ఏం చేస్తే భూమ్ బద్దల్… అదే చేస్తున్నాం ఆగండి…!

రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలె తెప్పించే స్టేట్ మెంట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. తన సినిమాల్లో ఎంత అగ్రెషన్ ఉన్నా, తన మేకింగ్ లో మాత్రం ఎక్కడ ఆ అగ్రెషన్ కనిపించదు.. అంతా కూల్ గా అనుకున్నది అనుకున్నట్టు తీసుకుపోవటమే...

Post Published By: dialnews
Updated : 18 April 2026, 8:15 PM IST

రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలె తెప్పించే స్టేట్ మెంట్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. తన సినిమాల్లో ఎంత అగ్రెషన్ ఉన్నా, తన మేకింగ్ లో మాత్రం ఎక్కడ ఆ అగ్రెషన్ కనిపించదు.. అంతా కూల్ గా అనుకున్నది అనుకున్నట్టు తీసుకుపోవటమే... కేవలం తన మూవీలోనే వయోలెన్స్ హెవీగా ఉంటుంది... అగ్రెషన్ సెన్సేషన్ అవుతుంది. అందుకే తను కూల్ గా ఒకే ఒక్క విషయం తేల్చాడు... స్పిరిట్ విషయంలో తొందర వద్దు... ఓటీటీ డీల్ విషయంలో వస్తున్న ప్రచారాలు నిజం కాదు... అసలు కనీసం సగం షూటింగ్ కాకుండానే స్పిరిట్ ఓటీటీ డీల్ అన్నది సరైన నిర్ణయం కాదు.. ఇంతవరకు ఇది ఒక చిన్న విషయమే.. కాని అసలు స్టేట్ మెంట్ ఏంటంటే, 1000 కోట్ల ఓటీటీ డీల్ అన్న కలకి మరో 3 నెలలే దూరం...ఈ మాటకి అర్ధమేంటి? అంటే మూడు నెలల్లో బ్రహ్మాండం ఏదైనా బద్దలౌతుందా? థియేటర్స్ కంటే ముందే, ఓటీటీ డీల్ రూపంలో ఏదో సెన్సేషన్ క్రియేట్ కాబోతోందా?

స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి ఏం చేసినా వైరలైపోతుంది.. వైరలయ్యే కటౌట్ కాబట్టి, అసలు రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ కి ప్రమోషనే అక్కర్లేదు.. జస్ట్ స్పిరిట్ షూటింగ్ పూర్తి చేసి, పలానా టైంలో రిలీజ్అంటే చాలు, మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.. అలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో బాహుబలి స్టార్ కలిసి సినిమాచేయటమే ఒక పెద్ద సెన్సేషన్. ఇక రిజల్ట్, కలెక్షన్స్ ఇవన్నీ బోనస్ ..అయితే ఇప్పుడు స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి ఒక్కమాట తూటాలా పేలుతోంది. అదే స్పిరిట్ ప్రమోషన్ లేదంటే స్పిరిట్ డీల్స్ విషయంలో తొందరొద్దు... రీసెంట్ గాస్పిరిట్ కి ఓటీటీ డీల్ 250 కోట్లన్న ప్రచారం జరిగింది. తన యానిమల్ మూవీనే 380 కోట్లకు ఓటీటీకి సేల్ చేసిన సందీప్, ప్రభాస్ తో తీసే స్పిరిట్ ని 250 కోట్ల ఓటీటీ డీల్ కి ఎలా ఒప్పుకుంటాడు.ఇందులో ఎలాంటి లాజిక్ లేదు.. ఇదంతా రూమరే... స్పిరిట్ రేంజ్ ని తగ్గించేందుకు, బాలీవుడ్ యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ చేస్తున్న విషప్రచారం.. అందుకే వీటికి రియాక్ట్ అవటం దండదే అన్నాడట. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ నుంచి స్పిరిట్ కి ఓటీటీ రూపంలో భారీ ఆఫర్లే వస్తున్నా సందీప్ మాత్రం తొందర పడకూడదని నిర్ణయించుకున్నాడట. రెబల్ స్టార్ ప్రబాస్ కూడా ఈ విషయంలో ఎలాంటి ప్రెజర్ పెట్టట్లేదని తెలుస్తోంది. పూర్తిగా సందీప్ రెడ్డి వంగ నిర్ణయానికే, టీసీరీస్ కాని, ప్రబాస్ కాని కట్టుబడినట్టు తెలుస్తోంది.

ఇక స్పిరిట్ మూవీ సగం షూటింగ్ తర్వాత చిన్న పాటి గ్లింప్స్ వదిలేందుకు ఫిల్మ్ టీం మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది. అంటే మరో మూడునెలల్లో స్పిరిట్ షూటింగ్ సగానికి పైగా పూర్తవుతుంది. అప్పడే గ్లింప్స్ ని వదిలి అఫీషియల్గా ప్రమోషన్ మొదలు పెట్టాలనేది సందీప్ ఆలోచనట.. అప్పుడే అసలైన హైప్ వస్తుంది. దానిబట్టి ఓటీటీ రైట్స్ హైకె అయ్యే ఛాన్స్ఉంది.ప్రస్తుతానికి స్పిరిట్ కి 790 కోట్ల వరకు ఓటీటీ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. టీజరో, గ్లింప్సో వస్తే దాని రెస్పాన్స్ వల్ల, ఓటీటీ ఆఫర్ మరింతగా 1000 కోట్ల వరకు పెరగొచ్చనే వేయిట్ అండ్ సీ పాలసీ ఫాలో అవుతన్నాడట సందీప్.. ఇదే విషయం కల్కీ 2 సెట్లో టీసీరీస్ అధినేత, సందీప్, అలానే ప్రభాస్ కూర్చుని డిస్కర్ష్ చేయటమే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ లొ కొందరికి కూడా రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Published : 
  • 18 April 2026, 8:15 PM IST