నక్కల వేట కాదు కుంభస్థలమే…!

దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు 'దేవర 2' మీద ఉన్నాయి. అసలు రెండో భాగం బడ్జెట్ ఎంత?

Post Published By: dialnews
Updated : 12 March 2026, 6:50 PM IST

దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన విధ్వంసం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి కళ్లు 'దేవర 2' మీద ఉన్నాయి. అసలు రెండో భాగం బడ్జెట్ ఎంత? సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలు తారక్ అభిమానుల్లో క్యూరియాసిటిని పెంచుతున్నాయి. దేవర పార్ట్ 2 సినిమా ఆగిపోయిందనే రూమర్లకు చెక్ పడింది. నిర్మాతలు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా మరియు War 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2026 మే నెలలో 'దేవర 2' సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

2027లో సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర 1 బడ్జెట్ దాదాపు 200 - 300 కోట్లు. ఇందులో అధిక భాగం విజువల్ ఎఫెక్ట్స్ మరియు అండర్ వాటర్ సీక్వెన్స్‌లకే ఖర్చుపెట్టారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, రెండో భాగం కోసం మేకర్స్ సుమారు 350 నుండి 400 కోట్ల వరకు వెచ్చించబోతున్నారు. రెండో భాగంలో యుద్ధ సన్నివేశాలు, సముద్రతీర పోరాటాలు మొదటి పార్ట్ కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయట. విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ కావడంతో ఆయన రెమ్యునరేషన్ కూడా ఈ బడ్జెట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.

జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాత్రలు పార్ట్ 2లో మరింత కీలకంగా మారబోతున్నాయి. వారి పాత్రల నిడివి పెరగడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. అనిరుధ్ మ్యూజిక్ కోసం కూడా భారీగానే కేటాయించారట. ఇక, దేవర పాత్ర చనిపోయిందా లేక బతికే ఉందా? సముద్రంలో ఆ దాచిన రహస్యం ఏంటి? అనే అంశాల చుట్టూ పార్ట్ 2 తిరుగుతుంది. కొరటాల శివ మాటల్లో చెప్పాలంటే.. "పార్ట్ 1 కేవలం 10% మాత్రమే, అసలైన విశ్వరూపం పార్ట్ 2లో చూస్తామట.

Published : 
  • 12 March 2026, 6:50 PM IST