ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాలేదు. 'పుష్ప' సిరీస్ సినిమాలతో గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటిన బన్నీ, ఇప్పుడు తన తదుపరి చిత్రాలతో ప్రపంచ సినిమా రంగాన్ని శాసించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త అల్లు అర్జున్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ బడ్జెట్ చిత్రంలో వస్తున్న సినిమాకు 'రాకా' అనే టైటిల్‌ను బన్నీ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీనిని ఏకంగా ఏడు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సాధారణంగా పాన్-ఇండియా సినిమాలు ఐదు భాషల్లో విడుదలవుతుంటాయి. కానీ, 'రాకా' సినిమాను వీటితో పాటు అదనంగా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో, ముఖ్యంగా బెంగాలీ భాషలో కూడా విడుదల చేయాలని నిర్ణయించడం విశేషం.
బెంగాల్ మార్కెట్లో కూడా అల్లు అర్జున్ సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో, అక్కడ కూడా భారీ స్థాయిలో ప్రమోషన్లు నిర్వహించి సినిమాను విడుదల చేయబోతున్నారు. దీనివల్ల ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద విడుదలలో ఒకటిగా నిలవనుంది.
తమిళ దర్శకుడు అట్లీకి మాస్ సినిమాలను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తీసి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్‌ను సైతం షేక్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంటి ఎనర్జిటిక్ స్టార్‌తో అట్లీ జతకట్టడం అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
'రాకా' అనే టైటిల్ వినడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా, అల్లు అర్జున్ గెటప్ కూడా ఇందులో చాలా వైల్డ్‌గా ఉండబోతోందని పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. సుమారు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ మరియు యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని టాక్. అల్లు అర్జున్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి చాలా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాకా' విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పాన్-ఇండియా ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. బెంగాలీ ప్రేక్షకులు కూడా మన 'మల్టీ టాలెంటెడ్ స్టార్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండడం విశేషం.