అర్జున్ రెడ్డి కోసం.. విలన్ గా MAN OF MASESS…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడన్ గా విలన్ గా మారితే... అది కూడా మరో హీరో కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే... అచ్చంగా ఇదే జరిగేలా ఉంది. టెంపర్ లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్స్ వేశాడు..జైలవకుశలో తన మూవీలో తానే విలన్ అనిపించుకున్నాడు.

Post Published By: dialnews
Updated : 14 April 2026, 8:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడన్ గా విలన్ గా మారితే... అది కూడా మరో హీరో కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే... అచ్చంగా ఇదే జరిగేలా ఉంది. టెంపర్ లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్స్ వేశాడు..జైలవకుశలో తన మూవీలో తానే విలన్ అనిపించుకున్నాడు. కాని ఇప్పుడు మరో స్టార్ కోసం, ఇంకొకరి సినిమాలో విలన్ రోల్ వేయాల్సి వస్తోందా? అసలిది జరిగే పనేనా? ఎందుకంటే ఎన్టీఆర్ ఊర మాస్ స్టార్. పాన్ ఇండియా లెవల్లో రెండు హిట్లు, వెయ్యికోట్ల దగ్గర్లో మార్కెట్లు.. ఇన్ని ఉన్నహీరో విలన్ గా కనిపించటమే జరగని పని. అందులో మరో స్టార్ కోసం విలన్ గా నటించటం, సాధ్యమే కాదు. కాని అదే జరిగేలా ఉంది. ఎవరి ఊహకి అందని నిర్ణయం ఎన్టీఆర్ తీసుకున్నాడా? తీసుకోబోతున్నాడా? డ్రాగన్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట.. ఇంతక డ్రాగన్ తో తన నెక్ట్స్ విలనిజానికి ఉన్న లింకేంటి? ఏ హీరో మూవీలో ఎన్టీఆర్ విలన్ గా నటించబోతన్నాడు? ఎందుకు?

ఎన్టీఆర్ కి డ్రీమ్ రోల్ అంటే కర్ణుడి పాత్ర.. అది వేసి తాతకు తగ్గ మనవడనిపించుకోవాలనుందని, ఎన్నోసార్లు చెప్పాడు. నెగెటీవ్ షేడ్స్ ఉండే హీరోయిజం ఉన్న పాత్రది.. కాని ఇప్పుడా పాత్ర వేయట్లేదు.. చిన్నప్పుడే రాముడిగా కనిపించాడు. త్రిబుల్ ఆర్ లో కొమరం భీముడిగా వణికించాడు. ఇప్పుడు ప్యూర్ విలన్ రోల్ లో షాక్ ఇచ్చేలా ఉన్నాడు.. ఆల్ మోస్ట్ ఇది కన్ఫామ్ అనంటున్నారుఅందుక్కారణం డ్రాగనే.. ఈ మూవీ వల్లే, ఎన్టీఆర్ ఇప్పుడు మరో హీరో మూవీలో విలన్ రోల్ వేసేందుకు సిద్దపడుతున్నాడు. నోటి మాటగా కమిట్ మెంట్ కూడా ఇచ్చేశాడట. ఇంతకి ఏ సినిమాలో, ఏ హీరో కి ఆపోజిట్ గా ఎన్టీఆర్ విలనిజం చూపించబోతున్నాడు.. ఇది పాన్ ఇండియా షేక్ అయ్యే మ్యాటర్. ఎందుకంటే, త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు వచ్చింది.

దేవరతో పాన్ ఇండియా లెవల్లో రెండో హిట్ మాత్రమే కాదు, రాజమౌళి సాయం లేకుండా, తన మూవీ తర్వాత ఫెల్యూన్ ని జయించొచ్చు అని ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్. ఇలాంటి రేర్ ఫీట్లు చేశాక డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఆసియా తో పాటు పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అలాంటి తను సడన్ గా విలన్ గా మారటం, అది మరో హీరో మూవీలో సీరియస్ గా విలనిజం చూపించబోతుండటం, వార్త వైరలవ్వాలి..కాని ఎవరూ నమ్మట్లేదు.. కారణం ఇదింకా అఫీషియల్ గా ఎనౌన్స్ కాలేదు. ఎన్టీఆర్ కూడా అఫీషియల్ డీల్ సైన్ చేయలేదు. కాని మాటిచ్చాడని మాత్రం తెలుస్తోంది. ఎవరికి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కి... తెలుగు అర్జున్ రెడ్డి, హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన షాహిద్ కపూర్ మూవీలో ఎన్టీఆర్ విలన్ గా అంటే నమ్ముతారా?అసలెందుకు అలా ఎన్టీఆర్ చేయాలి? ఎందుకు కమిటవ్వాలి.. ఇక్కడే ట్విస్ట్ ఉంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీలో షాహిద్ కపూర్ విలన్ గా నటించబోతున్నాడట. నిజానికి మలయాళ స్టార్ టొవినో థామస్ విలన్ రోల్ నుంచి బయటికి వెళ్లటంతో, తన ప్లేస్ లో షాహిద్ కపూర్ ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. తనకి కూడా పాత్ర నచ్చినా, ఒక కండీషన్ మీద ఈ సినిమాలో విలన్ గా చేస్తా అన్నాడట. తను ఫ్యూచర్ లో చేసే మూవీలో స్ట్రాంగ్ సౌత్ ఇండియన్ విలన రోల్ వేయాల్సి వస్తే, అది ఎన్టీఆర్ వేస్తా అని మాటిస్తేనే, డ్రాగన్ లో విలన్ గా చేస్తానని తను అన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తను కూడా బాలీవుడ్ లో టాప్ స్టారే.. కాబట్టే ఇలాంటి కండీషన్ కి ఎన్టీఆర్ ఆల్ మోస్ట్ ఒప్పుకోవటంతో, తను కూడా డ్రాగన్ లో విలన్ గా నటించటం ఖాయంగా మారిందని తెలుస్తోంది. మోస్ట్ లీ మే 20 కి వచ్చే టీజర్ అప్ డేట్ లో ఈ విషయం కూడా ఎనౌన్స్ మెంట్ లో ఉండొచ్చని తెలుస్తోంది.

Published : 
  • 14 April 2026, 8:15 PM IST