ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్-ఛార్జ్ మంత్రితో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. "అసలు డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ పార్టీలకు వెళ్లాల్సిన పని ఏమొచ్చింది?" అని నిలదీశారు.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని అవకాశమిస్తే, పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వారిని మోయాల్సిన అవసరం లేదని, గతంలోనూ క్రమశిక్షణా ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించామని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు.