2 భాగాలు.. 2 నెలల గ్యాప్.. 2 సునామీలు..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసే పద్దతిలోనే రిలీజ్ అయ్యేలా ఉంది. రెండు భాగాలుగా డ్రాగన వస్తుందనే ప్రచారం ఉంది.. ఇక మూవీలో కూడా హీరో రెండు పాత్రల్లో కనిపిస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది

Post Published By: dialnews
Updated : 30 March 2026, 6:03 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసే పద్దతిలోనే రిలీజ్ అయ్యేలా ఉంది. రెండు భాగాలుగా డ్రాగన వస్తుందనే ప్రచారం ఉంది.. ఇక మూవీలో కూడా హీరో రెండు పాత్రల్లో కనిపిస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది.అయితే ఇప్పుడు90 రోజుల ఇంటర్వెల్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. రెండు భాగాలు, రెండు నెలలు, 2 పూనకాలాన్న ఫార్ములాతో డ్రాగన్ ని రెడీ చేస్తోంది ప్రశాంత్ నీల్ టీం. అంటే 2027 మీద ఎన్టీఆర్ ఒకే మూవీలో రెండు పాత్రలతో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా? కానే కాదు.. వచ్చే ఏడాది ఒకే సీజన్ లో రెండు సినిమాలతో డబుల్ ఎటాక్ ఇవ్వబోతున్నాడు.. ఒక్కో పాత్రతో ఒక్కో మూవీలో మాస్ మతిపోగొట్టే ప్రయత్నం జరగేలా ఉంది. ఈవిషయంలో 4 వేల కోట్ల నెంబరే, డ్రాగన్ టీం కి ధైర్యాన్నిస్తోందా? అదెలా?

డ్రాగన్ టీం ని నిజంగా ధురంగర్ మూవీ ఇన్స్ పైర్ చేసిందా? లేదంటే ముందునుంచే ఒక ప్లాన్ లో డ్రాగన్ టీం ఉందా? ఏది నిజమైనా కాని, డ్రాగన్ గా ఎన్టీఆర్ సోలోగా కాకుండా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు. అది కూడా డబుల్ ధామాకాతో.. కేవలం 60 రోజుల నుంచి 90 రోజుల గ్యాప్ లో తన రెండు సినిమాలు బాక్సాఫీస్ బెండ్ తీసేలా ఉన్నాయి.ఆ రెండుమూవీలకు ముహుర్తాలు కుదిరాయి. ఒకటి 2027 సంక్రాంతికి రాబోతుంటే, రెండో ది ఉగాదికి రావటం కన్ఫామ్ అయ్యింది. ఇంతవరకు గ్లింప్స్ రాలేదు. టీజర్ వదల్లేదు. అలాంటిది ఏకంగా సంక్రాంతి, ఉగాది, ఇలా 60 నుంచి 90 రోజుల గ్యాప్ లో రెండు భాగాలుగా డ్రాగన్ వస్తుందంటే, ఎవరైనా నమ్ముతారా? అందుకే ఒకే సారి రెండు బాంబులు పేల్చబోతోంది డ్రాగన్ టీం.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా, నెల ముందు గ్లింప్స్, బర్త్ డే రోజు టీజర్, ఇక మే 19న పాటని లాంచ్ చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఐతే అసలు సర్ ప్రైజ్ ఇది కాదు.. అంతకుమించిన అప్ డేట్ రెడీ అవుతున్నట్టుంది. అదే రిలీజ్ డేట్, అది కూడా ఒకటి కాదు, రెండు రిలీజ్ డేట్లు.. సరే ఒక రిలీజ్ డేట్ కి రిలీజ్ కాకపోతే, వాయిదా వేసి, మరో రిలీజ్ డేట్ బ్యాక్ అప్ పెట్టుకున్నారేమో అనుకుంటే, అసలు అది కారణమే కాదు.ఎందుకంటే ధురందర్ మూవీ రెండు భాగాలుగా తీసి, నెలల గ్యాప్ లోనే రెండు మూవీలను విడుదల చేసింది ఫిల్మ్ టీం.

అచ్చంగా ఇలానే వారణాసి మూవీని కూడా రెండు భాగాలు తీసిన ప్రపంచమంత ప్రమోట్ చేసి, రెండు లేదా మూడు నెల లగ్యాప్ లోనే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయం రాజమౌళికొచ్చినట్టుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు, ప్లానింగ్ జరుగుతోంది.మరి ధురందర్, వారణాసి టీం లప్రేరణతో ప్లాన్ చేశారో? లేదంటే గతంలో ప్రచారం జరిగినట్టు, డ్రాగన్ ని సంక్రాంతికి, డ్రాగన్ 2 ని ఉగాదికి ప్లాన్ చేశారో.. మొత్తానికి రెండు భాగాలు 60 నుంచి 90 రోజుల గ్యాప్ లో రిలీజ్ అవటం పక్కాగా కనిపిస్తోంది. రెండు పాత్రల్లో కనిపించనున్న ఎన్టీఆర్, ఒక పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ మొదటి భాగంలో, రెండో పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ రెండో భాగంలో చూపిస్తూ.. పూనకాలు తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

Published : 
  • 30 March 2026, 6:03 PM IST