వారణాసి 2 వెనక IMAX..ఒక్క పాట 100 కోట్లు…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఒక్కసారి కాదు రెండు సార్లు కన్ఫామ్ అయ్యింది. వచ్చే వారం వారణాసి టీం ఏదో ఘనంగానే ఎనౌన్స్ మెంట్ ని రెడీ చేస్తోంది. ఆల్రెడీ ఇండ్రస్ట్రీకి ఉప్పందించింది ఫిల్మ్

Post Published By: dialnews
Updated : 31 March 2026, 5:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఒక్కసారి కాదు రెండు సార్లు కన్ఫామ్ అయ్యింది. వచ్చే వారం వారణాసి టీం ఏదో ఘనంగానే ఎనౌన్స్ మెంట్ ని రెడీ చేస్తోంది. ఆల్రెడీ ఇండ్రస్ట్రీకి ఉప్పందించింది ఫిల్మ్ టీం. వారణాసి ఒక భాగం కాదు, రెండు భాగాలనే కొత్త నిర్ణయం వెనక ఐమ్యాక్స్ థియేటర్సే కారణం అంటున్నారు. నెట్ల ఫ్లిక్స్ సంస్థకూడా వారాణాసి రెండు భాగాలుగా తెరకెక్కాలని పట్టుపట్టిందని తెలుస్తోంది. ఆల్రెడీ రాజమౌళి కూడా చాలా కాలంగా ఒక భాగమా? రెండు భాగాలు తీయాలా అన్న విషయంలో కన్ ఫ్యూజ్ గా ఉణ్నాడు. కేవలం 4 గంటల నిడివితో ఒకే భాగంగా తీస్తమని ప్రకటించాడు. కూడా కట్ చేస్తే ఇప్పుడు నిర్ణయం మారింది.. వచ్చ వారం భారీ ఎనౌన్స్ మెంట్ వచ్చేలా ఉంది. ఐతే ఇంతకి ఐమ్యాక్స్ , నెట్ ఫ్లిక్స్ వల్లే ఎందుకు వారణాసి రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు..? వాళ్లు అంతగా ప్రెజర్ పెట్టడం వెనక ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? ఇలాంటి టైంలో ఒకే ఒక్క పాటకోసం 100 కోట్ల ఖర్చంటే ఆ వార్త కూడా వైరలౌతోంది.. ఇంతకి వారణాసిలో ఏం జరుగుతోంది?

వారణాసి టైటిల్ కి క్యాప్షన్ గా గ్లోబ్ ట్రాటర్ అనుంటుంది. అంటే గ్లోబ్ ని చుట్టేసే సాహసికుడని అర్ధం... అంటే వారణాసి లో హీరో భూమినిచుట్టేస్తాడని తేల్చేశాడు రాజమౌళి. ఇప్పుడు కొత్త అప్ డేట్ ఏంటంటే, ఇది ఎట్టిపరిస్థితుల్లో రెండు భాగాలుగా తెరకెక్కాల్సిందే నట.. ఈ నిర్ణయం రాజమౌళి తీసుకుంది కాదు..తీసుకోవాల్సి వస్తోంది.మొన్నటికి మొన్న వారణాసిమూవీని మూడున్నర నుంచి నాలుగు గంటల నిడివితో ఒకే భాగంగా రిలీజ్ చేస్తామన్నాడు రాజమౌలి. కాని ఇప్పుడు లెక్కలు మారాయి. సీన్ లోకి నెట్ ఫ్లిక్స్ సంస్త, ఐమ్యాక్స్ తాలూకు లెక్కలు వచ్చాయి. అందుకే రెండు భాగాలుగా వారణాసిని మార్చాలన్న డిసీజన్ ఆల్ మోస్ట్ తీసేసుకున్నాడట రాజమౌళి.ఇంతకి నెట్ ఫ్లిక్స్ సంస్త ఎందుకు దీన్ని రెండు భాగాలుగా తీయాలని ప్రెజర్ పెట్టింది?అక్కడే వేలకోట్ల లెక్కలు కారణం గా కనిపిస్తున్నాయి. ఐమ్యాక్స్ థియేటర్స్ అందుబాటులో ఉంటేనే, వాటికి అనుకూలంగానే వారణాసి రిలీజ్ డేట్ ని ఏప్రిల్ కి ఫిక్స్ చేశారు. కాని థియేటర్స్ సంఖ్యే ఇంతవరకు తేలలేదట. ఏప్రిల్ లో ఎట్టిపరిస్థితుల్లో ఆగకూడదు.. ఒకవేల డిలే అయితే మళ్లీ 6 నెలల వరకు ఐమ్యాక్స్ థియేటర్స్ మళ్లీ దొరకవని తెలుస్తోంది.

హాలీవుడ్ నుంచి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. అంటే ఏప్రిల్ లో వారణాసి 4 గంటల నిడివతో రిలీజ్ అవ్వాలి.. వాయిదా పడితే, మళ్లీ 6 నుంచి 8 నెలల వరకు మళ్లీ ఐమ్యాక్స్ థియేటర్స్ దొరక్క పోవచ్చు.. ఇదే కాదు నెట్ ఫ్లిక్స్ సంస్థకూడా ఒకే సినిమాగా వారాణాసి వస్తే, తనకి బెనిఫిట్ కాదని, తక్కువ ప్రైజ్ ని కోట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ 1000 కోట్లనే టాక్ ఉన్నా, అది తనకి గిట్టుబాటు కావట్లేదనే వెనక్కి తగ్గాడట.దీంతో వారణాసిని బాహుబలి స్టైల్లో 2 భాగాలుగా విడగొడితే, ఓటీటీ రైట్స్ పరంగా అటు సంస్థకి, ఇటు ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిటబుల్ అని తెలుస్తోంది. ఇక రెండు భాగాలుగా మూవీని మారిస్తే, ముందు మొదటి భాగం కోసం పనిచేస్తే చాలాు, రెండో భాగం తర్వాత తీస్తే వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది. అలాచూస్తే మొదటి భాగం 80శాతం పూర్తైనట్టేనట.. మరో మూడు నెల్లలో మిగతా భాగం షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన స్టార్ట్ చేస్తే వచ్చేఏడాది ఏప్రిల్ కి పక్కగా వారణాసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా అటు ఐమ్యాక్స్, ఇటు నెట్ ఫ్లిక్స్ వల్లే, వారానాసి గ్లోబల్ ట్రాటర్ గానే కాదు, వారణాసి టైమ్ ట్రాటర్ గా కూడా మారేలా ఉంది.

Published : 
  • 31 March 2026, 5:50 PM IST