పాకిస్థాన్ తాటతీసే ప్రభాస్…!

కల్కి 2898 AD' వంటి గ్లోబల్ హిట్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ 'ఫౌజీ'. 'సీతారామం'తో క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Post Published By: dialnews
Updated : 24 March 2026, 4:15 PM IST

కల్కి 2898 AD' వంటి గ్లోబల్ హిట్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ 'ఫౌజీ'. 'సీతారామం'తో క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో సాగే ఈ చారిత్రక కల్పిత గాథలో నటిస్తున్న నటీనటుల వివరాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఎవరు నటిస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ, మేకర్స్ ఇమాన్వీ ఇస్మాయిల్ ను కథానాయికగా పరిచయం చేశారు. సోషల్ మీడియాలో తన అద్భుతమైన డాన్స్ వీడియోలతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ ఢిల్లీ బ్యూటీ, 'ఫౌజీ'తో వెండితెరపై అడుగుపెడుతోంది.

ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సరసన డెబ్యూ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆమె కళ్లు, క్లాసికల్ డాన్స్ నైపుణ్యం ఈ పీరియడ్ రోల్‌కు సరిగ్గా సరిపోతాయని దర్శకుడు హను ఆమెను ఎంపిక చేశారు. ఫౌజీ' సినిమా కాస్టింగ్ కేవలం యంగ్ స్టార్స్‌కే పరిమితం కాలేదు. భారతీయ సినిమా దిగ్గజాలు సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.బాలీవుడ్ డిస్కో కింగ్ మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలనాటి అందాల తార జయప్రద చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ రోల్‌తో తెలుగు తెరపై మెరవనున్నారు. విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు.

వీరితో పాటు భాను చందర్, రాహుల్ రవీంద్రన్ వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. హను రాఘవపూడి ఆస్థాన సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. 'సీతారామం' మ్యాజిక్‌ను మించి సాంగ్స్ ఉంటాయని టాక్. సుదీప్ ఛటర్జీ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60% పైగా చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. తొలుత ఆగస్టు 2026లో అనుకున్నప్పటికీ, లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 2026 విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ ఒక సైనికుడిగా, ప్రేమికుడిగా ఎలా కనిపిస్తాడో చూడాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు.

Published : 
  • 24 March 2026, 4:15 PM IST