Top story: మోడీ దెబ్బకు వైట్ హౌస్ లో ట్రంప్ ఏడుపులు…మోదీ ‘మాస్’ డిప్లొమసీ నీకు అమెరికా ఫస్ట్ నాకు ఇండియా ఫస్ట్ అంటున్న మోడీ… ఇరాన్ విషయంలో భారత్ స్లిప్పర్ షాట్…!

డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి ఆయనకు ఒక గట్టి నమ్మకం ఉండేది. తన ప్రాణ మిత్రుడు నరేంద్ర మోదీ, భారత్ కచ్చితంగా ఇరాన్ విషయంలో తన వెంటే నడుస్తారని ఓ గుడ్డి నమ్మకం.

Post Published By: dialnews
Updated : 1 May 2026, 2:30 PM IST

డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి ఆయనకు ఒక గట్టి నమ్మకం ఉండేది. తన ప్రాణ మిత్రుడు నరేంద్ర మోదీ, భారత్ కచ్చితంగా ఇరాన్ విషయంలో తన వెంటే నడుస్తారని ఓ గుడ్డి నమ్మకం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అదే లెక్కలు వేసుకున్నారు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలంటే భారత్ ఆ దేశం నుండి వ్యాపారాలు ఆపేయాలని, పూర్తిగా అమెరికా గూటికి రావాలని వారు గట్టిగా ఆశించారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భారత్ ఒక స్వతంత్ర దేశంగా, తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తోంది.

ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు ఇచ్చినా, ఇంత యుద్ధం జరుగుతున్నా.. భారత్ మాత్రం ఇరాన్‌తో తనకున్న దశాబ్దాల బంధాన్ని వదులుకోవడానికి ససేమిరా అంది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే.. భారత్‌ను గట్టిగా ఏమీ అనలేడు, అలాగని భారత్ చేస్తున్న పనిని చూస్తూ ఊరుకోలేడు. అందుకే వైట్ హౌస్ మూసి ఉన్న గదుల్లో తన అధికారుల ముందు ఆయన పడుతున్న అసహనం ఇప్పుడు అంతర్జాతీయ చర్చాంశనీయంగా మారింది. అమెరికా ఒక దేశం మీద ఆంక్షలు విధించింది అంటే సాధారణంగా ఏ దేశమైనా భయపడి వెనక్కి తగ్గుతుంది.

కానీ మోదీ ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. "మీ యుద్ధాలు మీవి.. మా అవసరాలు మావి" అని ముఖం మీదే చెప్పేసింది. ఇరాన్ నుండి భారత్‌కు చమురు సరఫరా మళ్ళీ మొదలుకావడమే కాదు.. అత్యవసర మందులు, ఆహార ధాన్యాల రూపంలో భారత్ నుండి ఇరాన్‌కు సహాయం అందుతూనే ఉంది. హార్ముజ్ జలసంధి దగ్గర అమెరికా నౌకాదళం నిఘా పెట్టినా, భారత నౌకలు మాత్రం గర్వంగా ఆ దారి గుండా ప్రయాణిస్తున్నాయి. భారత్ చేస్తున్న ఈ పని అమెరికా అహాన్ని దెబ్బతీస్తోంది. ఆంక్షలను తుంగలో తొక్కడమే కాకుండా, ఇరాన్ అప్రిన్ డ్రై పోర్ట్ మరియు చాబహార్ పోర్ట్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

ఇది చూస్తున్న ట్రంప్ కు కోపం నరనరాలకూ పాకుతున్నా, భారత్ తో ఉన్న వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఆయన మౌనంగా భరించాల్సి వస్తోంది. అసలు ట్రంప్ ఎందుకు భారత్‌ను ఏమీ అనలేకపోతున్నాడు..? దానికి ప్రధాన కారణం భారత్ యొక్క పెరుగుతున్న గ్లోబల్ పవర్. చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ మద్దతు తప్పనిసరి. భారత్‌ను దూరం చేసుకుంటే అమెరికాకు ఆసియాలో మిత్రులే ఉండరు. అందుకే ట్రంప్ అటు కక్కలేక ఇటు మింగలేక ఏడుస్తున్నాడు.

ట్రంప్ ఆంక్షల వల్ల కలిగే అతిపెద్ద ఇబ్బంది 'డాలర్' వాడకం. కానీ మోదీ ప్రభుత్వం ఇక్కడ ఒక తెలివైన స్కెచ్ వేసింది. మనం ఇరాన్ నుండి కొనే చమురుకు డాలర్లలో కాకుండా 'రూపాయిల్లో' పేమెంట్ చేసేలా ఒప్పందం చేసుకున్నాం. ఇరాన్ ఆ రూపాయిలను తిరిగి భారత్ నుండి మందులు, బియ్యం, టీ పొడి వంటి వస్తువులు కొనడానికి వాడుకుంటుంది. అంటే, అమెరికా తన 'స్విఫ్ట్' బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మనల్ని ఏమీ చేయలేదు. వైట్ హౌస్‌లో ట్రంప్ పిసుక్కునేలా చేస్తున్న ప్రధాన కారణం ఇదే డాలర్ ఆధిపత్యాన్ని భారత్ ఇంత ఈజీగా పక్కన పెట్టేయడం ఆయనకు అస్సలు మింగుడుపడటం లేదు.

ఇరాన్ మీద ఎన్ని ఆంక్షలు ఉన్నా, ఇరాన్‌లోని చాబహార్ పోర్ట్ విషయంలో మాత్రం భారత్‌కు అమెరికా మినహాయింపు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం అందాలన్నా, మధ్య ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలన్నా చాబహార్ ఒక్కటే మార్గం. భారత్ ఈ పాయింట్‌ను అడ్డం పెట్టుకుని ఇరాన్ తీరంలో తిష్ట వేసింది. "చాబహార్ మా వ్యూహాత్మక ఆస్తి, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదు" అని భారత్ గట్టిగా నిలబడింది. ట్రంప్‌కు ఇరాన్‌ను దెబ్బతీయాలని ఉన్నా, భారత్ చాబహార్ ద్వారా చేస్తున్న పనిని ఆపలేక లోపల రగిలిపోతున్నాడు.

వైట్ హౌస్ లో తన సన్నిహితుల దగ్గర "ఇండియా మనకు అస్సలు సహకరించడం లేదు" అని పిసుక్కుంటున్న ట్రంప్, బయటకు మాత్రం మోదీని "గ్రేట్ లీడర్" అని పొగడాల్సి వస్తోంది. భారత్ తన ఆయుధాల కోసం రష్యాతో, చమురు కోసం ఇరాన్‌తో బంధాన్ని కొనసాగించడం అమెరికాకు మింగుడుపడటం లేదు. వాషింగ్టన్ వర్గాల్లో భారత్ తీరుపై ఎంత చర్చ జరుగుతున్నా, మోదీ గారు మాత్రం తన దౌత్యనీతితో అమెరికా చేతులను కట్టడి చేసేశారు. ఇది కేవలం ఒక దేశం తీసుకున్న నిర్ణయం కాదు, ఒక కొత్త శక్తిగా ఉద్భవిస్తున్న భారత్ యొక్క విశ్వరూపం.

ఒకప్పుడు అమెరికా కళ్లు ఎర్రజేస్తే చాలు తలొగ్గే దేశాలు ఉండేవి. కానీ నేడు భారత్ తన సొంత దారిని వెతుక్కుంటోంది. ఇటు ఇజ్రాయెల్ తో దోస్తీ చేస్తూనే, అటు పాలస్తీనా మరియు ఇరాన్ వంటి దేశాలతో సమతుల్యతను కాపాడుతోంది. ట్రంప్ కు భారత్ ఒక విధేయమైన మిత్రుడిగా ఉండాలని ఉన్నా, భారత్ మాత్రం ఒక సమానమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటోంది. ఆంక్షల చక్రబంధాన్ని ఛేదించి, ఇరాన్ గుండెల్లో మందులు మరియు సరుకులు చేరవేస్తూ భారత్ తన మానవత్వాన్ని, తన పౌరుషాన్ని నిరూపించుకుంది. వైట్ హౌస్ లో ట్రంప్ పిసుక్కుంటున్నంత కాలం, భారత్ గ్లోబల్ స్టేజ్ మీద గర్వంగా తలెత్తుకు నిలబడుతూనే ఉంటుంది.

Published : 
  • 1 May 2026, 2:30 PM IST