ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆసక్తికరమైన మరియు హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్‌తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ.. గత కొన్ని రోజులుగా ఏపీలో ఏ ఇష్యూ జరిగినా జనసేన ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని నోరు విప్పడం లేదు. తాజాగా కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ వ్యవహారం గాని, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలు గాని రచ్చ రేపుతుంటే.. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే సింగిల్ హ్యాండ్‌తో వాయిస్ వినిపిస్తున్నారు.
మిగిలిన లీడర్స్ అంతా సైలెంట్‌గా ఉండటంపై జనసేనాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి గట్టిగా క్లాస్ పీకడానికి రెడీ అయ్యారని సమాచారం. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు? మంగళగిరి మీటింగ్‌లో లీడర్లకు ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో, అలాగే క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడలో జరిగిన ‘మన ఊరు - మాటామంతీ’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ పైన, క్రిమినల్స్ పైన చాలా ఘాటుగా స్పందించారు. శాంతిభద్రతల విషయంలో తానే గనుక హోం మంత్రిగా ఉంటే చట్టాన్ని ఉల్లంఘించే వారిని తొక్కి నారతీసేవాడినని ఓపెన్‌గా వ్యాఖ్యానించారు.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ అంతలా రియాక్ట్ అవుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న జనసేన ప్రజాప్రతినిధులు మాత్రం స్థానిక సమస్యలపై గాని, శాంతిభద్రతల లోపాలపై గాని గట్టిగా వాయిస్ వినిపించడం లేదు. కేవలం పవన్ మాత్రమే మాట్లాడాలా? ప్రజా సమస్యలపై పోరాడి గెలిచిన మిగతా 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు జనసేన శ్రేణుల్లోనే కాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్‌ను కూడా ఆలోచింపజేసింది.
ఇక తాజాగా విజయవాడ కృష్ణలంక పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారాన్ని పరిశీలిస్తే.. ఈ కేసులో పోలీసులు సీజ్ చేసిన డిజిటల్ సాక్ష్యాలు కోర్టుకు చేరాయి. ఈ కేసులో బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని, శాంతిభద్రతలు బలోపేతం కావాలని పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న జనసేన లీడర్లు గాని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక నాయకులు గాని ఈ విషయంలో చొరవ చూపించి బాధితులకు అండగా నిలబడటంలో వెనుకబడ్డారనే టాక్ నడుస్తోంది.
రాష్ట్రంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు వచ్చినా, వైసీపీ నేతలు విమర్శలు చేసినా.. వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టడంలో జనసేన ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని పవన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతసేపూ పార్టీని, కూటమిని కాపాడుకుంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారే తప్ప.. లీడర్ల నుంచి ఆయనకు సరైన సపోర్ట్ లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సైలెన్స్‌కు బ్రేక్ వేయాలని సేనాని గట్టిగా ఫిక్స్ అయ్యారు.
ఈ పరిణామాలన్నింటినీ గమనించిన పవన్ కళ్యాణ్.. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక అత్యవసర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తన మార్క్ 'పొలిటికల్ క్లాస్' పీకడానికి రెడీ అయ్యారని సమాచారం. "ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించింది కేవలం పదవుల్లో కూర్చోవడానికి కాదు.. ప్రజల సమస్యలపై మాట్లాడటానికి, కూటమి ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి" అని పవన్ గట్టిగా హెచ్చరించబోతున్నట్లు టాక్.
ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. లీడర్లు ఇలాగే మౌనంగా ఉంటే క్యాడర్ నీరసించిపోయే ప్రమాదం ఉందని పవన్ అలర్ట్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తూనే, నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించేలా అధికారులపై ఒత్తిడి తేవాలని దిశా నిర్దేశం చేయనున్నారు. మంగళగిరి మీటింగ్‌లో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ రిపోర్ట్‌ను పవన్ దగ్గర పెట్టుకుని.. ఎవరెవరు ఏ ఏ ఇష్యూస్‌పై స్పందించారు, ప్రజల్లో ఎవరికి ఎంత మైలేజ్ ఉందనే దానిపై నిలదీసే అవకాశం ఉందంటున్నారు.
ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ గనుక మంగళగిరి ఆఫీస్‌లో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి క్లాస్ పీకితే.. ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఒక సరికొత్త జోష్, మార్పు వచ్చే అవకాశం ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్క లీడర్ ప్రజా సమస్యలపై, ముఖ్యంగా శాంతిభద్రతల అంశాలపై వాయిస్ పెంచితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మరి ఈ పరిణామాల తర్వాత జనసేన ప్రజాప్రతినిధులు తమ శైలిని మార్చుకుని యాక్టివ్ అవుతారా లేదా అనేది చూడాలి.