సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి తో వరల్డ్ సినిమాను ఏలబోతున్నాడు.. ఫస్ట్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు.. అందులో ఎలాంటి డౌట్ లేదు. రాజమౌళి డైరెక్షన్ కాబట్టి, పక్కగా ఇది వరల్డ్ మార్కెట్ లో దూసుకెళుతుందనే కాన్ఫిడెన్స్ అందరిలో కనిపిస్తోంది. కాని ఇక్కడ సమస్య ఏంటంటే, ఇందులో మహేశ్ బాబు డైనోసార్ మీద స్వారి చేసే సీన్లుంటాయనే ప్రచారం.. నిజంగానే అలాంటి సీన్లు ఉన్నా, డైనోసార్ మీద ఎక్కి స్వారీ చేయాలంటే, తనిప్పుడు జర్మనీ కొండలెక్కాలా? రీసెంట్ గా వెకేషన్ అని లాస్ ఏంజిల్స్ వెళ్ళాడు.. వారణాసి బ్రేక్ టైంలో వెకేషన్ లీవ్ తీసుకున్న తను, సడన్ గా జర్మనీలో తేలాడు.. బ్లాక్ ఫారెస్ట్ కొండలెక్కుతున్నాడు.. ఇంతకి వారణాసి నెక్ట్స్ షెడ్యూల్ లో ఏం తీయబోతున్నారు? దానికి జర్మనీలో కొండలెక్కడానికున్న లింకేంటి?
సూపర్ స్టార్ మహేశ్ బాబు సడన్ గా జర్మనీ కొండలెక్కుతూ బిజీ అయ్యాడు. అసలు వారణాసి మూవీ షూటింగ్ కి ముందు కూడా ఇదే జర్మనీ వెళ్లి, అక్కడ ట్రెక్కింగ్ చేశాడు. అడవుల్లో ఎక్కువ కాలం షూటింగ్ అవసరం కాబట్టి, ట్రెక్కింగ్ తో అడవులకు అలవాటు పడొచ్చు.. దీనికి తోడు సినిమాలో తన పాత్రకి అవసరమైన కొన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చనే జర్మనీ వెళ్లాడు.కట్ చేస్తే వారణాసి షూటింగ్ 80శాతం పూర్తైంది. రీసెంట్ గా ప్రియాంక చోప్రాతో సాలిడ్ డాన్స్ నెంబర్ ని షూట్ చేశారు.. ఆ పాట షూటింగ్ కాగానే వెకేషన్ బ్రేక్ తీసుకుంది సినిమా టీం.మహేశ్ బాబు మాత్రం అమెరికా వెళ్ల, అటునుంచి జర్మనీ జంప్ చేశాడు. వెకేషన్ కి సోలోగా వెళ్లి రిలాక్స్ అవుతున్నాడని అంతా అనుకున్నారు. కాని జర్మనీలో ఇలా ట్రెక్కింగ్ చేస్తూ, సడన్ షాక్ ఇచ్చాడు మహేశ్ బాబు.
హెల్త్ ఎక్స్ పర్ట్ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్య వేక్షనలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు మహేవ్.. జర్మీనిలోని బ్లాక్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ తో పాతు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏదో తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాని ఆ ట్రైనింగ్ దేనికోసం అన్నది తేలలేదు.. 50ప్లస్ ఏజ్ లో కూడా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే మహేశ్, తన లుక్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా, హెల్త్ కాపాడుకుంటూనే, వారణాసికోసం చాలా వర్కవుట్లే చేస్తున్నాడు.ఈ జర్మనీ ట్రైనింగ్ క్యాంప్ తర్వాత మళ్లీ హైద్రబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఐతే అది కేవలం వారంరోజులే ఉంటుందని తెలుస్తోంది. ఆతర్వాత టీం అంతా కలిసి అంటార్కిటీకా వెళ్లబోతున్నారు. అక్కడ ఇంతవరకు నాలుగంటే నాలుగే హాలీవుడ్ సినిమాలు తెరకెక్కాయి. ఐదో సినిమాగా వారణాసి తెరకెక్కబోతోంది.
సో ఆ షూటింగ్ కోసమే మహేశ్ బాబు ఇంతలా జర్మనీలో ట్రెక్కింగ్ అండ్ ట్రైనింగ్ తీసుకున్నాడా అనే ప్రచారం పెరిగింది. ఐతే వారణాసి లో టైం ట్రావెల్ కాన్సెప్ట్, డైనోసార్లతో సాహస యాత్ర అన్న పాయింట్ మీద ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దాని ప్రకారం, మరి డైనోసార్ల మీద ఎక్కి సాహసాలు చేసేందుకే, మహేవ్ ఇలా జర్మీనీలో కొండలెక్కతున్నాడా అన్నట్టు సరదా కామెంట్లు కూడా సోసల్ మీడియాలో పెరిగాయి.. ఏదేమైనా ఈనెల్ల రాజమౌలి ఈ సినిమా టీజర్ లాంచ్ మీద ఎనౌన్స్ మెంట్స్ ఇస్తాడనే లీకులు, ఫీలర్లు పెరిగాయి.. మరి ఆ న్యూస్ వస్తుందో... రూమర్ గా మిగులుతుందో, ఈనెల 15 లోపు తేలే ఛాన్స్ఉంది.