మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ధురందర్ 2 తర్వాత ఆదిత్య ధర్ తో ఎన్టీఆర్ సినిమా అని ఆల్రెడీ ఒక ప్రచారం మొదలైంది. సందీప్ రెడ్డి వంగతో కూడా ఎన్టీఆర్ సినిమా వచ్చే ఏడాది అంటూ ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ రెండు ఈఏడాది వరకైతే అబద్దాలే... రెండీంట్లో ఏది కూడా నిజం కాదు.. అలాని ఆ అబద్ధాలు ఎప్పటికీ నిజం కాకుండా ఉండాలని లేదు. కాకపోతే, ఆ రెండు అబద్దాల బెండు తీసే, బాంబు లాంటి నిజం మాత్రం, పేలబోతోంది.. వారనాసి టీం ఒక్క సారి రంగంలోకి దిగితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కంటే కూడా ఎక్కువ, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్సే పండగ చేసుకునే ఛాన్స్ఉంది.. రాజమౌలి ఒక్క మాటతో ఎన్టీఆర్ కెరీర్ లో మరోసారి తూటా పేలే ఛాన్స్ ఉంది.. ఇంతకి వారణాసికి ఎన్టీఆర్ కి ఉన్న లింకేంటి? ఆ బాంబులాంటి నిజం ఏంటి?
2 మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యూచర్ తాలూకు రెండు బాంబులు, ఒక అణుబాంబు పేలినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ధురందర్ 2 హిట్ కాగానే ఆ సినిమా దర్శకుడిని మెచ్చుకుంటూ ఎన్టీఆర్, మహేశ్ బాబు ట్వీట్లు పెట్టారు. వెంటనే ఇక ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ తోనే అనేశారు..అది ఖచ్చితంగా అబద్దమే. ఎందుకంటే ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాల తర్వాత, దేవర 2, అలానే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నాడు.నెల్సన్ దిలీప్ కి కూడా బల్క్ గా డేట్లిచ్చాడు. అలాచూస్తే మరో రెండు మూడేళ్ల వరకు ఎన్టీఆర్ డైరీలో ఖాలీలేదు.. కాబట్టి ఇప్పుడప్పుడే ధురందర్ డైరెక్టర్ తో సినిమా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టే ఆ కాంబినేషన్ అబద్దం.. అలాని ఎప్పటికీ ఈ కాంబినేషన్ సెట్ అవదనికాదు, గతంలో ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఆదిత్య ధర్ స్టోరీ చెప్పాడని తెలుస్తోంది. కాని ప్రాక్టికల్ గాఈ కాంబినేషన్ ఇప్పుడే ఓకే అయ్యేఛాన్స్ మాత్రం లేదు.
ఇక సందీప్ రెడ్డి వంగ కూడా ఎన్టీఆర్ తో ఎన్నోసార్లు కలిశాడు. ఇద్దరూ కథల మీద చర్చలు చేశారని ప్రచారం జరిగింది.అందులో ఎలాంటి అబద్దం లేదు. కానీ ఈ కాంబినేషన్ లో సినిమా మాత్రం ప్రస్తుతానికి అబద్దం. రెండేళ్ల తర్వాత నిజం.. ఎందుకంటే కనీసం రెండు నుంచి మూడేళ్ల వరకు ఈ కాంబినేషన్ కూడా కుదిరేలా లేదు. 4 సినిమాలతో ఎన్టీఆర్ బిజీ.. స్పిరిట్ తర్వాత యానిమల్ 2 తో సందీప్ బిజీ కాబోతున్నాడు.. కాబట్టి వీల్ల కాంబినేషన్ వచ్చే ఏడాది అనే వార్తలో నిజం లేదని తెలుస్తోంది.ఇక బాంబులాంటి నిజం మాత్రం తేలాలి.. అదే రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే అని.. అది సోలోగానా? త్రిబుళ్ ఆర్, బాహుబలి లా మల్టీ స్టారర్ గా ఉంటుందా అన్నది తేలలేదు. కాని ఎన్టీఆర్ కి మాత్రం జక్కన్న నుంచి సమాచారం వెళ్లినట్టు, ఈ ఇద్దరు కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజానికి దగ్గరగా ఉన్నా, ఇదే నిజమనే బాంబు పేలాలంటే వారణాసి నుంచి ఒక వండర్ జరగాలి.అదే డైలాగ్స్ తో కూడిన గ్లింప్స్ లేదంటే, టీజర్.. దాన్ని లాంచ్ చేసేప్పుడే రాజమౌళి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చేచాన్స్ఉందట. అయినా వారనాసి ప్రమోషన్ ముందు టాపిక్ డైవర్ట్ అయ్యేలా మరో ప్రాజెక్ట్ గురించి ఎందుకు చెబుతాడు అన్న ప్రశ్న సరైందే.. కాని దానికి మాత్రం ఏదో సర్ ప్రైజింగ్ ఆన్సర్ ఉన్నట్టుంది. అది వస్తే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ తాలూకు బాంబు లాంటి నిజం బయట పడే ఛాన్స్ఉంది.