ఇండియన్ స్పిరిట్ లో.. కొరియన్ ఆల్కహాల్..?

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ లో విలన్ మారాడని రెండు వారాల క్రితం వార్తొచ్చింది. కట్ చేస్తే ఈ విషపు ప్రచారాలకు బ్రేక్ పడబోతోందని ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్ట్ తో తేలింది

Post Published By: dialnews
Updated : 2 March 2026, 3:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీస్తున్న స్పిరిట్ లో విలన్ మారాడని రెండు వారాల క్రితం వార్తొచ్చింది. కట్ చేస్తే ఈ విషపు ప్రచారాలకు బ్రేక్ పడబోతోందని ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్ట్ తో తేలింది. కట్ చేస్తే ఇంతలో రక్త చరిత్ర ఫేం వివేక్ ఓబేరాయ్ సీన్ లోకి వచ్చాడు. తన పోస్టర్ పేలింది.. తోడుగా ఉన్న ఆ లేడీ ఎవరనే ఎంక్వైరీ గూగుల్ సెర్చ్ లో పెరిగిపోయింది. దీంతో చాలా మంది ఇక కొరియన్ బాలయ్య అలియాస్ కొరియన్ స్టార్ విలన్ డాన్ లీ ఇందులో నటించట్లేదని ఆల్ మోస్ట్ అంతా కన్ఫామ్ చేస్తున్నారు. కాని అక్కడే కథ లో ట్విస్ట్ ఉందా? ఇంతవరకు కొరియన్ విలన్ డాన్ లీ స్పిరిట్ మూవీలో విలన్ గా చేస్తున్నాడని ఎలాగైతే సందీప్ టీం తేల్చలేదో, అలానే స్పిరిట్ లో డాన్ లీ విలన్ కాదు అని కూడా ఎక్కడా అఫీషియల్ గా కన్ ఫర్ మేషన్ రాలేదు. అంటే స్పిరిట్ లో ఇంకా కొరియన్ స్టార్ డాన్ లీ కనిపిస్తాడనే అనుకోవాలా? ఇంతకి సందీప్ రెడ్డి వంగ మనసులో ఏముంది? స్పిరిట్ సెట్లో ఏం జరుగుతోంది?

రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి కటౌట్ కి సందీప్ రెడ్డి వంగలాంటి డైరెక్టర్ తో సినిమా పడితే, బాక్సాఫీస్ బద్దలే.. ఇలా అనుకున్న బ్యాచ్ అందరి అంచనాలు పెంచేలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో స్పిరిట్ తెరకెక్కతోంది. ఆడియో గ్లింప్స్ పేలింది. ఫస్ట్ టైం రౌడీ పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటంతో, హైప్ కూడా అందుకు తగ్గట్టే పెరుగుతోంది.ఐతే ఇక్కడ సమస్య ఏంటంటే, సందీప్ రెడ్డి సినిమాల్లో వీలనిజం... యానిమల్ లో విలన్ వల్లేహీరోయిజం ఎలివేట్ అయ్యింది. సో చాక్లెట్ బాయ్ లాంటి రణ్ బీర్ కే బాబీ డియోల్ లాంటి విలన్ పడితే, మరి బాహబలి లాంటి కటౌట్ పోలిస్ గా కనిపించే మూవీలో, విలన్ ఎలా ఉండాలి.. మొన్నటి వరకు ప్రకాశ్ రాజ్ ఇందులో విలన్ అంటే, అతనెంత గొప్ప నటుడైనా, తను సరిపోడన్నారు.

ఇంతలో వివేక్ ఓబేరాయ్, వచ్చాడు. రక్త చరిత్రతో సౌత్ లో పాపులర్ అయిన తను, ఇంతకాలానికి మళ్లీ సాలిడ్ విలన్ రోల్ చేయబోతున్నాడనగానే, ఒక్కసారిగా అందరి లుక్ స్పిరిట్ మీద పడింది. మూలకు పడిపోయిన బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ని సరిగ్గా వాడతే, ఔట్ పుట్ ఎలా ఉంటుందో యానిమల్ మూవీతో చూపించాడు సందీప్..సో రక్త చరిత్రతో దుమ్ముదులిపిన వివేక్ ఒబేరాయ్, ఇప్పుడు సందీప్ చేతిలో పడ్డాడంటే, ప్రబాస్ కి తగ్గ విలన్ తయారౌతున్నట్టే అన్న ఊపు జనాల్లో కనిపిస్తోంది. కాని చిన్న డిసప్పాయింట్ మెంట్ ఏంటంటే, ఇందులో కొరియన్ స్టార్ డాన లీ ఉండడా? ఎందుకంటే వివేక్ ఓబేరాయ్ విలన్ అయితే, ఇక డాన్ లీ ఇందులో నటించనట్టే అని అంతా అనుకుంటున్నారు

ఇలా అయితే, కొరియా, చైనా,జపాన్ లో ఈ సినిమా రిచ్ ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కొరియన్ స్టార్ డాన్ లీ ఇందులో విలన్ గా నటిస్తే, జపాన్,కొరియా, వియత్నాం చైనా, ఇండోనేషియా మలేషియా ఇలా స్పిరిట్ రీచే పెరిగిపోతోంది. అలాంటిది డాన్ లీ లేకపోతే ఎలా అని అంతా అనుకుంటున్నారు. కాని సందీప్ రెడ్డి యానిమల్ లోనే ఒక్క విలన్ తో సరిపెట్టలేదు. స్పిరిట్ లాంటి మూవీలో బాహుబలి లాంటి కటౌట్ కి ఒక్క వివేక్ ఒబేయార్ లాంటి విలన్ ని పెట్టి సరిపెట్టేస్టాడా? కానే కాదు. అదే నిజమైతే, గతంలో ప్రభాస్ మూవీ సలార్ పోస్టర్ ని డాన్ లీ తన ఇన్ స్టా ఎకౌంట్ లో పోస్ట్ చేయాల్సిన పనిలేదు. ఒక్కో పాత్రిన పరిచయం చేస్తున్న సందీప్ డాన్ లీ పాత్రని కూడాత్వరలో ప్రకటిస్తాడని తెలుస్తోంది. సర్ ప్రైజ్ ఏదో గట్టిగానే ఉండేలా ఉంది.

Published : 
  • 2 March 2026, 3:30 PM IST