డబ్బున్న వాళ్ళ విడాకులు పెళ్లి కంటే ఖరీదైనవి అనే మాట ఇప్పుడు మరోసారి రుజువు అవుతోంది. సినిమా వాళ్ళు, క్రికెటర్లు ఈ విడాకులతో మానసికంగా, ఆర్ధికంగా భారీగా నష్టపోతున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ కు ఈ సెగ తగిలింది. ఆయన భార్య సంగీతతో.. విడాకుల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 26 ఏళ్ల వైవాహిక బంధం ఇప్పుడు విడాకుల దిశగా వెళ్ళడం.. విజయ్ ఫ్యాన్స్ ను షాక్‌కు గురిచేసింది.
పెళ్లైన 26 ఏళ్ల తర్వాత సంగీత సోర్నలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్‌కు ఒక నటితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే, తాను విడాకులు కోరుతున్నట్లు సంగీత తన పిటిషన్లో పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. 2021లోనే ఈ విషయం తనకు తెలిసిందని, దీనివల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం వల్ల తన ఇద్దరు పిల్లలు (జాసన్ సంజయ్, దివ్య సాష) కూడా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని సంగీత ఆవేదన వ్యక్తం చేసారు.
అక్కడి నుంచి ఈ విడాకులు సంచలనంగా మారి.. క్రికెటర్ ల మాదిరిగా భారీ భరణం దిశా వెళ్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కోర్టు బయట ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి విజయ్ సుమారు రూ. 250 కోట్లు భరణంగా ఇవ్వడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ మొత్తం ఆస్తి రూ. 600 కోట్లుగా అంచనా వేస్తుండగా, అందులో 50% అంటే రూ. 300 కోట్లు సంగీత కోరుతున్నట్లు టాక్ వినపడుతోంది. విజయ్ కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన తరుణంలో ఈ విడాకుల వార్తలు రావడం చర్చనీయాంశమైంది.
దీనిపై ఆయన పార్టీ స్పందిస్తూ.. ఇది విజయ్ వ్యక్తిగత విషయమని, దీనిపై చర్చించడం అనవసరమని పేర్కొంది. కార్యకర్తలు కేవలం రాబోయే ఎన్నికలపైనే దృష్టి సారించాలని సూచించింది. గత కొన్నాళ్లుగా విజయ్, నటి త్రిష మధ్య సాన్నిహిత్యం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది, అయితే దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా.. ఇద్దరూ ఓ వివాహానికి కలిసి హాజరు అయ్యారు. దాదాపుగా అఫీషియల్ చేసేసారు అంటూ డిస్కషన్ మొదలైంది.
త్రిషతో కలిసి రావడం కారణంగా.. విమర్శలు చేసే వాళ్లకు విజయ్ తన మార్క్ ఆన్సర్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. విమర్శించే వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా, పాలిటిక్స్ పై ఫోకస్ చేసే ప్రయత్నం విజయ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. విజయ్ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వివాదాన్ని సామరస్యంగా ముగించాలని భావిస్తున్నట్లు తమిళ నాట టాక్ మొదలైంది.
2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ వివాదం సద్దుమణిగితే ఆయనకు కలిగే నష్టం తక్కువ. అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు ఈ విడాకుల అంశాన్ని.. విజయ్ క్యారెక్టర్ ను ప్రశ్నించడానికి అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి విజయ్ టీమ్ ఇప్పటికే 'వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయాలు వేరు' అనే ప్రచారాన్ని బలంగా వినిపిస్తోంది. సంగీత కోరుతున్న భారీ భరణం దాదాపుగా 300 కోట్లు విజయ్ ఇస్తే మాత్రం, పార్టీ నిర్వహణ, ఎన్నికల ఖర్చులపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది.
తమిళనాట ప్రజలు తమ నాయకుడిని కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా, 'నైతిక విలువలు కలిగిన వ్యక్తి'గా కూడా చూస్తారు. సంగీత తన పిటిషన్ లో చేసిన వివాహేతర సంబంధం ఆరోపణలు.. విజయ్ సంపాదించుకున్న "ఫ్యామిలీ మ్యాన్" ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. విజయ్ పార్టీకి ప్రధాన బలం యువత. వీరు సాధారణంగా పర్సనల్ లైఫ్, రాజకీయాలను వేర్వేరుగా చూస్తారు. కాబట్టి ఓటు బ్యాంకుపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని మరి కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, మధ్యవయస్కులు, మహిళా ఓటర్ల ఆలోచనా విధానం ఈ విషయంలో కీలక పాత్ర పోషించవచ్చు.