ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే.. ఎన్నికల తర్వాత కూడా తన సొంత సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికే చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ రూటే సెపరేట్. తాజాగా ఆయన తన సొంత సామాజికవర్గమైన కాపు నేతలపై, కుల రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన దార్శనికత దాగి ఉంది.ముఖ్యంగా రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ ఇబ్బంది కలగకుండా చూస్తూనే.. మరోవైపు కాపు యువత మైండ్లోంచి ‘కులం’ అనే పిచ్చిని పూర్తిగా తొలగించడానికి పవన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అసలు పవన్ కళ్యాణ్ కాపు యువతకు ఇస్తున్న సందేశం ఏంటి..? కూటమి సుస్థిరత కోసం ఆయన ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది..?
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అత్యంత బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వంపై సాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అయితే, కొందరు కాపు నేతలు కులం కార్డును వాడుతూ కేవలం ఒకే సామాజికవర్గానికి పదవులు రావాలనో లేక ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గనుక దానికి సపోర్ట్ చేస్తే.. అది ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి అనవసరమైన రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.
అందుకే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను ఏ ఒక్క కులానికో పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని వర్గాల కోసం, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పని చేస్తున్నానని స్పష్టం చేశారు. దీనివల్ల కూటమి ప్రభుత్వంలో ఎలాంటి వర్గ విభేదాలు రాకుండా, పరిపాలన సజావుగా సాగేలా పవన్ ఒక పెద్ద లీడర్‌గా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన టార్గెట్ కాపు యువతే. ఎందుకంటే దశాబ్దాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కాపు యువతను కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంక్‌గా, జెండాలు మోసే కూలీలుగా వాడుకున్నారని పవన్ ఆవేదన చెందారు.
అందుకే యువత మైండ్‌లో ఉన్న కులం అనే సంకెళ్లను తెంచాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. "రాబోయే తరాలకు కులం అనే పిచ్చి ఉండకూడదు" అని పవన్ స్పష్టంగా చెప్తున్నారు. యువత కేవలం ఒక కులం పరిధిలోనే ఆలోచిస్తే వారి భవిష్యత్తు నాశనమైపోతుందని, వారు ఐఏఎస్, ఐపీఎస్, బిజినెస్ లీడర్లుగా ఎదగాలంటే కులాల గిరి దాటి గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. యువతను కులం అనే ఊబిలోంచి బయటకు లాగి, వారిని రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం.
పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌లో చాలా బోల్డ్‌గా కొన్ని విషయాలను వెల్లడించారు. "నేను ఒక కాపు కులంలో పుట్టడం అనేది నా చేతుల్లో లేదు.. కానీ నన్ను ఒక కులానికే పరిమితం చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు" అని హెచ్చరించారు. సమాజంలో వెనుకబడిన రెల్లి, మాల, మాదిగ, బీసీ లతో పాటు అన్ని ఉన్నత కులాల్లోని పేదల బాగు కోసం తాను ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. తనను కేవలం ఒకే కులానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చి చూస్తే అది మిగతా కులాల ప్రజలకు జనసేనను దూరం చేస్తుందని పవన్ భావిస్తున్నారు.
అందుకే జనసేన సిద్ధాంతమైన "కులాలను కలిపే ఆలోచనా విధానం" ప్రకారం సమాజంలో ఒక సమూలమైన మార్పు తేవడానికి ఆయన ఈ రకమైన సాహసోపేతమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఓట్లు పోతాయనే భయంతో ఏ నాయకుడూ కూడా తన సొంత కులాన్ని విమర్శించడానికి సాహసించడు. కానీ పవన్ కళ్యాణ్ ఓట్ల రాజకీయం చేయడం లేదు, ఆయన చేస్తోంది భవిష్యత్తు తరాల కోసం ఒక సామాజిక పోరాటం. కాపు యువత తలల్లోంచి కులమనే పిచ్చిని తొలగిస్తేనే.. రాష్ట్రంలో ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని ఆయన నమ్ముతున్నారు.
అటు టీడీపీతో ఉన్న మిత్రధర్మాన్ని నూటికి నూరు శాతం కాపాడుకుంటూ, ఇటు సమాజంలో కుల నిర్మూలన దిశగా అడుగులు వేయిస్తూ పవన్ కళ్యాణ్ ఒక నిజమైన స్టేట్స్‌మన్‌గా నిలుస్తున్నారు. ఆయన తీసుకున్న ఈ స్టాండ్ వల్ల కాపు యువతలో ఒక సరికొత్త చైతన్యం మొదలైంది. ఏదేమైనా, కులం పిచ్చిని వీడాలని పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చిన పిలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ, యువతను ఒక సన్మార్గంలో నడిపించాలనే ఆయన ప్రయత్నం నిజంగా అభినందనీయం.