MASS DRAGONE.. 25 నిమిషాల సునామీ…!

ఎన్టీఆర్ డ్రాగన్ లో అత్యంత ఖరీదైన యుద్దంగా 25 నిమిషాలు మారబోతున్నాయా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టేజ్ దాటి, పాన్ ఆసియా యుద్ధానికి సిద్దమయ్యాడు. అందుకోసం ఇండో, బూటాన్, చైనా కారిడార్ ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడు

Post Published By: dialnews
Updated : 6 April 2026, 3:38 PM IST

ఎన్టీఆర్ డ్రాగన్ లో అత్యంత ఖరీదైన యుద్దంగా 25 నిమిషాలు మారబోతున్నాయా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టేజ్ దాటి, పాన్ ఆసియా యుద్ధానికి సిద్దమయ్యాడు. అందుకోసం ఇండో, బూటాన్, చైనా కారిడార్ ని బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నాడు. కట్ చేస్తే అరవింద సమేత వీరరాఘవ మూవీ టోటల్ వసూల్లను కేవలం ఒకే ఒక్క సీన్ కోసం ఖర్చుచేయబోతున్నారగానే వార్త వైరలైంది. డ్రాగన్ లో పాతిక నిమిషాల సీన్ తో పాన్ ఆసియా మార్కెట్ షేక్ చేయాలని ప్రశాంత్ నీల్ టీం ఫిక్స్ అయినట్టుంది. ఇంతకి ఎందుకు డ్రాగన్ లో ఆ 25 నిమిషాలు అంతా ముఖ్యం.. కేవలం పాతిక నిమిషాల ఎపిసోడ్ కోసం నిజంగా 200 కోట్లు ఖర్చుచేస్తున్నారా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 25 నిమిషాల సునామీకి రెడీ అయ్యాడు. ఆల్రెడీ 150 కోట్ల భారీ ఖర్చుతో 25 నిమిషా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ ని షూట్ చేసింది ఫిల్మ్ టీం. అదే వార్త బయటికొచ్చాక, సైలెంట్ గా ఏదో సునామీ క్రియేట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు అంతకుమించి ఇంకేదో జరగబోతోంది. అదే 200 కోట్ల ఎపిసోడ్.. మోస్ట్ లీ అది ప్రీక్లైమాక్స్ సీన్ అంటున్నారు. నిజం చెప్పాలంటే క్లైమాక్స్ కంటే కూడా భారీగా ఈ ఎపిసోడ్ కే ఖర్చు పెడుతోందట ఫిల్మ్ టీం.ఏకంగా 200 కోట్లలో వందకోట్లు గ్రాఫిక్స్ కే కేటాయించినట్టు తెలుస్తోంది. డ్రాగన్ మూవీకి గుండెకాయలాంటీ ఈ సీన్, ఇండియా, చైనా, భూటాన్ కారిడార్ ని రెప్లికేట్ చేసేలా తీస్తున్నరని తెలుస్తోంది. అంటే ఈ మూడు దేశాల మధ్య సమస్య వస్తే, అది డ్రగ్ మాఫియాకు కనెక్ట్ అయ్యుంటే... ఈ కోణంలో భారీ ఎపిసోడ్ ని ప్రశాంత్ నీల్ టీం ప్లాన్ చేసింది. ఇప్పుడు ఎక్స్ క్యూట్ చేసేందుకు రెడీ అయ్యింది.

అయితే ఇక్కడ జవాన్ కనెక్షన్ జనాలకు షాక్ ఇస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ఆట్లీ తీసిన జవాన్ మూవీలో భారీ ట్విస్ట్... జూనియర్ షారుక్ కి సీనియర్ షారుక్ సాయం చేయటం.. అలాంటి సీనే డ్రాగన్ లో కనిపించబోతున్నట్టుంది. కాపీ అనికాదు, యాజ్ ఇట్ ఈజ్ అని కాదు.. అయినా అలాంటి సీన్ జావన్ టీమే కొత్తగా కనిపెట్టలేదు.బ్లాక్ అండ్ వైట్ జమానా నుంచి ఇలాంటి సీన్ కామన్ గాచూస్తూనే ఉన్నాం.అందుకే డ్రాగన్ లో తాతా మనవల కాంబినేషనల్ సీన్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది.

ఆల్రెడీ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం 150 కోట్ల వరకు ఖర్చు చేసి, భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఇది కూడా 25 నిమిషాల ఎపిసోడే.. అది తీసిన వెంటనే మరోక పాతిక నిమిషాల ఎపిసోడ్ తీసేందుకు రంగం సిద్దమైంది.ఓరకంగా ఈ రెండు ఎపిసోడ్స్ టైం లెక్కేస్తే, అదే 50నిమిషల నిడివి వస్తోంది. కాబట్టి ఈ ఎపిసోడ్ పూర్తైతే, డ్రాగన్ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టౌతుంది. అదే జరిగితే ఒక్క క్లైమాక్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక మిగతా 20 శాతం టాకీ పార్టే అవటంతో, కరెక్ట్ గా 3 నెలల్లోనే డ్రాగన్ షూటింగ్ ని పూర్తి చేయొచ్చని తెలుస్తోంది..జులై నుంచి డ్రాగన్ సీక్వెల్ షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

Published : 
  • 6 April 2026, 3:38 PM IST