చరణ్ కి… మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ తోడు..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలబడబోతున్నారా? ఈ డౌట్ కి సాలిడ్ రీజనుంది... ఆ కారణం పేరే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఔను తను వదిలేసుకున్న కథే పెద్ది.. ఆ సినిమా బాగుండాలంటే, అది ఆడాలంటే, ఏదో మ్యాజిక్ జరగాలి.

Post Published By: dialnews
Updated : 6 May 2026, 6:50 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలబడబోతున్నారా? ఈ డౌట్ కి సాలిడ్ రీజనుంది... ఆ కారణం పేరే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఔను తను వదిలేసుకున్న కథే పెద్ది.. ఆ సినిమా బాగుండాలంటే, అది ఆడాలంటే, ఏదో మ్యాజిక్ జరగాలి.. అదే మ్యాజిక్ కథలో ఉండాలి... ఉప్పెన లాంటి ఫస్ట్ హిట్ తో వందకోట్లు రాబట్టిన బుచ్చి బాబు మీద సుకుమార్ కి మంచి గురే ఉంది. తను కూడా రంగంలోకి దిగి శిష్యుడికి సాయం కూడా చేస్తున్నాడు. ఐతే రామ్ చరణ్ కోసం కథ త్యాగం చేసిన ఎన్టీఆర్, అభిమాన సాయం కూడా చేయబోతున్నాడా? ఈ డౌట్ రావటానికి రీజన్ పెద్ది మీద యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ చాలా తక్కువ కనిపించటం... యాంటీ ఫ్యాన్స్ దాడి జరక్కుండా, చాలా వరకు ఎన్టీఆర్ ఫ్యాన్సే పెద్ది మూవీకి అండగా నిలబడటం... నిజానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ , ప్రభాస్ ఈ నలుగురి మీద యాంటీ ఫ్యాన్స్ దాడి వెరీ వెరీ నార్మల్... అందుకే ఈ నలుగురి ఫ్యాన్స్ ఒక స్టార్ కోసం, మరొకరు అన్నట్టు తోడుగా నిలబడుతున్నారా? కథనే ఇచ్చేసిన ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ కోసం ఏం చేయబోతున్నాడు?

రామ్ చరణ్, ఎన్టీఆర్ రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మంచి స్నేహితులే.. మరీ బాలీవుడ్ స్టార్స్ మధ్యలో ఉండే డమ్మీ స్నేహం వీళ్లలో కనిపించదు.అక్కడంటే, ఇద్దరు హీరోలు కలిసి సినిమాచేస్తే, అది చేసేంత వరకే ఇద్దరి మధ్యలో స్నేహం కనిపిస్తుంది.. సౌత్ లో ఇలాంటి కమర్శియల్ స్నేహాలు కనిపించవు... కాబట్టే, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో త్రిబుల్ ఆర్ ని తీయగలిగాడు రాజమౌళి.తర్వాత ఎన్టీఆర్ దేవరతో హిట్ మెట్టెక్కి, చఱన్ ఆచార్య, గేమ్ ఛేంజర్ తో డీలా పడితే, ఊరుకోలేదు. బుచ్చి బాబు తో తను కమిటైన పెద్ది కథని, చరణ్ కి ఇచ్చేశాడు. ఆ కథ, ఈ కథ ఒకటి కాదని ఎవరేమన్నా, ఓవరాల్ గా ఎన్టీఆర్ త్యాగం వల్లే, పెద్ది కథ చరణకి వెళ్లిందనే ఇండస్ట్రీ నమ్ముతోంది. అది కాకుండా ఆ కథ చరణ్ కే ఎక్కువ నప్పుతుందనేది ఎన్టీఆర్ అభిప్రాయం అని కూడా అన్నారు.

కారణం ఏదైనా, పెద్ద మూవీ కథని త్యాగం చేసేవరకే ఎన్టీఆర్ ఆగట్లేదు.. ఆ మూవీలో గెస్ట్ రోల్ వేసేందుకు కూడా తను సిద్దమయ్యాడని గతంలో ప్రచారం జరిగింది. అది జరుగుతుందా? లేదంటే ప్రమోషన్ లో ఎన్టీఆర్ భాగమౌతాడా అన్నది చూడాలి.. కాకపోతే పెద్ది ఈవెంట్ కి మాత్రం పక్కగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే స్పెషల్ గెస్ట్ అని ఫైనలైంది.అయితే పెద్ది మూవీ తాలూకు పాటలు, లేదంటే మరే ఇతర ప్రోమోలు వచ్చినా, యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ కొంతవరకు కనిపించింది. కాని కౌంటర్ గా మెగా ఫ్యాన్స్ కితోడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ఇది కొంతవరకు పాజిటివ్ సైనే.. ఇక ఎన్టీఆర్ కూడా పెద్ది మూవీ ఈవెంట్ కి వస్తే, తన ఫ్యాన్స్ లో పూనకాలే.

ఎలాగైతే దేవరకి మెగా ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో.. అచ్చంగా అలానే పెద్దికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ అప్రోచ్ కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. చాలవరకు రామ్ చఱన్ మీద సాఫ్ట్ కార్నరే కనిపిస్తున్నట్టుంది.. అదే జరిదితే, మెగా ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోడైతే, పెద్దిక పెద్దపండగే... ఇక కథ ఏమాత్రం బాగున్నా, పాన్ ఇండియా లెవల్లో రాజమౌళి సెంటిమెంట్ నుంచి చరణ్ బయటపడినట్టౌతుంది.

Published : 
  • 6 May 2026, 6:50 PM IST