స్‌కు ఇప్పుడు పండగే అని చెప్పాలి. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సూర్య, తన 46వ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Post Published By: dialnews
Updated : 2 March 2026, 10:55 AM IST

కోలీవుడ్ స్టార్ సూర్య ఫ్యాన్స్‌కు ఇప్పుడు పండగే అని చెప్పాలి. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సూర్య, తన 46వ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. 'సూర్య 46' పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడొక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రానికి 'సార్' మరియు 'లక్కీ భాస్కర్' వంటి వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే, సార్' సినిమాతో తమిళంలోనూ భారీ హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు సూర్యను సరికొత్తగా చూపించబోతున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. 45 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే ఎమోషనల్ జర్నీ. ఈ సినిమా కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు! ఇదొక వినూత్నమైన ఏజ్-గ్యాప్ లవ్ స్టోరీ అని ఇండస్ట్రీ టాక్. సూర్య ఇందులో ఒక 45 ఏళ్ల బిజినెస్‌మెన్ పాత్రలో కనిపిస్తారట. 'గజని'లో మనం చూసిన సంజయ్ రామస్వామి ఛాయలు ఈ పాత్రలో ఉంటాయని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. మేకర్స్.. మార్చి 2న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటికే 'విశ్వనాథన్ అండ్ సన్స్' అనే టైటిల్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఇచ్చిన అప్‌డేట్ చూస్తుంటే, ఈ సినిమా మ్యూజికల్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌లో 'కరుప్పు' రిలీజ్ అయ్యాక, జూలై లేదా ఆగస్టు 2026లో సూర్య 46 విడుదలకానుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడం హైలైట్. ఈ సినిమాలో రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Published : 
  • 2 March 2026, 10:55 AM IST