Top story: ఇరాన్ ను ఆక్రమించుకోవడానికి ట్రంప్ మాస్టర్ ప్లాన్..!

ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌...అనుకున్న లక్ష్యం నేరవేరుతుందా ? అయతుల్లా ఖమేనీని చంపేసినంత మాత్రాన...ఆ దేశం దారిలోకి వస్తుందా ? ప్రజలు కోరుకున్నట్లు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా ?

Post Published By: dialnews
Updated : 3 March 2026, 10:38 AM IST

ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌...అనుకున్న లక్ష్యం నేరవేరుతుందా ? అయతుల్లా ఖమేనీని చంపేసినంత మాత్రాన...ఆ దేశం దారిలోకి వస్తుందా ? ప్రజలు కోరుకున్నట్లు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా ? వెనెజువెలా ఫార్మూలానే...ఇరాన్‌లోనూ ట్రంప్ అమలు చేస్తారా ? ఇప్పడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యతో...అమెరికా, ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందు...రెండు దేశాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఐఆర్‌జీసీ, ఇరాన్‌ లీడర్లను అంతమొందించడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఖమేనీ హత్య తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇదే సరైన సమయమని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే అధికారాన్ని హస్తం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే అది అంత ఈజీ సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు నెలల్లో మూడు కీలక ఆపరేషన్లను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు ట్రంప్‌. జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించారు. ఫిబ్రవరి ప్రారంభంలో కొలంబియా డ్రగ్ డీలర్‌ ఎల్‌ మంచోను...ప్రియురాలి ద్వారా ఎరవేసి చంపేశారు. తాజాగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీకి పాడే కట్టేశాడు. దీంతో నెక్స్ట్‌ టార్గెట్‌ ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ఖమేనీ హత్య తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌లోనూ వెనెజువెలా ఫార్మూలాను అమలు చేసే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు మదురోను రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకుంది. ఆయన స్థానంలో డెల్సీ రోడ్రిగ్జ్‌‌‌‌ను తాత్కాలిక దేశాధ్యక్షురాలిగా నియమించింది. ఆమె ద్వారా ప్రస్తుతం వెనెజువెలా ప్రభుత్వాన్ని అమెరికా రిమోట్‌తో కంట్రోల్ చేస్తోంది. మదురోకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మారియా కొరినా మచాడోకు ఛాన్స్ ఇవ్వలేదు. అంటే వెనెజువెలాలో మదురో ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది. మదురో మాత్రమే కుర్చీలో లేడు.

ఇరాన్‌లోనూ ఇప్పుడు ఖమేనీ మాత్రమే లేరు. కానీ ఆయన భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఎంతోమంది నేతలు, సైనిక కమాండర్లు సజీవంగానే ఉన్నారు. వారంతా ఏకంగా ఉన్నన్ని రోజులు...ఇరాన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడటం సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయ, పాలనాపరమైన, సైనిక, సైద్ధాంతిక వ్యవస్థలను ఖమేనీ సిద్ధం చేసి పెట్టారు. ఒకవేళ ఎవరైనా ఒక నేత అమెరికాకు అనుకూలంగా వ్యవహరించినా స్థానికంగా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌‌... సైనిక చర్యతో నేతలను మాత్రమే అంతం చేసింది. కానీ వారి భావజాలాన్ని కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా సైన్యం ప్రమేయం చేసుకున్న అనేక దేశాల్లో భారీగా రక్తపాతం జరిగింది. 1960 - 1970 మధ్యకాలంలో వియత్నాంలో, 1989లో పనామాలో, 1984లో నికరాగ్వాలో, 2021లో అఫ్గానిస్థాన్‌లలో సీఐఏ ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చరిత్ర చెబుతోంది. 1950వ దశకంలో గ్వాటెమాలా వ్యవహారంలో అమెరికా సైనిక జోక్యం చేసుకోవడంతో...40 ఏళ్లపాటు అంతర్యుద్ధం జరిగింది. 2 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1980వ దశకంలో నికరాగ్వాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా...తిరుగుబాటుదారులకు అమెరికా ఆయుధాలను, ఆర్థిక సహాయాన్ని అందించింది. దీంతో అక్కడ దీర్ఘకాలిక అంతర్యుద్ధం జరిగింది.

పదివేల మంది చనిపోయారు. అమెరికా సైన్యం కాలుపెట్టాక ఇరాక్, అఫ్గానిస్థాన్‌లలోనూ తీవ్ర మారణహోమం జరిగింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పుకూలిపోయాయి. మొన్న ఉక్రెయిన్, నిన్న వెనెజువెలా ఇష్యూలలోకి వేలు పెట్టింది అమెరికా. తాజాగా ఇరాన్‌ వ్యవహారంలోకి ట్రంప్‌ తలదూర్చారు. ప్రస్తుతం ఇరాన్ టార్గెట్‌లో యావత్ పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ట్రంప్ అనాలోచిత నిర్ణయం వల్ల అమెరికా...అనవసర యుద్ధాన్ని కొని తెచ్చుకున్నారని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 
  • 3 March 2026, 10:38 AM IST