GOLDEN TRIANGLE.. 1969 రియల్ స్టోరీ…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇంతవరకు మాస్ సినిమాలు చేశాడు. ఫాంటసీ జోనర్ ని కూడా టచ్ చేశాడు. విలనిజం చూపించేందుకు టెంపర్, జై లవకుశ లాంటి ప్రయోగాలు చేశాడు

Post Published By: dialnews
Updated : 9 March 2026, 7:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇంతవరకు మాస్ సినిమాలు చేశాడు. ఫాంటసీ జోనర్ ని కూడా టచ్ చేశాడు. విలనిజం చూపించేందుకు టెంపర్, జై లవకుశ లాంటి ప్రయోగాలు చేశాడు. ఇంతవరకు చేయంది ఏదైనా ఉందంటే అది రియాల్ స్టోరీస్.. ఔను తన కెరీర్ లో ఫస్ట్ టైం చాలా రియలిస్టిక్ మూవీ చేయబోతున్నాడు. రియల్ ఇన్స్ డెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న మూవీతో మైండ్ బ్లాంక్ చేయబోతున్నాడు. అదే ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తను చేస్తున్న డ్రాగన్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు ఇదో డ్రగ్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న సినిమా అని మాత్రమే ప్రచారం జరిగింది. కాని భూటాన్ కి చెందిన ఒక ఇండో భూటానియన్ కథే ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కుతోందన్న విషయం లేటుగా బయటికొస్తోంది. ఇంతకి ఇందులో ఎన్టీఆర్ భూటాన్ లో పుట్టిన ఇండియన్ లా కనిపిస్తాడా? ఎవరి రియల్ స్టోరీని బేస్ చేసుకుని డ్రాగన్ కథ పట్టాలెక్కింది?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని టెంపర్ లో నెగెటీవ్ ఫీల్ ఉన్న పాత్రలో చూశాం. జైలవకుశలో విలనిజాన్ని చూశాం... ఇక ఆది నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు మాస్ పాత్రలో పాతుకుపోయిన ఎన్టీఆర్ జర్నీ చూశాం.. అలాంటి తను ఇప్పుడు ఫస్ట టైం రియలిస్టిక్ మూవీ చేయటం చూడబోతున్నాం.

ఎగ్జాక్ట్ గా ఆటో బయోగ్రఫి అనలేం.. కాని అలాంటి సాహసానికే మాస్ మంత్రం వేస్తున్నారు.అలా తెరకెక్కుతోంది డ్రాగన్ మూవీ. ఇది ఇండియా, భూటాన్, చైనా బోర్డర్ లో అది కూడా సిక్స్ టీస్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా. అంతవరకు ఇప్పటి వరకు జరిగిన ప్రచారం.. కాని భూటాన్ లో డ్రాగన్ నిక్ నేమ్ తో చెంచో డ్రక్ అన్న వ్యక్తి జర్నీనే డ్రాగన్ గా రాబోతోందని తెలుస్తోంది. భూటాన్ భాషలో చెంచో డ్రక్ పేరులో డ్రక్ అంటే డ్రాగన్ అని అక్కడి భాషలో అర్ధం.

భూటాన్ కూడా ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని పిలుస్తారు.. అయితే ఒక ఇండియన్ తండ్రికి, భూటాన్ తల్లికి పుట్టిన హాఫ్ ఇండియన్ కథే చెంచో డ్రక్.. అనుకోకుండా డ్రగ్ ఇష్యూలో ఇరుక్కుని తర్వాత డాన్ అయిన తర్వాత జనాన్ని కాపాడుతూనే ఆ దారి నుంచి బయట పడేందుకు ఏం చేశాడు... ఆ ప్రాసెస్ లో తన తండ్రి ఎలా మరణించాడనే అంశం ఆధారంగా అక్కడ చాలా నవలలు వచ్చాయని తెలుస్తోంది.

సో ఆ కథనే ప్రేరణగా, ఇప్పుడు డ్రాగన్ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ పాపులర్ అయిన చెంచో నవల రైట్స్ తీసుకున్నారో. లేదంటే తండ్రి ఇండియన్, కొడుకు ఇండియన్ కాబట్టి కనెక్టైన అంశంతో, ఫిక్షన్ యాడ్ చేసి కొత్త కథ రాసుకున్నారో కాని, డ్రాగన్ స్టోరీ బ్యాక్ డ్రాప్ వెనకున్న సీక్రెట్ ఇక మీదట ఏమాత్రం సీక్రెట్ కాదని తెలుస్తోంది.అయితే ఇక్కడ తండ్రి కొడుకుల కథనే, తాత, మనవళ్ల కథగా మార్చి, పాన్ ఆసియా ప్రాజెక్ట్ గా ప్రశాంత్ నీల్ మార్చేస్తున్నాడనంటున్నారు. చైనా, కొరియాలో చెంచు కథ కూడా పాపులర్ అవటంతో, డ్రాగన్ ఆయన కథతోనే వస్తోందంటే, ఈజీగా అక్కడి మార్కెట్ లో రీచ్ పెరుగుతుంది. కాని లీగల్ గా ఆ నవల రైట్స్ కొంటేనే ఈ పాయింట్ ని క్లేమ్ చేసుకుని, పబ్లిసిటీకి వాడుకోగలుగుతారు.. సో అదే జరిగితే, పాన్ ఆసియాలో ఎన్టీఆర్ జెండా ఎగరేయటం అంత కష్టమేమి కాదని తేలిపోతోంది.

Published : 
  • 9 March 2026, 7:50 PM IST