Count Down స్టార్ట్.. ఇంకా 365 రోజులు…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా ఈ ఇద్దరి కాంబినేషన్ లో 1400 కోట్లతో తెరకెక్కుతున్న మూవీ వారణాసి. విచిత్రమైన కాంబినేషన్, ఊహించనంత హై బడ్జెట్.. 30 భాషలు, 120 దేశాలు, 100 కోట్ల మంది ఆడియన్స్ చూసేలా 55 వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ లు.

Post Published By: dialnews
Updated : 8 April 2026, 8:10 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా ఈ ఇద్దరి కాంబినేషన్ లో 1400 కోట్లతో తెరకెక్కుతున్న మూవీ వారణాసి. విచిత్రమైన కాంబినేషన్, ఊహించనంత హై బడ్జెట్.. 30 భాషలు, 120 దేశాలు, 100 కోట్ల మంది ఆడియన్స్ చూసేలా 55 వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ లు.. ఇవన్నీ ఎగ్జాక్ట్ గా వచ్చే ఏడాది ఇదే రోజు జరగబోతున్నాయి.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక నుంచి ప్రతీ రోజు కూడా వారణాసి టీం కి, ఫేట్ ని మార్చే డేగానే మిగలబోతోంది. మొత్తంగ 365 రోజుల తర్వాత వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి, ఇప్పడు ఈ సినిమాతో పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అప్పడు పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసేందుకు బాహుబలి తీస్తే, రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగై కూర్చున్నాడు. సో ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసేందుకు రాజమౌలి వారనాసితీస్తే, వరల్డ్ సినిమాకు మహేశ్ బాబు సూపర్ మొగుడై కూర్చుంటాడా? మిరాకిల్ ఏదైనా జరగబోతోందా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ కింగ్ గా మారతాడా? వరల్డ్ ఆడియన్స్ లో ఇండియన్ సినిమా రీసౌండ్ పెంచుతాడా? అసలు వరల్డ్ వైడ్ గా 55 వేల థియటేర్స్ లో మన వారణాసి ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది.. లాంటివన్నీ తేలేందుకు ఇంకా 365 రోజులే ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ గా వచ్చే ఏడాది ఈ రోజు వరల్డ్ వైడ్ గా వారణాసి ప్రపంచ దండయాత్ర మొదలౌతుంది.ఫస్ట్ డే 300 కోట్ల నుంచి 500 కోట్లు ఓపెనింగ్స్ వస్తాయనే అంచనా ఉంది. కారణం 30 భాషల్లో 120 దేశాలకు రీచ్ అయ్యేలా వందకోట్ల మంది చూసేలా 55 వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుండటం. అలా నే ఎగ్జాక్ట్ గా జరిగితే, హాలీవుడ్ సినిమాలకు సాధ్యం కాని రికార్డు వారణాసి సొంతమౌతుంది. దీనికి తోడు ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కిన తొలి ఇండియన్ మూవీగా కూడా వారణాసికే రికార్డు దక్కేలా ఉంది.

అంతేకాదు 55 వేల థియేటర్స్ కాదు, చైనా థియేటర్స్ చైన్ సాయంతో మరో 15 వేల థియటేర్స్ కలిపి మొత్తంగా వరల్డ్ వైడ్ గా 70 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అదే జరిగితే, థియేటర్ కి యావరేజ్ గా 200 సీట్లు, నాలు షోలు అనుకుంటే, వారణాసి విడుదలైన రోజే 1000 కోట్ల నుంచి 1200 కోట్ల వసూళ్ల వచ్చే చాన్స్ఉంది.ఒకప్పడు వందకోట్ల వసూల్లు వస్తే, అదో పెద్ద పండగ.. ఇప్పుడా వందకోట్లు ఓపెనింగ్ రోజే వస్తున్నాయి. కట్ చేస్తే ఇప్పుడు వెయ్యికోట్లు ఏమూవీకి వస్తే అదో మాస్టర్ పీస్.. అలాంటిది వారణాసి మూవీకి ఓపెనింగ్సే 1000 కోట్లు వస్తే, ప్రపంచమే వణుకుతుంది. ఇలాంటి నెంబర్లు హాలీవుడ్ మూవీలకు కూడా కష్టమే.. ఏదో అవతార్, స్టార్ వార్స్, అవేంజర్స్ లాంటి సినిమాలకే ఈ స్థాయిలో 1000 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి.

అదే వారణాసి విషయంలో జరిగితే, వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ టాప్ 5 మూవీల్లో ఇది కూడా చేరుతుంది. అందుకే ఇన్ని వింతలు, విశేషాలు, ఉన్నాయి కాబట్టే వారణాసి ఇప్పుడు ఒక్క రాజమౌళి మూవీ కాదు.. కేవలం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా కాదు.. అలాని కేవలం తెలుగు వాళ్లే గర్వపడే మూవీ అనటం కూడా కరెక్ట్ కాదు.. ఈ ప్రాజెక్ట్ మీద నార్త్ ఇండియన్స్ లో కూడా భారీ అంచనాలున్నాయి..తమిళోల్లు కూడా కళ్లప్పగించి చూస్తున్నారు. బయటికి చెప్పకపోయినా ఈసారా వరల్డ్ ప్లాట్ ఫాంలో రాజమౌళి ఏం మాయ చేస్తాడాని అంతా ఎదురు చూస్తున్నారు.. అందుకే 365 రోజుల తర్వాత అంటే ఎగ్జాక్ట్ గా ఏడాది తర్వాత వరల్డ్ మార్కట్ లో సినీ సునామీ రాబోతుందనే అంచనాలతో, ఏప్రిల్ 7 డేట్ ని గుర్తుచేసుకుంటున్నారు. కౌంట్ డౌన్ లెక్కపెడుతున్నారు.

Published : 
  • 8 April 2026, 8:10 PM IST