1400 కోట్ల సినిమాకు.. 10 కోట్ల షాక్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లోనే బిగ్జెస్ట్ బడ్జెట్ మూవీ వారణాసి. 1400 కోట్ల హెవీబడ్జెట్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. దీనికి హాలీవుడ్ లో మంచి రీచ్ ఉన్న ప్రియాంక చోప్రా యాడ్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 7:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లోనే బిగ్జెస్ట్ బడ్జెట్ మూవీ వారణాసి. 1400 కోట్ల హెవీబడ్జెట్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. దీనికి హాలీవుడ్ లో మంచి రీచ్ ఉన్న ప్రియాంక చోప్రా యాడ్ అయ్యింది. ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్, అంటార్కిటికాలో ఫైటింగు, టైమ్ ట్రావెలింగ్, ఇండియన్ మైథాలజీ మిక్సింగ్.. ఇలా చాలా వింతలు విశేషాలున్న 1400 కోట్ల సినిమాకు, 10 కోట్ల కష్టాలొచ్చాయి... ఎందుకంటే గంగానదిలో సాలిడ్ సీన్స్ తీయబోతే... ఏకంగా గంగానదే ఎండిపోయింది... వింటానికి వింతగా ఉన్నా, రియల్ గా జరిగింది అంతకంటే వింతగా ఉంది. ఎన్నడూ ఎండిపోని గంగ, వారణాసి మూవీ వల్ల ఎండిపోయిందట... అందుకే వేసవి వడదెబ్బకు వారణాసి మొత్తం టీం, ఈ నెలరోజులు ఇంటికే పరిమితమౌతోంది.. అంతా కలిపితే 10 కోట్ల వల్లే ఈ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో గంగనదే ఆవిరైపోవటం షాకింగ్ గా అనిపించొచ్చు.. కాకపోతే ఇది రియల్ గంగానది స్టోరీ కాదు.. వారణాసి మూవీలో గంగానదికొచ్చిన సమస్య.

జస్ట్ ఇమాజిన్ పదికోట్లు పెట్టి కొన్న రోల్స్ రాయిస్ కారు, కీలేక పోవటం వల్లే స్టార్ట్ కాలేదంటే ఎలా ఉంటుంది.. వందకోట్లు పెట్టి కొన్న చార్టర్డ్ ఫ్లైట్, పెట్రోల్ లేక హ్యాంగర్ లనే ఉండిపోతే ఇంకెలా ఉంటుంది... సిల్లీగా ఉపగ్రహాలను మోసుకెళ్లే రాకెట్ ప్రయోగాన్ని వర్షం వల్ల ఆపేస్తే ఇంకెలా ఉంటుంది.. అచ్చంగా వారణాసి షూటింగ్ బ్రేక్ వెనకున్న షాక్, వాటరే అని తెలుస్తోంది.కాశి అంటే వెంటనే గుర్తొచ్చేది శివుడే కాదు, గంగకూడా... నిరంతరం ప్రవహించే గంగ ఒక్కసారి ఎండిపోతే ఊహించుకోండి.. అలా కలలో కూడా జరగదు.. కాని వారణసి మూవీ సెట్లో జరిగింది. ఈ సినిమాలో కీ సీన్ కాశీ ఘాట్ లో ఫైట్.. అది తీయాలంటే, ఎంత గ్రాఫిక్స్ లో గ్రీన్ మ్యాట్ వేసి మ్యానేజ్ చేసినా, కొంతలో కొంత, చిన్న చెరువులాంటిది తవ్వి, దాని అంచున కాశీ ఘాట్లను పోలిన సెట్లేయాలి.

అదే వారణాసి టీం చేసింది.. కాని ఏం లాభం, సెట్ రెడీ కాని, గంగానదిని తలపించేలా ఆ సెట్ లో రెడీ చేసిన చెరువులో నిల్లే లేవు... సరే 150 ట్యాంకర్లతో ఆచెరువులో అంచుబాగాలు నింపి, ఏదోలా కవర్ చేద్దామంటే, తెలంగాణ గవర్నమెంట్ నో చెప్పిందన్న వార్త వైరలైంది. అసలే ఎండాకాలం, చెరువులేకాదు, సరస్సులే ఈ ఎండలకు ఆవిరైపోతున్నాయి..ఇలాంటి టైంలో సాదారణ జనానికి తాగునీరే అందలేని పరిస్థితుంది.. ఇక ఇంటి అవసరాలకు కూడా నీళ్ల కష్టాలు తప్పట్లేదు.. ఇలాంటి టైంలో వారణాసి మూవీ షూటింగ్ కోసం 150 ట్యాంకులు కాదు, కనీసం 10 ట్యాంకులు కూడా సప్లై చేయలేని పరిస్థితి.. ఒకవేల రాజమౌళి అండ్ కో మీద దయతలిచి ఏ అధికారైనా, నీళ్లు పంపిస్తే, అది ప్రభుత్వం మీదో పెద్ద మచ్చగా మారి, వివాదంగా వైరలయ్యే ఛాన్స్ఉంధి

ఇక్కడే కాదే దేశం మొత్తం ఎక్కడ ఈ సినిమా కోసం సెట్ చేసి, ఇలా నీల్లడిగాన ఇచ్చే పరిస్థితుండదు.. అందుకే ఈ ఎండాకాలం నీళ్ల కష్టాలకు భయపడి, వేసిన సెట్ ని రెడీ చేసిన ప్లాన్ ని వాయిదా, వేసి మరో షెడ్యూల్ ప్లాన్ చేద్దామా అంటే, ప్రాక్టికల్ గా అయ్యే పనిలా లేదట.. అందుకే వేసవి అయ్యేవరకు వారణాసి టీం కి సెలవులు ప్రకటించాడట రాజమౌళి. కొన్ని డిపార్ట్ మెంట్లు ఎవరి పనుల్లో వాల్లున్నారు. సూపర్ స్టార్ మహేశ్ కూడా ఈ వెకేషన్ కి ఫ్యామిలీతో రిలాక్స్ కాకుండా, జర్మనీకెళ్లి ట్రెక్కింగ్ తో పాటు వర్కవుట్లతో బిజీ అయ్యాడు. ఏదేమైనా 10 కోట్ల వరకు ఖర్చు చేసి వాటర్ తో వారణాసి సెట్లో గంగని ప్రవహింప చేయబోతే, అసలు షూటింగే ఆగిపోయేలా చేశాయి ఎండలు... ఇది వారణాసి వెకేషన్ వెనకున్న సమ్మర్ ఎఫెక్ట్ కథ.

Published : 
  • 5 May 2026, 7:50 PM IST