40 ఫైట్లు.. 2 భాగాలు.. 400 కోట్ల గిఫ్టులు…!

డ్రాగన్ మూవీ టైటిల్ ఇదే అని ఆల్ మోస్ట్ కన్ఫామ్ చేసింది ఫిల్మ్ టీం. సో ఎంటర్ ది డ్రాగన్, లేదంటే ఎన్టీఆర్ ది డ్రాగన్ లాంటి టైటిల్స్ తో పనిలేదని తేలింది. అయినా మే 19న రిలీజ్ అయ్యే గ్లింప్స్ వచ్చే వరకు ఏది అఫీషియల్ కాదు

Post Published By: dialnews
Updated : 15 May 2026, 6:10 PM IST

డ్రాగన్ మూవీ టైటిల్ ఇదే అని ఆల్ మోస్ట్ కన్ఫామ్ చేసింది ఫిల్మ్ టీం. సో ఎంటర్ ది డ్రాగన్, లేదంటే ఎన్టీఆర్ ది డ్రాగన్ లాంటి టైటిల్స్ తో పనిలేదని తేలింది. అయినా మే 19న రిలీజ్ అయ్యే గ్లింప్స్ వచ్చే వరకు ఏది అఫీషియల్ కాదు. కాని ప్రశాంత్ నీల్ టీం, ఆల్ మోస్ట్ మీడియాకు ఇదే టైటిల్ అని ఫిక్స్ చేయటం వల్ల, ఇక డ్రాగన్ టైటిల్ విషయంలో మరే డౌట్ అవసరం లేదని తేలింది. ఐతే ఇది రెండు భాగాలుగా ఎందుకు ప్లాన్ చేశారనే విషయమే ఇప్పుడిప్పుడే బయటికి రావటంతో, ఇదే ఇండస్ట్రీని షేక్ చేసే అంశంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఫైట్ సీన్ల వల్లే ఒక్క డ్రాగన్ ని రెండు డ్రాగన్స్ గా మార్చారని తెలుస్తోంది. కేవలం ఫైట్ సీన్ల కోసంమే ఒక కథని, రెండు భాగాలుగా మార్చటం తెలివైన పనికాదు. కాని ఇక్కడ 40 ఫైట్ సీన్లంటే, కేవలం ఫైట్ సీక్వెన్స్ లేకాదు.. అంతకు మించి.. ఒక్కో సీక్వెన్స్ మినిమమ్ 5 నిమిసాలు మ్యాగ్జిమన్ 15 నిమిషాలు ఉంటుందట. అది కూడా కథని నడిపించే కీ సీన్లతో కనెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. అందుకే నరాలు తెగిపోయే క్యూరియాసిటీతో ఉన్న ఆసీన్లవల్లే, 3 గంటల సినిమా 7 గంటలు అవుతోందా? అందుకే చాప్టర్ 1, చాప్టర్ 2 ప్లాన్ చేశారా?

డ్రాగన్ మూవీ టైటిల్ ని ఫిల్మ్ టీం ఫిక్స్ చేసింది. ఇక మీదట ఈ సినిమా టైటిల్ ఇదికాదనే డౌట్లు, ఇంకేం ఉంటుందనే అనుమానాలు అక్కర్లేదని తేలిపోయింది. ఇక తేలాల్సింది, డ్రాగన్ ఎన్ని భాగాలు? ఎందుకు?ఇక్కడే ట్విస్ట్ ఇస్తోంది ఫిల్మ్ టీం. నిజానికి ఇది కేజీయఫ్ లా, సలార్ లా రెండు భాగాలు కాకుండా సింగిల్ సినిమాగానే ప్లాన్ చేశాడు ప్రశాంత్ కాని ఇందులో 40 ఫైట్ సీన్ల వల్లే ఒక కథ, రెండు భాగాలుగా మారానట్టు తెలుస్తోంది. కేవలం ఫైట్ల సంఖ్య ఎక్కువుందని డ్రాగన్ ని రెండు భాగాలుగా పెంచట్లేదు.. ఎందుకంటే సినిమా లో 80 పర్సెంట్ కథంతా ఈ 40ఫైట్ల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. ఫైట్స్ అంటే కొట్టడం, నరకటం, ఇవి కాకుండా, కథనే ఫైట్లతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.

అసలు తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి ఎదగకక ముందు, అంటే బాహుబలికి ముందు వరకు తెలుగు సినిమా ఏది, హిందీలో డబ్బింగ్ రైట్స్ అమ్మినా... ఒకే ఫార్ములా మూవీలో ఎన్ని ఫైట్లున్నాయి.. ఒక్కో ఫైట్ కి ఒక్కో కోటి చొప్పున ఎన్ని ఫైటింగ్ సీన్లుంటే, అన్ని కోట్లు.. ఆలెక్కన డ్రాగన్ లో 40ఫైట్లంటే 40 కోట్లు ఇచ్చి ఈ సనిమా డబ్బింగ్ రైట్స్ కొనేవాళ్లు..కాకపోతే అది ఒకప్పటి పరిస్థితి.. ఇప్పుడు ఇదే సినిమాకు 400 కోట్లు కేవలం నార్త్ నుంచి థియేట్రికల్ రైట్స్ రూపంలో వస్తున్నాయి... అలా చూస్తే ఒకప్పటి ఫైట్ కి కోటి లెక్కకు ఈ 400 కోట్లను పోలిస్తే, ఫైట్ కి పదికోట్లు పడినట్టే...

ఏదేమైనా కేవలం ఫైట్ల వల్లే డ్రాగన్ ని రెండు భాగాలుగా మార్చలేదని తెలుస్తోంది. కథలో మార్పులు, సైఫై జోనర్ ని మాఫియా జోనర్ తో కలపటం వల్లే... అంత లెంథీ కథని 3 గంటల్లో చెప్పటం కష్టమని, స్క్రిప్ట్ తో పాటు సినిమా సైజ్ ని కూడా మార్చేశారు.అందుకే డ్రాగన్ ఫస్ట్ డోస్, డ్రాగన్ డబుల్ డోస్ గా ఈ సినిమా రెండు భాగాలుగా విభజింజారట..మరి ఇవే టైటిల్స్ తో ఈ రెండు సినిమాలొస్తాయా? లేదంటే డ్రాగన్ టైటిల్ ఉంచి, క్యాప్షన్ ని మార్చేస్తారా అన్నది మరో 6 రోజుల్లో తేలుతుంది. మే 19 అర్ధరాత్రి వచ్చే డ్రాగన్ గ్లింప్స్ తో ఈ రెండు భాగాల ప్రాజెక్ట్ కి టైటిల్ ఓకే అయినా, క్యాప్షన్ ఫస్ట్ డోస్, డబుల్ డోస్ ఉంటాయా? మరో పేర్లు వీటిని రిప్లేస్ చేస్తాయా అన్నది తేలాలి.

Published : 
  • 15 May 2026, 6:10 PM IST