రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు చిన్న బ్రేక్ తీసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ నే యామినల్ గా చూపించిన ఈ డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే, బాక్సాఫీస్ బద్దలే అనే అభిప్రాయముంది. అన్నట్టుగానే ఈ కాంబినేషన్ లో స్పిరిట్ తెరకెక్కుతోంది. ఐతే యానిమల్ లో ఉన్నట్టే ఇందులో ఇంట్రవెల్ బ్యాంగ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ప్లాన్ చేసినట్టున్నాడు. ఏకంగా 70 కోట్ల ఖర్చుతో భారీ సెట్లో మైండ్ బెండింగ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టున్నాడీ దర్శకుడు. యానిమల్ లో పంజాబీ పాటని హీరో బంధువులైన సర్దార్ లు పాడుతుంటే, విలన్ బ్యాచ్ ని కత్తికో కండలా గొడ్డలితో వేసేస్తుంటాడు రణ్ బీర్...అందుకే ఈ మూవీకి యానిమల్ అని పేరు పెట్టారు.. మరి యానిమల్ ని మించే డైనోసార్ ని చూపించాలంటే ఎలాంటి సీన్ పడాలి? కల్కీ సీక్వెల్ వల్ల వచ్చిన బ్రేక్ ని, షాక్ ఇచ్చేందుకు సందీప్ ఎలా వాడుకోబోతున్నాడు? బాహుబలి కత్తి వదిలి గ్రైనైడ్లని గన్నులా వాడితే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడా? ఇంతకి కొత్తగా కిక్ ఇస్తున్న స్పిరిట్ మూవీ లీకేంటి?
స్పిరిట్ మూవీలో ఒకటి కాదు రెండు కాదు,ఏకంగా 30 హైవోల్టేజ్ ఫైట్ సీన్స్ తో ఫిల్మ్ టీం మైండ్ బ్లాంక్ చేయబోతోందా? ఈ ప్రశ్నకు సమాధానం 70 కోట్ల ఖర్చుతో రెడీ అయిన సెట్...ఔను అందులోనే ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ని షూట్ చేయబోతున్నారు. నిజానికి...రెబల్ స్టార్ ప్రభాస్ ని బాహుబలిలో దుమ్ముదులిపే సీన్స్ లో చూశాం.వార్ సీన్స్ లో తన కటౌట్ కి తగ్గ యాక్షన్ ఎపిసోడ్స్ లో చూశాం.. కట్ చేస్తే మళ్లీ ఇన్నేళ్ళలో తనని ఆరేంజ్ లో ఏదర్శకుడు చూపించలేకపోయాడు.. సలార్ లో మైండ్ బెండింగ్ సీన్స్ ఉంటాయనకుంటే, అందులో ఒకే ఒక్క ఫైట్ సీన్ పెట్టారు... అది బానే ఉన్నా, సలార్ తాలూకు అసలు కథంతా రెండో భాగంలో ఉందన్నారు... సాహోలో క్లైమాక్స్ ఫైట్ సీన్ ఇలానే ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించింది.
కల్కీలో కర్ణుడి సీన్ మైండ్ బ్లాంక్ చేసింది. కాని ఇవన్నీ నిజంగా రెబల్ స్టార్ రేంజ్ కి కాసేపే చూపించాయి... తన కటౌైట్ కి తగ్గ సీన్లు, సిచ్చేవేషన్లు కనీసం నాలుగైదు పడితే తప్ప, బాహుబలి కటౌట్ ని సాలిడ్ గా వాడుకున్నారనలేం... అసలు ప్రభాస్ లాంటి కటౌట్ స్క్రీన్ మీదుంటే, కథే అవసరం లేదంటారు.. వరుసగా ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు పెట్టుకుంటూ పోయి, మధ్యలో సీన్లు రాస్తే చాలని కామెడీగా అన్నా.. రియాలిటి చూస్తే అదే నిజంలా అనిపిస్తుంది.కేవలం తను నడుచుకుంటూ వస్తే ఆ సీనే పేలిపోతుంది.
అలా విష్ణు కన్నప్పలో కాసేపు నడుస్తూ కనిపించిన సీన్ తోనే స్క్రీన్ ని షేక్ చేశాడు ప్రభాస్.. అంత ఔరా తన సొంతం.. అలాంటి తనని మిర్చీలో కొరటాల శివ, బాహుబలి, చత్రపతిలో రాజమౌలి వాడుకున్నట్టు ఎవరై వాడుకోలేదనే అభిప్రాయం ఉంది... ఆ వెలితిని, ప్రభాస్ ఆకలిని సందీప్ రెడ్డి వంగ తీర్చేలా ఉన్నాడు.ఒక్క సినిమాలో 30 యాక్షన్ ఎపిసోడ్స్ తో థియేటర్ నే పేల్చేసేలా ఉన్నాడు. ఔను ప్రబాస్ లాంటి కటౌట్ కి యానిమల్ రేంజ్ ఫైట్ సీన్ ఒక్కటి కాదు, రెండున్నరడజన్ల సీన్లు పడేలా ఉన్నాయి.. ముప్పై మూడు సెట్లు కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే రెడీ చేస్తున్నారు. అందులో ఒక సెట్ కే 70 కోట్లంటే చిన్న విషయం కాదు. ఇలాంటి ప్లానింగ్ ఉంది కాబట్టే, స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినా, కల్కీ 2 షూటింగ్ జరుగుతున్నా, సందీప్ మాత్రం తడిగుడ్డేసుకుని కూల్ గా కూర్చుంటున్నాడు. సాలిడ్ ప్లానింగ్ తో ఉన్నట్టే కనిపిస్తున్నాడు.