సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న వారణాసి షూటింగ్, ఆగినా వార్తే.. ఆగకున్నా వార్తే... అంటార్కిటికా షెడ్యూల్, లుక్ మార్చుకునేందుకు అమెరికా వెల్లిన మహేశ్ బాబు, ఇలా ప్రతీది వార్తగా మారుతోంది. ఇవన్నీ ఇండియాలో ప్రమోషన్ కి పనికొస్తాయి.. కాని ఇలాంటి ప్రమోషన్ తో అమెరికన్, యూరోపియన్ మార్కెట్లను వారణాసి కొల్లగొట్టడం కష్టం...మ్యాజిక్ అంతా కంటెంట్ లోనే ఉండాలి... నిజంగా 55 వేల నుంచి 70 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసినంత మాత్రాన వారణాసిని చూస్తారా? కేవలం అందులో మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ ఉంటే తప్ప, ఒక ఇండియన్ సినిమా, వరల్డ్ ఆడియన్స్ ని షేక్ చేయటం కష్టం... ఐతే రాజమౌళి అన్ని సినిమాలు ఒకలా ఉండవు... ఆ మాటే వారణాసితో నిజం చేయబోతున్నాడు. టన్నులకొద్ది సర్ ప్రైజులు ప్లాన్ చేసిన తను, అంటార్కిటికాలో అద్భుతాన్ని స్రుష్టంచబోతున్నాడు.. అదేంటి?
వారణాసి మూవీ 70 వేల థియేటర్స్ కాదు 55 వేల స్క్రీన్లు కూడా కాదు, 30వేల థియటేర్స్ లో రిలీజ్అయినా కూడా ఎవరెందుకు చూస్తారు...? ఇండియాలో అంటే మహేశ్ బాబు, రాజమౌలి కోసం వారణాసి ని చూస్తారనుకోవచ్చు.. అమెరికా,యూరప్ లో సెటిలైన ఇండియన్స్ వారణాసి కోసం అక్కడ క్యూకడతారనుకోవచ్చు..కాని తెల్లోల్లు,, అందులో అమెరికన్లు, యూరోపియన్లు ఎందుకు వారనాసిని చూడాలి?ఈ ప్రశ్న మనకేనా, ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న రాజమౌళి తనకి తాను వేసుకోలేదంటారా? బాహుబలి తీసేప్పుడు తెలుగు మార్కెట్ 200 కోట్లు.. కాని 280 కోట్లు పెట్టి బాహుబలి తీశాడు.. అంటే హిట్టైనా పెట్టింది తిరిగి రాదని తెలుసు.. మరెలా తీశాడు.. మరో మార్కెట్ ని కూడా శాసిస్తే, 200 కోట్లు కాస్త 1850 కోట్లవుతాయని బాహుబలి 2 తో ప్రూవ్ అయ్యింది.
అలానే వరల్డ్ ఆడియన్స్ మన సినిమా చూడాలంటే, ఏం కావాలో, అందులో మనం ఏం ఇవ్వాలో ఆలోచించకుండానే 55 వేల థియేటర్స్ నుంచి 70 వేల థియేటర్స్ వరకు ప్లాన్ చేస్తాడా? ఇంతకి రాజమౌళి ఏం ప్లాన్ చేశాడు? అందులో ఏం చూసి తెల్లోల్లు మన వారనాసికి ఫిదా అవుతారు.. ముందుగా అమెరికన్లు, యూరోపియన్లు మన సినిమా చూడాలంటే చూడరు.. ఎందుకంటే, పాటలు, ఫైట్లు, హీరో ఎలివేషన్లు,వాళ్లకి నచ్చటం అరుదు.. ఏదో త్రిబుల్ ఆర్ లో నాటు నాటు పాట బాగుంది... ఇంటర్వెల్ యానిమల్ ఫైట్ అదిరింది... హీరోల ఫ్రెండ్ షిప్ నచ్చింది..అయినా అది స్పెషల్ స్క్రీనింగ్ లా చూశారు కాని, హాలీవుడ్ సినిమాలొస్తే, థియేటర్స్ ముందు క్యూకట్టినట్టు వారణాసికోసంవాల్లెందుకు క్యూ కడతారు? అయినా వాళ్లు చూడటం అంత అవసరమా అంటే ఔను.. అవసరమే.. అమెరికన్లు,యూరోపియన్లుదే వరల్డ్ సినిమా మార్కెట్ లో 65 శాతం...అంటే తెల్లోల్లు చూస్తేనే వరల్డ్ మార్కెట్ లో 65 శాతం వాటా ఆ సినిమాకు దక్కుతుంది.
అందుకే వాళ్లను ఇంప్రెస్ చేసేందుకు వాళ్లదారిలోనే, వాల్ళ మూవీ ఇండియాన జోన్స్ స్టైల్ నే ఎంచుకున్నాడు రాజమౌలి. వారణాసిని ఆల్రెడీ ఇండియానా జోన్స్ కి ఇండియన్ వర్షన్ అన్న యాంగిల్ లో ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఐమ్యాక్స్ కెమోరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ.. అది ఓరకంగా వరల్డ్ ఆడియన్స్ కి రీచ్ పెంచేలా చేస్తుంది. ఇది కాకుండా అంటార్కిటికా మంచు ఖండంలో 4 హాలీవుడ్ సినిమాలు తీశారు. ఐదో మూవీ ఇదే అన్న ప్రచారం డెఫినెట్ గా వరల్డ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది.ఇక డైనోసార్ల యాక్షన్ సీక్వెన్స్, టైం ట్రావెల్, ఇలా చాలా ట్విస్టులు వరల్డ్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ రెడీ చేయబోతున్నాయి. వీటకి తోడు ఇండియానా జోన్స్ కి ఇండియన్ మైథాలజీ యాడ్ చేస్తే ఆ కొత్త ఫ్లేవర్ వాళ్లకు సరికొత్తగా అనిపించొచ్చు.. సో ఇవన్నీ ఆలోచించే, ఇలా ఫార్ములా మార్చి 10 వేల కోట్ల వసూళ్లను రాబట్టేందుకు అన్ని కోనాల్లో కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి... సో అమెరికా, యూరప్ దేశాళ్లో ఇండియన్స్ కాకుండా, తెల్లోల్లు కూడా చూస్తే 65 శాతం ఈ సినిమా వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసినట్టే.. 10 కోట్ల సునామీ వచ్చినట్టే.