జస్ట్ ఇమాజీన్... రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తే ఎలా ఉంటుంది. కనీసం ఇద్దరు కలిసి యాడ్ చేసినా చాలు, ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఇద్దరి ఇమేజ్ అలాంటిది.. కాకపోతే ఇలాంటి కాంబినేషన్ ఏదో సెట్ అయితే మాత్రం, ఈ పాటికే ఈ వార్త ఇండస్ట్రీనే కాదు, నేషనల్ లెవల్లో మీడియాని కూడా షేక్ చేసేది.. కాని సైలెంట్ గా అదే జరుగుతున్నట్టుంది.. ఒకే తెరమీద ఇద్దరు కనిపించటం వేరు.. ఒకే సారి సెట్లో కలిసి నటించటం వేరు.. ఈ రెండు కోణాలు కాకుండా, కొత్త కోణంలో ఈ ఇద్దరు ఒకటే అనిపించుకుంటున్నారా? ఒకే పాత్రతో మనముందుకురాబోతున్నారా? కల్కీ సీక్వెల్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, సూపర్ స్టార్ వారణాసిలో రెబల్ స్టార్ దాడి... ఈ వాఖ్యానికి అర్దం సునామీయేనా? అసలేం జరగబోతోంది?
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంతవరకు మల్టీ స్టారర్ మూవీలంటే సీనియర్స్ తోనే చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేసినా అది వెంకీతో కాబట్టి, దీన్ని త్రిబుల్ ఆర్ లాంటి మల్టీ స్టారర్ అనలేం.. కారణం త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్,చరణ్ టూ ఈక్వల్స్... ఏజ్ పరంగా, ఇమేజ్ పరంగా, స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా.. ఇద్దరు ఈక్వెల్స్ లేదా, దాదాపు ఈక్వల్స్ అనిపించే ఇద్దరు భారీ కటౌట్స్ కలిసి చేస్తే ఆ మల్టీ స్టారర్ కి ఉండే రీచ్ వేరు. వ్యాల్యూ వేరు.ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇలానే కలిసి కనిపించబోతున్నారా? త్రిబుల్ ఆర్ లాంటి కాంబినేషన్ ఈ ఇద్దరి వల్ల క్రియేట్ కాబోతోందా? ఇదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వాల్సిందే.. అయితే ఇది జరిగే ఛాన్స్ ఎంత? రాముడే ఈ ఇద్దరిని కలపబోతున్నాడా? ప్రజెంట్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి మూవీ తో బిజీ అయ్యాడు. దాన్ని రెండు భాగాలుగా స్ప్రిట్ చేస్తే మరో రెండేళ్లు ఇదే ప్రాజెక్ట్ తో బీజీగా మారిపోతాడు.
ఇక రెబల్ స్టార్ విషయానికొస్తే, ఫౌజీ, కల్కీ 2, స్పిరిట్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిన తను కనీసం రెండే ళ్ల వరకు మరో ప్రాజెక్ట్ కి డేట్లిచ్చే చాన్స్ లేదు. కాబట్టి ప్రభాస్, మహేశ్ బాబు ఇద్దరు కలిసి నటించటమో, ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కటమో, ప్రాక్టికల్ గా కనుచూపు మేరలో సాధ్యమయ్యేలా లేదు. కనీసం రెండేళ్లు ఆగితే ఏదైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.. సో అప్పటి కోసం ఇప్పటి నుంచే ఎవరైనా కథ రాసి, ప్లాన్ చేస్తున్నారా? అంటే అలాంటి వార్తలు, గుసగుసలు కూడా ఏం వినిపించట్లేదు.అయినా ఈ ఇద్దరు ఒకే పాత్రలో కనిపిస్తే అన్న ప్రచారం ఆగట్లేదు. అక్కడే రాముడి పేరు వినిపిస్తోంది. ఈ ఇద్దరిని ఒక్క శ్రీరాముడే కలిపాడు. కలుపుతున్నాడు. మళ్లీ మళ్లీ కలుపేలా ఉన్నాడు. వారణాసిలో శివుడు, రుద్రుడిగా కనిపించబోతున్న మహేశ్, రాముడి పాత్ర కూడా వేయబోతున్నాడు. ఇప్పుడు కల్కీ సీక్వెల్ లో కర్ణుడిగా మళ్లీ కనిపించబోతున్న ప్రభాస్, రాముడి అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అదే జరగబోతోంది. నిజానికి ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడి పాత్రకు బానే ఉన్నా, మీసకట్టు విషయంలో ఓం రౌట్ సరిగా ప్లాన్ చేయలేదు. కాని బాహుబలిగా ప్రభాస్ ఆల్రెడీ రాముడి పాత్రనే రిఫ్లెక్ట్ చేశాడు. ఇప్పుడు కల్కీలో కర్ణుడిగానే కాదు, కాసేపే కనిపించే రాముడిగా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడట. మహాభారతం కనెక్షన్ తో పాటు రామాయనం కనెక్షన్ ని కూడా కల్కీసీక్వెల్ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఓరకంగా చెప్పాలంటే 4 వేల కోట్ల హిందీ రామాయణంలో గ్రాఫిక్స్ బాలేవు... రాముడి లుక్ బాలేదు.. కేవలం నార వస్త్రాల్లో రాముడిగా రణ బీర్ బాగున్నా, ఓవరాల్ గా టీజర్ కి నెగెటీవ్ టాకే వస్తోంది... ఒక్క రావణుడి సర్ ప్రైజ్ , పుష్పకవిమానం విజువల్స్ కే భారీరెస్పాన్స్ వస్తోంది. ఐతే ఈ టీజర్ వల్లే, మహేశ్ బాబు రాముడిగా, ప్రభాస్ కల్కీ 2లో రాముడిగా ఎంతగా స్క్రీన్ ని షేక్ చేస్తారో అన్న డిస్కర్షన్ మొదలైంది. ఇద్దరూ ఒకే తెరమీద కనిపించే పరిస్థితి ఇప్పడు లేకున్నా, ఒకే పాత్రలో ఒకే టైంలైన్ లో కనిపించబోవటం మాత్రం కో ఇన్స్ డెన్సే..2027 లో మాత్రం సూపర్ స్టార్ రాముడు, రెబల్ స్టార్ రాముడు బాక్సాఫీస్ మీద దండెత్తడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.