ఈ వారం ఫ్రైడేని నాలుగు సినిమాలు డ్రై డేగా మార్చేశాయా? ఎందుకంటే, ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ షేక్ చేసే పరిస్థితి కనిపించట్లేదు..అసలే ఆడియన్స్ థియేటర్స్ వైపు చూసే పరిస్థితి లేదు. పెద్ద హీరోలు మూవీలొస్తే తప్ప థియేటర్స్ ఫుల్ అయ్యే సిచ్చువేషన్ కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా అవే తుప్పు పట్టిన కథలు, కథనాలతో అద్భుతాలు చేయాలంటే కుదిరే పని కాదు. కాని కొందరు నిజాయితీగానే ట్రై చేశారు. కాని కర్మ కాలి బాక్సాఫీస్ పేలింది.. ఫర్ ఎగ్జాంపుల్ పాపం ప్రతాప్.. ఇలా చెప్పాలంటే భూతాన్ని నమ్ముకున్న హిందీ భూత్ భంగ్లాని దెయ్యం కూడా కాపాడలేకపోతోంది. మిగిలిన మలయాళ పల్లిచట్టంబి పరిస్థితి కొద్దిదా బెటర్...అలాని అద్భుతహా అనేంత లేదు.. జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగానే బెటర్.. అంటే శుక్రవారానికి ఇక శుక్రమహార్ధశ కష్టమా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఇలా పాన్ ఇండియా లెవల్లో ఏదో భారీ కలాఖండం వస్తే తప్పా, థియేటర్స్ కి కల ఉండదా? చిన్న సినిమాలు ఒకప్పడు థియేటర్స్ దొరక్క ఇబ్బంది పడేవి.. ఇప్పుడు థియేటర్స్ దొరికినా జనాలుఇటువైపు రాకపోవటంతో, ఇబ్బందిపడుతున్నాయి. సరే కథ బాగుంటే, నిదానంగా అయినా థియేటర్స్ లో జనం పెరుగుతున్నారనుకుంటే, అక్కడ పంచే పడుంతోంది.ఈవారం పాపం ప్రతాప్ రిలీజైంది, చాలా చిన్న సినిమా.. కాని భానే జనాల్లో అంచనాలు పెంచేసేంత హైప్ వచ్చింది. ఇక బ్యాడ్ బాయ్ కార్తిక్ గా నాగశౌర్య వచ్చాడు.. కాని కథ, కథనం, మేకింగ్, పెర్ఫామెన్స్ అన్నీంట్లో హీరో, డైరెక్టర్ అండ్ టీం మొత్తంగా బ్యాడ్ బోయ్స్ అనిపించుకున్నారు. పాపం ప్రతాప్ మూవీ హిలేరియస్ గా ఉంటుందేమో అన్నట్టు ట్రలైర్ వదిలారు.
తీరా సినిమా చూస్తే ఓపెనింగ్ అదుర్స్.. సెకండ్ హాఫ్ బెదుర్స్.. ఏంలేదు. ఒకే ఒక్క సీక్రెట్ రివీల్ అయ్యాక, ఇంతేనా అనిపింకుండా ఉండాలంటే, కామెడీ లేదటే సీరియస్ రూట్లో ఎంటర్ టైన్ చేయాలి.. కాని రెండీంటి మీద కాలేసి, చివరికి నూతిలో బాక్సాఫీస్ ని వేసేసినట్టుంది ఫిల్మ్ టీం. కన్ ఫ్యూజన్ లో రిజల్ట్ కూడా రివర్స్అయ్యేలా ఉంది.థియేటర్స్ ని జనం మరిచిపోయిన రోజుల్లో, పాపం ప్రతాప్ లాంటి చిన్న సినిమాకోసం జనం థియేటర్స్ రావటం గొప్పవిషయం.. అక్కడ సక్సెస్ అయిన టీం, వాళ్లని థియేటర్స్ లోనే ఉండేలా చేయటంలో ఫేయిలైనట్టే కనిపిస్తోంది. రివ్యూలూ, టాక్ లు, వసూళ్లు అన్ని అవే చెబుతున్నాయి. కట్ చేస్తే తెలుగోళ్ల పరిస్తితే ఇంత ధారునంగా ఉంటే, బాలీవుడ్ సిచ్చువేషన్ ఇంకెలా ఉంటుంది.
వరుసగా 17 ఫ్లాపుల తో గజినీ మొహమ్మద్ లా మారిన అక్షయ్ కుమార్, భూత్ భంగ్లా చేశాడు. తనకి ఫెల్యూర్ ఎదురైన ప్రతీసారి హర్రర్ కామెడీలే తనని కాపాడాయి. కాని ఈసారి భూత్ బంగ్లా కొస్తున్న రివ్యూలు, టాక్ చూస్తుంటే, దెయ్యంకూడా అక్షయ్ కుమార్ ని కాపాడినట్టు లేదు. మరో డిజాస్టర్ టాక్ తో తను షాక్ ని కంటిన్యూ చేస్తే, మలయాళ మూవీ పల్లం చట్టంబి కాస్త బెటర్ టాక్ తో పర్లేదనిపిస్తోంది.రీసెంట్ గా డ్రాగన్ నుంచి బయటికొచ్చిన టోవినో థామస్, డేట్స్ ఇష్యూవల్లే అలా అయ్యిందని, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ని కూల్ చేశాడు. కాని పల్లం చట్టంబి మూవీలో కన్ ఫ్యూజన్ తో మాత్రం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు. పాయింట్ బాగున్నా, చొక్కా మిస్ అయినట్టుందనంటున్నారు. మలయాళ సీరియస్ డ్రామా, కన్ ఫ్యూజన్ వల్లే, రిజల్ట్ లో కొంత కామెడీ జరిగినట్టుందనే కామెంట్స్ పెరిగాయి. ఈ ఫ్రైడే కూడా డ్రై డేగా మారటానికి ఈ Fనాలుగు సినిమాలు కారణమన్న కామెంట్స్ పెరిగిపోతున్నాయి.