మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలాఇప్పుడు ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేసే న్యూస్ వచ్చేసింది.ఇండియాలో పెద్ది సినిమా జూన్ నాలుగో తేదీన విడుదల కావలసి ఉంది.
అయితే, జూన్ 3వ తేదీ రాత్రి భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు నార్త్ అమెరికాలో వరల్డ్ ఫస్ట్ షో ప్రీమియర్స్ పడబోతున్నాయి.
అంటే, సోషల్ మీడియాలో ఫస్ట్ రివ్యూస్, రియాక్షన్స్ కొన్ని గంటల ముందే మనకు ముందుగానే మనకు తెలిసిపోతాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు వారం ముందు బుకింగ్స్ ఓపెన్ చేస్తారు.కానీ ‘పెద్ది’ విషయంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.మే 7 నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్
అంటే దాదాపు నెల రోజుల ముందే టికెట్లు రిలీజ్ అవుతున్నాయి.
ఇది సినిమా మీద ఉన్న క్రేజ్ కి క్లియర్ ఎగ్జాంపుల్. ఈ విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేశారు.
టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడే పరిస్థితి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆయన అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ స్పోర్ట్స్ డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్తాయని అంచనా బలంగా ఉంది. రామ్ చరణ్ 'RRR' తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బుచ్చిబాబు సానా వంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో కలిసి చేస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగపూరితమైన కథతో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.
ఐదు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం, ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచవ్యాప్తంగా మరోసారి చాటిచెప్పబోతోంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో ఉండబోతున్నాయి.