అమెరికా సైనికుల తల్లులకు ఇరాన్ ఎమోషనల్ వార్నింగ్… మా దగ్గర నీ కొడుకు సేఫ్, ట్రంప్ దగ్గరే డేంజర్…!

అమెరికా అంటే ప్రపంచ దేశాలకు వణుకు.. కానీ అదే అమెరికాను గడగడలాడించిన దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ మాత్రమే. తన గడ్డపై అడుగుపెట్టిన శత్రువునైనా ప్రేమతో ఆదరించే గుణం ఒకవైపు.. తనను బెదిరించాలని చూస్తే సింహంలా గర్జించే దమ్ము మరోవైపు.

Post Published By: dialnews
Updated : 6 April 2026, 2:50 PM IST

అమెరికా అంటే ప్రపంచ దేశాలకు వణుకు.. కానీ అదే అమెరికాను గడగడలాడించిన దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ మాత్రమే. తన గడ్డపై అడుగుపెట్టిన శత్రువునైనా ప్రేమతో ఆదరించే గుణం ఒకవైపు.. తనను బెదిరించాలని చూస్తే సింహంలా గర్జించే దమ్ము మరోవైపు. ఇటీవలే ఒక మిస్సింగ్ పైలట్ విషయంలో అమెరికా మహిళకు ఇరాన్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగింది? ఇరాన్ ఎందుకు అంత గట్టిగా సమాధానం ఇచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం.రెండు రోజుల క్రితం ఇరాన్ గడ్డపై అదృశ్యమైన ఒక అమెరికన్ పైలట్ లేదా అధికారి గురించి ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇరాన్ గడ్డపై అమెరికాకు చెందిన అధునాతన F-15 యుద్ధ విమానం కూలిపోయింది. అందులో ఉన్న ఒక పైలట్ క్షేమంగా బయటపడగా, మరొక అధికారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సమయంలో ఒక అమెరికన్ తల్లి తన కొడుకు కోసం సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తే.. ఇరాన్ దౌత్య కార్యాలయం ఇచ్చిన రిప్లై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

అమెరికాకు చెందిన లవ్లీ నాన్సీ అనే మహిళ తన కొడుకు కూడా ఒక ఫైటర్ పైలట్ అని, విమానం కూలినప్పటి నుండి అతని గురించి ఎటువంటి సమాచారం లేదని ఎక్స్‌ వేదికగా ప్రార్థించమని కోరింది. దీనిపై పాకిస్థాన్ మరియు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీలు స్పందించాయి. 'అమ్మా.. నీ బిడ్డలు మా బందీలుగా ఉండటం కంటే, ట్రంప్ పర్యవేక్షణలోనే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాయి. యుద్ధాన్ని ప్రేరేపిస్తున్న ట్రంప్ నిర్ణయాల వల్లే అమెరికన్ సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇరాన్ నేరుగా ఎండగట్టింది.అమెరికా అంటే ప్రపంచానికే భయం. కానీ ఇరాన్ మాత్రం కళ్లల్లో కళ్లు పెట్టి సమాధానం చెబుతోంది. 'మీరు మీ బిడ్డల కోసం ప్రార్థించాల్సింది మా బందీలుగా దొరకాలని.. ఎందుకంటే అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే మా దగ్గరే వారు క్షేమంగా ఉంటారు' అని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. బందీలను ఎలా గౌరవించాలో తమకు తెలుసని, తమది వేల ఏళ్ల నాగరికత అని గర్వంగా చాటింది. ఒక పక్క ట్రంప్ 48 గంటల గడువు విధిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ మాత్రం అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా తన పంథాను కొనసాగిస్తోంది.

ఇరాన్ తన రిప్లైలో కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడలేదు, తమ సంస్కృతిని కూడా గుర్తుచేసింది. 'మేము బందీలను మీ మిత్రదేశాలైన జియోనిస్టుల లాగా క్రూరంగా హింసించం' అని స్పష్టం చేసింది. మానవ హక్కుల చట్టాలు పుట్టకముందే యుద్ధ ఖైదీలను ఎలా గౌరవించాలో ఇరాన్ నాగరికత నేర్పించిందని వారు పేర్కొన్నారు. యుద్ధంలో శత్రువునైనా బందీగా పట్టుకున్నప్పుడు వారిని అతిథుల్లా చూస్తామని చెప్పడం ఇరాన్ యొక్క మానవత్వానికి నిదర్శనం.తాజా సమాచారం ప్రకారం, గల్లంతైన పైలట్‌ను అమెరికా కమెండోలు ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ద్వారా రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ట్రంప్ స్వయంగా 'We Got Him!' అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఈ మొత్తం ఉదంతం అమెరికా అహంకారాన్ని, ఇరాన్ తెగువను మరోసారి ప్రపంచానికి చాటింది. అగ్రరాజ్యం బెదిరింపులకు లొంగకుండా, నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఇరాన్ ధైర్యంపై ప్రశంశలు దక్కుతున్నాయి.

Published : 
  • 6 April 2026, 2:50 PM IST