ఆ ఒక్కటి కావాలి ఇంకేం వద్దు…?

టాలీవుడ్ పాపులర్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన మధురమైన గొంతుతో, విలక్షణమైన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారామె. అయితే, ఎప్పుడూ తన పాటలతో, ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉండే గీత

Post Published By: dialnews
Updated : 25 April 2026, 10:50 AM IST

టాలీవుడ్ పాపులర్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన మధురమైన గొంతుతో, విలక్షణమైన అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారామె. అయితే, ఎప్పుడూ తన పాటలతో, ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉండే గీత.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి, పిల్లలు, మరియు ఈ కాలం నాటి సోషల్ మీడియా వ్యసనం గురించి ఆమె చేసిన విశ్లేషణ అందరినీ ఆలోచింపజేస్తోంది.ప్రేమలేఖ రాశా అనే సినిమాతో గాయనిగా టాలీవుడ్‌కు పరిచయమైంది గీత. కానీ, 2007లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'చిరుత' సినిమాలోని "చమ్కా చమ్కీ" సాంగ్ ఆమెకు ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. గోలీమార్‌లో "మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళు" వంటి వందలాది హిట్ పాటలతో ఆమె టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా ఎదిగారు.

దాదాపు ఐదు భాషల్లో 2300కు పైగా పాటలు పాడి, ఎన్నో నంది అవార్డులను కూడా అందుకున్నారు. యువ నటుడు నందుతో ప్రేమలో పడిన గీతా మాధురి, పెద్దల అంగీకారంతో 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2019లో ఒక పాప జన్మించింది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో హ్యాపీగా సాగిపోతున్న వీరి లైఫ్ గురించి గీత తాజాగా సింగర్ నోయల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నందు నాకు రోజూ నువ్వు అందంగా ఉన్నావని చెప్పడు, నేను కూడా చెప్పను.

కానీ ఇన్ స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పెట్టగానే వచ్చే కామెంట్స్ చూసి మురిసిపోతాం. ఈ 'సోషల్ వాలిడేషన్' కోసం ట్రై చేసే ప్రాసెస్ లో అసలైన బంధాలు దూరమవుతున్నాయి. ఆ ప్రాసెస్ లో నాకు నువ్వు లేకపోయినా పర్లేదు అన్నట్లుగా మనుషులు తయారవుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. గీతా మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు నేటి యువతకు ఒక హెచ్చరిక లాంటివి. బయటి వ్యక్తుల మెప్పు కోసం, లైకుల కోసం పాకులాడుతూ మన పక్కనే ఉన్న మనుషుల విలువను మర్చిపోతున్నామేమో అన్న సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. సింగింగ్, డబ్బింగ్, జడ్జిగా బిజీగా ఉంటూనే.. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద గీతా మాధురి స్పందించడం పట్ల నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

Published : 
  • 25 April 2026, 10:50 AM IST