మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది... ఆల్రెడీ త్రిబుల్ ఆర్ సెన్సేషన్ తోనే ఒక సారి ప్రూవ్ అయ్యింది. మెగా నందమూరి కాంబినేషన్ సెన్సేషన్ అని.. అందుకు తగ్గట్టే ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఉన్న స్నేహం కూడా త్రిబుల్ ఆర్ కి ప్లస్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటించే పరిస్తితి కనిపిస్తోంది. పెద్ద కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పెద్ద సాయమే చేస్తున్నాడు. ఈ సినిమాలో తన ఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అని తెలుస్తోంది. అంతా చరణ్, బుచ్చి బాబుల కోసమే.. నిజానికి ఇది ఎన్టీఆర్ చేయాల్సిన సినిమానే.. ఆవిషయంలో మెగా పవర్ స్టార్ కోసం త్యాగం చేసిన తారక్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇది ఇక్కటితో ఆగట్లేదు... ఎన్టీఆర్ డ్రాగన్ లో కూడా చరణ్ ఎంట్రీ ఉండేలా ఉంది.. ప్రజెంట్ డ్రాగన్ సెట్లో ఈ డిస్కర్షన్, ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ వల్ల ఎన్టీఆర్ తో కలిసి గ్లోబల్ గా దూసుకెళ్లాడు. అటు పాన్ ఇండియా హిట్టు, ఇటు గ్లోబల్ గా నాటు నాటు పాటతో భారీ గుర్తింపు.. కట్ చేస్తే దేవరతో ఎన్టీఆర్ దూసుకెళ్ళాడు.. ఆచార్య, గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ డీలా పడ్డాడు.. ఇప్పుడు డ్రాగన్ గా ఎన్టీఆర్ వచ్చే ఏడాది మీద దండెత్తబోతున్నాడు. పెద్దిగా రామ్ చరణ్ తన అద్రుష్టం పరిక్షించుకోబోతున్నాడు. ఓరకంగా పెద్ది రామ్ చరణ్ కి పెద్ద పరీక్షే..ఇది హిట్టైతే ఓకే, లేదంటే వరుసగా పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ ఫ్లాపులు ఫేస్ చేసినట్టౌతుంది. అందుకే ఈవిషయంలో సీన్ లోకి ఎన్టీఆర్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ సెట్లో జరిగిన ఒక డిస్కర్షన్ లీకై, కిక్ ఇచ్చే మ్యాటర్ బయటికొచ్చినట్టైంది. నిజానికి ఎన్టీఆర్ తన లుక్ రివీల్ కాకుండా, పెద్దిలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట.
అసలు పెద్ది కథ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా. కాకపోతే ఆ కథ రామ్ చరణ్ కి ఎక్కువ సూట్ అవుతుందని, ఎన్టీఆర్ త్యాగం చేశాడనంటారు. అందులో చాలా వరకు నిజముంది. ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు బుచ్చి బాబు కూడా చాలా ఏళ్ళు వేయిట్ చేశాడు. తర్వాత చరణ్ తో సినిమా తీయమన్నాడు. రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ సలహాతో ఆ కథని ఓకే చేశాడనేది అందరికి తెలిసిందే..అయితే ఇటు బుచ్చి బాబు, అటు జాన్ జిగ్రి దోస్త్ రామ్ చరణ్ ఇద్దరి కోసం పెద్దిలో ఒక గెస్ట్ రోల్ వేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాడట. కాకపోతే అదింకా డిస్కర్షన్ దశలోనే ఉంది. షూటింగ్ అయిపోవస్తున్న టైంలో, ఈ మార్పుకి కారణం బుచ్చిబాబే అని తెలుస్తోంది. తన రిక్వెస్ట్ వల్ల, ఇటు చరణ్, అటు ఎన్టీఆర్ మరో సారి స్క్రీన్ షేర్ చేసుకునేలా ఉన్నారు
ఇక చరణ్ కూడా పాన్ ఇండియా లెవల్లో గట్టెక్కాలంటే, గట్టి హిట్ పడాలని తాను కూడా సపోర్ట్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఐతే డ్రాగన్ లో కూడా రామ్ చరణ్ ఇలానే గెస్ట్ రోల్ వేస్తే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ ప్రశాంత్ నీల్ తో జరిగినట్టు తెలుస్తోంది. అదింకా కన్ఫామ్ కాకున్నా, చరణ్ ఒప్పుకుంటేఅదెంత సేపు. ఐతే ఇక్కడ సమస్య ఏంటంటే రామ్ చరణ్ పెద్దిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ వేస్తే, డ్రాగన్ లో తన లుక్ ముందే లీకైపోతుంది.. అందుకే తన లుక్ రివీల్ కాకుండా, విగ్ సాయంతో లుక్ మార్చుకోవాలా? మరో గెటప్ ప్లాన్ చేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదట. మొత్తానికి పెద్దికి ఎదురయ్యే పెద్ద పరిక్షకు, పెన్నుసాయం చేసేందుకు ఎన్టీఆర్ రంగంలోకి దిగటం కన్ఫామ్ అవుతోంది.