Top Story: క్యాబినెట్లో ఎవరు ఇన్? ఎవరు అవుట్…?

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన... విస్తరణ జరగబోతోంది. క్యాబినెట్లో మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు భర్తీ చేయడమే కాకుండా, ముగ్గురు లేదా నలుగురిని మంత్రులుగా తప్పించి కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.

Post Published By: dialnews
Updated : 23 March 2026, 9:21 AM IST

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ ప్రక్షాళన... విస్తరణ జరగబోతోంది. క్యాబినెట్లో మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు భర్తీ చేయడమే కాకుండా, ముగ్గురు లేదా నలుగురిని మంత్రులుగా తప్పించి కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. మంత్రులుగా తప్పించిన సీనియర్ల కు ఏఐసిసి, సి డబ్ల్యూ సి లో స్థానం కల్పించి వాళ్లను తృప్తి పరచాలని నిర్ణయించింది హై కమాండ్. ఈసారి క్యాబినెట్ విస్తరణలో బీసీలు, ఎస్సీలకే పెద్దపీట వెయబోతోంది పార్టీ.

రాష్ట్ర మంత్రివర్గంలో రెండు స్థానాలు ఎప్పటినుంచో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయబోతున్నారు . బీసీల్లో ఎక్కువ సంఖ్య బలం ఉన్న మున్నూరు కాపు వర్గానికి, అలాగే ఎస్టీల్లో ఎక్కువ బలమున్న లంబాడాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈసారి కౌన్సిల్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఈ లీడర్ కి ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చినట్లు పార్టీలో టాక్.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని... అందువలన తనకు పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాడు. తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే అధిష్టానానికి ఈ గొడవ అంతా తెలిసింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఖాయం. అయితే ఇటీవల కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న, రాజగోపాల్ రెడ్డి సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది. ఆయనకు సి డబ్ల్యూ సి లో స్థానం కల్పించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆ విషయం కోమటిరెడ్డి వెంకట రెడ్డికి కి అధిష్టానం చెప్పిందని పార్టీలో టాక్ .

ఇక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కి కచ్చితంగా మంత్రి పదవి దక్కనుంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ , జూపల్లి కి పదవి గండం ఉంది. సురేఖ, పొన్నం గౌడ్ ఇద్దరు బీసీలే కనుక వారిని తొలగిస్తే వారి స్థానంలో మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించవచ్చు. సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే రెడ్లకు మరో మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది చూడాలి. అలాగే బాలు నాయక్, రామచంద్రనాయక్ ఇద్దరిలో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కబోతోంది.

రామచంద్రనాయక్ కి గతంలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చినప్పటికీ ఆయన దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో బాలునాయక్ లేదా రామచంద్రనాయక్ లో ఒకరికి కచ్చితంగా అవకాశం ఉంటుంది. తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న కొండా సురేఖ, అవినీతి ఆరోపణలు వచ్చిన పొన్నం ప్రభాకర్ గౌడ్ పై వేటు తప్పదని తెలుస్తోంది. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. మహేష్ గౌడ్ కి మంత్రి పదవి ఇచ్చి,పీసీసీ చీఫ్ పదవి ని ఒక సీనియర్ నేతకు కట్టబెట్టే అవకాశం ఉంది. అలాగే పొన్నం గౌడ్ ని మంత్రిగా తొలగించి ఆయనకు పిసిసి ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు.

ప్రక్షాళనలో భాగంగా కొందరికి శాఖలు మార్పు కూడా ఉండవచ్చు . ఆర్థిక, విద్యుత్, శక్తి వనరుల శాఖలు చూస్తున్న భట్టి విక్రమార్క శాఖలో మార్పు ఉండవచ్చు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూస్తున్న రెవెన్యూ శాఖలోనూ మార్పులు జరగవచ్చు. ఏదేమైనా ఏప్రిల్ మొదటి వారంలో జరగబోతున్న క్యాబినెట్ విస్తరణ.... ప్రక్షాళన.. ప్రభుత్వంలో వేగం పెంచనుందని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం హై కమాండ్ దగ్గర హవా నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలోను తన మార్కు చూపించబోతున్నారు.

 

Published : 
  • 23 March 2026, 9:21 AM IST