Top story:అమెరికాను ఎర్రిపప్పను చేసిన ఇరాన్.. ఇరాన్ ప్రీ క్లైమాక్స్, ఇజ్రాయిల్ స్క్రిప్ట్, అమెరికా స్క్రీ ప్లే, ఇరాన్ తో గేమ్ ఈజీ కాదని అర్ధమైందా..? అమెరికా, ఇజ్రాయెల్ వేసిన అతిపెద్ద సీక్రెట్ ప్లాన్..!

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరిపిన దాడుల వెనుక కేవలం ఆ దేశ అణు క్షిపణులను నాశనం చేయడమే లక్ష్యం అనుకుంటే మీరు పొరపాటే. దీని వెనుక ప్రపంచానికి తెలియని ఒక మైండ్ బ్లోయింగ్ రహస్య ప్లాన్ ఉంది.

Post Published By: dialnews
Updated : 21 May 2026, 2:30 PM IST

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరిపిన దాడుల వెనుక కేవలం ఆ దేశ అణు క్షిపణులను నాశనం చేయడమే లక్ష్యం అనుకుంటే మీరు పొరపాటే. దీని వెనుక ప్రపంచానికి తెలియని ఒక మైండ్ బ్లోయింగ్ రహస్య ప్లాన్ ఉంది. అదే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'. ఇరాన్ దేశ నాయకత్వాన్ని మార్చేసి, తమకు అనుకూలమైన ఒక వ్యక్తిని అక్కడ అధ్యక్షుడిగా కూర్చోబెట్టాలని అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత రహస్యంగా ఒక స్క్రీన్ ప్లే రచించాయి. కానీ, ఒక చిన్న మిస్ కాలిక్యులేషన్ వల్ల ఆ ప్లాన్ మొత్తం తలకిందులైంది. అసలు ఎవరా లీడర్..? అమెరికా వేసిన ఆ భారీ వ్యూహం ఎందుకు ఫెయిల్ అయింది..? న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన ఆ సంచలన నిజాలేంటో క్లియర్ గా తెలుసుకుందాం.

ఇటీవల అమెరికా పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' ఒక సంచలన నివేదికను బయటపెట్టింది. దీని ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన యుద్ధం వెనుక చాలా పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉంది. పబ్లిక్‌గా డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ మిస్సైల్స్, న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేయడమే మా లక్ష్యం అని చెప్పింది. కానీ, తెర వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించి, ఆ దేశంలో తిరుగుబాటు తీసుకురావడం.. ఆ తర్వాత ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్‌ను జైలు నుండి విడిపించి, అతన్ని ఇరాన్ తదుపరి లీడర్‌గా నిలబెట్టడం ఈ ఆపరేషన్ యొక్క అసలు ప్లాన్.

ఈ ప్లాన్‌లో భాగంగా మార్చి 1వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 37 ఏళ్లుగా ఇరాన్‌ను శాసిస్తున్న సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఇరాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుందని, అక్కడ నాయకత్వ సంక్షోభం వస్తుందని ఇజ్రాయెల్ ప్లానర్స్ భావించారు. ఖమేనీ మరణంతో ఇరాన్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. అయితే ఇక్కడే అమెరికాకు ఒక ఊహించని షాక్ తగిలింది. ఖమేనీతో పాటు చనిపోయిన వారిలో, భవిష్యత్తులో అమెరికాతో చర్చలు జరిపి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించగల కొందరు కీలక ఇరాన్ అధికారులు కూడా ఉన్నారు.

అంటే, అమెరికా తన చేతులతో తన ప్లాన్‌ను సగం పాడుచేసుకుంది. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే.. గతంలో 'ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటం నుండి తుడిచేస్తాం' అని గర్జించిన కరడుగట్టిన హార్డ్‌లైనర్ అహ్మదీనెజాద్‌ను ఇజ్రాయెల్ ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంది..? దానికి కారణం ఉంది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న అహ్మదీనెజాద్, ఆ తర్వాత కాలంలో సుప్రీం లీడర్ ఖమేనీతో విభేదించారు. ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని ఎండగట్టారు. దీంతో అతన్ని ఇరాన్ ప్రభుత్వం నర్మక్ డిస్ట్రిక్ట్‌లో హౌస్ అరెస్ట్ చేసింది.

ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం.. అమెరికా బలగాలు ఒక సీక్రెట్ 'జైల్‌బ్రేక్ ఆపరేషన్' చేపట్టాయి. అహ్మదీనెజాద్ ఇంటి బయట కాపలాగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ చెక్‌పోస్ట్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. చెక్‌పోస్ట్ ధ్వంసమైంది, కానీ అహ్మదీనెజాద్ ఉన్న ఇల్లు మాత్రం సురక్షితంగా నిలిచింది. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఈ దాడిలో అహ్మదీనెజాద్‌కు చిన్న గాయాలయ్యాయి. ఈ ఊహించని దాడితో ఆయన పూర్తిగా భయపడిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ తమను వాడుకుంటున్నాయని గ్రహించి, ఆయన ఆ ప్లాన్‌కు సహకరించడానికి నిరాకరించారు.

ఆ తర్వాత ఆయన పబ్లిక్ లోకి రాకుండా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అహ్మదీనెజాద్ తప్పుకోవడంతో ఇజ్రాయెల్ వేసిన అతిపెద్ద 'రెజీమ్ చేంజ్' ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అమెరికా ఆశించినట్లు ఇరాన్ ప్రజలు తిరగబడలేదు, కుర్దిష్ దళాలు కొత్త ఫ్రంట్‌ను తెరవలేదు. వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ మాత్రం.. 'మా లక్ష్యం ఇరాన్ మిస్సైల్స్, నేవీని దెబ్బతీయడం, అది మేము విజయవంతంగా చేశాం' అని కవర్ చేసుకున్నారు. కానీ తెరవెనుక జరిగిన పొలిటికల్ గేమ్ మాత్రం ఘోరంగా విఫలమైంది.

చూశారుగా.. అంతర్జాతీయ రాజకీయం ఎంత క్రూరంగా మరియు వ్యూహాత్మకంగా ఉంటుందో. ఒక దేశ లీడర్‌ను మార్చడానికి ప్రపంచ అగ్రరాజ్యాలు ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తాయో ఈ 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' నిరూపించింది. మరి ఇరాన్‌లో ఖమేనీ తర్వాత రాబోయే కొత్త నాయకత్వం ఎలా ఉండబోతోంది..? ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రపంచాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది..? కాలమే చెప్పాలి.

Published : 
  • 21 May 2026, 2:30 PM IST