మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ మొత్తంలో, తనేంటో ప్రూవ్ చేసేంత గొప్ప సినిమా పడలేదంటే నమ్ముతారా? ఫ్యాన్స్ కి ఇది కొద్దిగా కోపం తెప్పించే అంశమే కావొచ్చు..కాని గొప్ప పెర్ఫార్మర్ అయిన ఎన్టీఆర్ కి తన స్ట్రెంత్ కి తగ్గ సినిమా ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి పడలేదంటే నమ్మాల్సిందే.. ఎందుకంటే తనని కరెక్ట్ గా వాడుకుంటే, పాత్రతో, పెర్పామెన్స్ తో ఆడుకుంటాడు... కాని అలా తనని వాడుకుందెవరు? చాలా ఈజీగా రాజమౌలి పేరు చెబుతారు.. కాని తను కూడా ఎన్టీఆర్ ని సరిగ్గా వాడుకోలేదు.. నాలుగు సినిమాలు చేసినా, సాలిడ్ మాస్ హిట్లు పడ్డా... ఎన్టీఆర్ అసలు స్ట్రెంత్ పెర్ఫామెన్స్... దాన్ని వాడుకోవాలంటే, కమర్శియల్ రూట్లో కష్టం... అలాని కంటెంట్ ఓరియెంటెడ్ మూవీలు తీస్తే, సూపర్ మాస్ హీరో మార్కెట్ ని రిస్క్ లోపెట్టినట్టే.. అందుకే సింహాద్రి, టెంపర్, త్రిబుల్ ఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా పడితే, భూమ్ బద్దలే.. ఇంతకి ఈ ఫార్ములా చెప్పిందెవరు? ఎన్టీఆర్ కి ఆరేంజ్ లో కథని రెడీ చేసేదెవరు?
అణుబాంబుతో దీపావలి చేసుకుంటే ఎలా ఉంటుంది.. టాపాసులు పేల్చినోళ్లు పోతారు... పోనీ ఇస్రో రాకెట్ ని తారాజువ్వాలా వాడితే ఇంకెలా ఉంటుంది... అచ్చంగా ఎన్టీఆర్ లోని నటుడిని ఇలానే వాడుతున్నారా? పోలికలో కాస్త అతి కనిపించినా, నిజంగా తన కెరీర్ ని చూస్తే, ఎన్టీఆర్ కి ఉన్న స్టామినాని వాడుకున్న దర్శకుడు లేడు... అలానే అనిపిస్తుంది..టెంపర్ ఒక్కటే ఎన్టీఆర్ లోని నటుడి ఆకలిని తీర్చిన మూవీ. అప్పట్లో ఆది మాస్ ఆడియన్స్ కి నచ్చొచ్చు.. సింహాద్రి మాస్ మతిపోగొట్టి ఉండొచ్చు..కాని పెర్పామెన్స్ లో పీక్స్ ని చూపించిన మూవీ టెంపర్.. నెగెటీవ్ షేడ్స్ ఉండటం కాదు, వాటిని పీక్స్ కి తీసుకెళ్లాడు ఎన్టీఆర్. అంతగా పెర్పామెన్స్ మీదున్న పట్టుతో పాత్రని ఓ ఆట ఆడుకున్నాడు..
కట్ చేస్తే, త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా హీరో అయ్యాడు. గ్లోబల్ గా గుర్తింపు, భారీ మార్కెట్.. ఇలా చూస్తే ఎన్టీఆర్ కెరీర్ లో మూడంటే మూడు టర్మింగ్ పాయింట్స్.. ఒకటి సింహంద్రి.. ఊర మాస్ బ్లాక్ బస్టర్... టెంపర్ మూవీ గ్రేట్ పెర్ఫామెన్స్... త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు.. భారీ స్కేల్, గ్లోబల్ ఐడెంటిటీ.. ఇలా పార్టులు పార్టులుగా మూడు మూవీలు ఎన్టీఆర్ లోని ఎనర్జీని వాడేసుకున్నాయి..కాని ఆ మూడు సినిమాుల కలిస్తే... సింహ్రాంద్రిలా బ్లాక్ బస్టర్ అవ్వాలి... టెంపర్ లో పెర్ఫామెన్స్ కి స్కోపున్నట్టు పాత్ర దొరకాలి.. త్రిబుల్ ఆర్ లా భారీ స్కేల్ లో సినిమా రావాలి.. జనాలకు రీచ్ అవ్వాలి.. ఇలా జరగాలంటే ఆస్థాయి కథ,కథనం,పాత్ర, మేకింగ్, రిజల్ట్ ఇవన్నీ కుదరాలి... అప్పుడే ఎన్టీఆర్ ని పూర్తి స్థాయిలో వాడుకున్న దర్శకుడవుతారు..
అదే ఎవరికి సాద్యం కాబోతోంది? డ్రాగన్ తో ప్రశాంత్ నీల్ ఈ రికార్డుని క్రియేట్ చేయబోతున్నాడా? షణ్ముఖుడు తో త్రివిక్రమ్ గ్లోబల్ గా సునామీ క్రియేట్ చేస్తాడా? దేవర కి మించేలా దేవర2 తో కొరటాల శివ ఏదో మిరాకిల్ చేస్తాడా? రాజమౌళి త్రిబుల్ ఆర్, యమదొంగ, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి హిట్లు తో ఎన్టీఆర్ ఫేట్ మార్చొచ్చు.. కాని వాటన్నీంటిని మించేలా చేశాడు పూరీ.. ఒక్క టెంపర్ తో ఎన్టీఆర్ లో నటుడి రేంజేంటో ప్రూవ్ చేశాడు..కాబట్టే, రాజమౌళి, పూరీ జగన్నాథ్, సుకుమార్ ని కలిపేస్తే వచ్చే ఫైనల్ ఔట్ పుట్ లాంటి డైరెక్టర్ చేతిలో పడితే తప్ప ఎన్టీఆర్ రియల్ స్టామినా బయటికి రాదు.