మచ్చల పులిని ఎప్పుడైనా చూశావా? అది మాటేసి, సడన్ గా మీదికొస్తే ఎలా ఉంటాదో ఎప్పుడైనా చూశావా...? ఇది అరవింద సమేత వీరరాఘవ లో ఎన్టీఆర్ గురించి జగపతి బాబు చెప్పే డైలాగ్.. ఇప్పుడు అలాంటి భయమే మ్యాన్ ఆఫ్ మాసెస్ ని చూస్తే చాలా మందికి పెరిగిపోతోందా? అంతా పొలిటికల్ ఎఫెక్టే... కోలీవుడ్ స్టార్ విజయ్, తమిళ నాడు నెక్ట్స్ సీఎం అని కన్ఫామ్ అయ్యింది. అంతే అక్కడ విజయ్ లానే, ఇక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సునామీ కన్ఫామ్ అన్న డిస్కర్షన్ మొదలైంది. సినిమాలు తప్ప రాజకీయాలు తనకిష్టం లేదన్న ఎన్టీఆర్ ఎన్నోసార్లు, తాత పార్టినే తనకి దైవం అన్నాడు.. ఆ మాట కూడా అప్పట్లో చాలా మందిని భయపెట్టింది.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ లానే ఎన్టీఆర్ తయారైతే ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.. నెంబర్ 7 అంటే చాలు.. ఏపీలో చాలా మందికి కంగారు పెరుగుతోందట... అంటే ఏడేళ్ల తర్వాతే ఎన్టీఆర్ అసలు సిసలు పొలిటికల్ ఎంట్రీ అన్న ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకు నిజం...? ఏడో నెంబర్ పేరు చెబితే ఏపీలో పొలిటికల్ హీట్ నిజంగా పెరుగుతుందా?
ఏడేళ్ల తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి అడుగుపెడతాడా? తమిళ నాట విజయ్ సీఎం అయినట్టు... తను కూడా ఏపీని ఊపేస్తాడా? ఇప్పుడిదే సోషల్ మీడియాలో పెరిగిన చర్చ.. ఇక్కడ చాలా విషయాల్లో విజయ్ తో ఎన్టీఆర్ కి పోలికలున్నాయి.. కాబట్టే అక్కడ విజయ్ గెలుపు చూసి, ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఉత్సాహం కనిపిస్తోంది.కాకపోతే ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లానేంటి...? ఈప్రశ్నకు ప్రస్థుతమైతే డ్రాగన్ రెండు భాగాలు కంప్లీట్ చేయటం. దేవర సీక్వెల్ పూర్తి చేసి, త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ని మొదలుపెట్టడం.. ఇలా మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. 2029 లో సుకుమార్ తో సినిమా ఉండొచ్చంటున్నారు. ఆతర్వాతే రాజమౌళితో ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనే స్పెక్కులేషన్స్ కనిపిస్తున్నాయి.
ఎలా చూసినా మరో ఐదేళ్ల వరకు ఎన్టీఆర్ డైరీలో కాలీ లేదు. కమిటైన సినిమాలకే టైం లేదు. ఇక సినిమాలొదిలేసి, పాలిటిక్స్ లోకి ఇప్పుడే వెళతాడా అంటే కాదు.. కాని ఏడేళ్ల తర్వాత మాత్రం ఏదో జరగేలా ఉందనే మాట తూటాలా పేలుతోంది. ప్రజెంట్ ఎన్టీఆర్ వయసు 43 ఏళ్లు... మరో ఏడేళ్ళ తర్వాత తను 50 లో పడతాడు..అంటే ఎగ్జాక్ట్ గా తమిళ స్టార్ విజయ్ లానే 50 నిండగానే రాజకీయాల్లోకి వస్తాడా? ఔను విజయ్ కూడా 50 నిండగానే పార్టి పెట్టాడు.. 51 ఏళ్ల వయసులో ఎలక్షన్స్ లో గెలిచి, సీఎం అవుతున్నాడు.. అలా ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే మరో ఏడేళ్లలో ఎన్టీఆర్ కి 50నిండుతాయి.. అప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా? ఇప్పట్లో సినిమాలు తప్ప నో పాలిటిక్స్ అని ఎన్టీఆర్ అన్నా... ఎప్పటికైనా తాత దారిలో తను నడవాల్సిందే.
ఇక తను తాత దారిలో నడిస్తే, పార్టి పెడతాడా అంటే, లేదు తాత పెట్టిన పార్టినే తనకి దైవం అన్నాడంటే, టీడీపీలోనే ఉంటాడా? అంటే లోకేషే కాబోయే సీఎం అంటున్నారు కాబట్టి, తనతో కలిసి పనిచేస్తాడా? తనకే ఎసరు పెడతాడా? ఇవి పొలటికల్ సర్కిల్లో మరీ ముఖ్యంగా టీడీపీ వ్యతిరేకుల్లో జరిగే చర్చ.. ఇప్పటి వరకైతే ఎక్కడా ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అన్నట్టు పరిస్థితి లేదు.. ఎవరి పనుల్లో వాళ్లుబిజి.. కాని టీడీపీని వ్యతిరేకించే బ్యాచ్ మాత్రం, విజయ్ విక్టరీనీ ఎన్టీఆర్ తో పోలుస్తూ, ఏపీలో ఇలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ సీఎం అవుతాడనే ప్రచారాలు పెంచారు... కాకపోతే ఇందులో ఏది నిజమైనా కాకున్నా, మరో ఏడేళ్ల తర్వాత మాత్రం ఎన్టీఆర్ చూపు పాలిటిక్స్ వైపు పడకుండా ఉండటం కష్టం.. దానికి ఇప్పుడు తమిల స్టార్ విజయ్ సక్సెస్ తో పోలికలు పెరగటం కూడా, ఏపీ పాలిటిక్స్ ని , పార్టీలను ఆలోచనల్లో పడేస్తున్నాయనంటున్నారు.