Dial view: మహిళలా మదమెక్కిన మృగాలా ? రం*కు కోసం రక్తపాతం…!

రాను రాను మనిషిలో మమకారం చచ్చిపోతోంది. నైతిక విలువలు నట్టేట మునిగిపోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం కొందరు.. డబ్బు వ్యామోహంతో మరి కొందరు.

Post Published By: dialnews
Updated : 26 June 2026, 6:10 PM IST

రాను రాను మనిషిలో మమకారం చచ్చిపోతోంది. నైతిక విలువలు నట్టేట మునిగిపోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం కొందరు.. డబ్బు వ్యామోహంతో మరి కొందరు.. కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్లు, పేగు తెంచుకుని పుట్టినవాళ్లు అనే తేడా లేకుండా ప్రాణాలు తీసి మారణహోమం సృష్టిస్తున్నారు. సమాజంలో పెరుగుతున్న క్రూరత్వానికి, పతనమవుతున్న మానవత్వానికి అద్దం పడుతున్న మూడు సంచలన ఘటనలు.. నేడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.ఈ లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండేది పుణెలో కాబోయే భర్తను చంపేసిన సియా కథ. కేతన్‌ దగ్గర ఆస్తి ఉంది.. అందం ఉంది.. అన్నిటికీ మించి సియా అంటే అమితమైన ప్రేమ కూడా ఉంది. కానీ సియాకు అవేం కనిపించలేదు. పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో వాళ్లకు చెప్పే ధైర్యం లేక కేతన్‌ను చంపాలనుకుంది.

దీని కోసం తన బాయ్‌ఫ్రెండ్‌ చేతన్‌తో కలిసి ప్లాన్‌ చేసింది. అనుకున్నట్టుగానే లోహగఢ్‌ ఫోర్ట్‌కు కేతన్‌ను తీసుకు వచ్చింది. దానికంటే ముందే ఒక కెఫేలో బాయ్‌ఫ్రెండ్‌ను కలిసి ప్లాన్‌ మొత్తం ఎక్స్‌ప్లెయిన్‌ చేసింది. లోహగఢ్‌ ఫోర్ట్‌కు కేతన్‌ను తీసుకొచ్చిన తరువాత చేతన్‌ను కూడా అక్కడికి పిలిచింది. కేతన్‌ నేచర్‌ని ఎంజాయ్‌ చేస్తున్న టైంలో తోసేయ్‌మంటూ బాయ్‌ఫ్రెండ్‌కు సిగ్నల్‌ ఇచ్చింది. చాలా సేపటి నుంచి అక్కడే వెయిట్‌ చేస్తున్న చేతన్‌ను ఆ అబ్బాయిని లోయలోకి నెట్టి చంపేశాడు. ఇది ప్రమాదం అని చిత్రీకరించేందుకు ఇద్దరు నిందితులు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు దొంగలకంటే ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి సియా, చేతన్‌ అడ్డంగా బుక్‌ అయిపోయారు. ఇంత దారుణంగా కేతన్‌ను చంపే బదులు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఒక్క మాట ఆ అబ్బాయితో చెప్పొచ్చుకదా ? అలా కాకపోయిన ప్రేమించిన చేతన్‌తో పారిపోవచ్చు కదా ? వాళ్ల ఇంట్లో వాళ్లను ఎదిరించలేక మరో ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది సియా.

ఇక రెండో దారుణం..బెంగళూరులో జరిగిన ట్రిపుల్ మర్డర్. బెంగళూరులోని సీగేహళ్లి ప్రాంతంలో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల శ్వేత, తన ప్రియుడు కెన్నెత్‌తో కలిసి కన్నతండ్రి సోమసుందర్, తల్లి ముత్తులక్ష్మి, 20 ఏళ్ల చెల్లెలు సుప్రియను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. శ్వేత గత కొంతకాలంగా కెన్నెత్‌తో సహజీవనం చేస్తోంది. వాళ్ల ఖర్చుల కోసం తల్లిదండ్రులను తాకట్టు పెట్టి 30 లక్షలు బ్యాంక్‌ లోన్‌ తీసుకుంది. కానీ కెన్నెత్‌తో ప్రేమ శ్వేత ఇంట్లో వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ రుణాల చెల్లింపుల నోటీసులు రావడంతో తండ్రి సోమసుందర్ శ్వేతను నిలదీశారు. దీనికి తోడు తల్లి తనను చిన్నప్పటి నుంచి ఒక ఖైదీలా పెంచిందని, తనకు స్వేచ్ఛ లేదనే కోపంతో శ్వేత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. ప్రేమ విషయంలో ఇంట్లో వాళ్లతో గొడవ జరిగిన తర్వాత కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. కని పెంచిన తల్లిదండ్రుల కంటే నిన్న మొన్న ప్రేమించిన ప్రియుడే ఎక్కువయ్యాడా ? శ్వేతకు కన్న పేగు, తోడబుట్టిన బంధం రెండూ గుర్తు రాలేదా ? ప్రస్తుతం పోలీసులు శ్వేతను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కెన్నెత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇక మూడో కథ.. లవర్‌ కోసం కన్న పిల్లలను చిత్ర హింసలు పెట్టిన ఓ కసాయి తల్లిది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన కన్నతల్లి కర్కశత్వానికి నిదర్శనం. పింకీ దేవి, సుజీత్ దంపతులకు 12, 6, 4 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, పింకీ దేవి చందు కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనపై విసుగు చెందిన సుజీత్ ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పింకీ దేవి తన ప్రియుడు చందు కుమార్‌తో కలిసి ఒకే ఇంట్లో కాపురం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ ముగ్గురు పిల్లలు వారికి భారంగా మారారు. ముఖ్యంగా 6, 4 ఏళ్ల వయసున్న చిన్న పిల్లల పట్ల ఆ తల్లి రాక్షసిలా మారింది. ప్రియుడితో కలిసి పిల్లలను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టింది.

అత్యంత దారుణంగా వేడి చేసిన ఐరన్ బాక్స్‌తో ఆ పసిపిల్లల శరీరాలపై వాతలు పెట్టింది. కన్న పిల్లలు అనే కనికరం కూడా లేకుండా కసాయిదానిలా ప్రవర్తించిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్వార్థం, వివాహేతర బంధాల మోజులో పడి కన్న పిల్లలనే చిత్రహింసలకు గురిచేయడం మానవ విలువల పతనానికి అద్దం పడుతోంది.వెలుగులోకి వచ్చింది ఈ మూడు ఘటనలు మాత్రమే. కానీ బయటికి రాకుండా అంధకారంలో అరణ్య రోదనలుగా మిగిలిపోయిన ఆర్తనాదాలు ఎన్నో ఉన్నాయి. పేగు తెంచి జన్మనిచ్చిన మమకారం లేదు.. తోడబుట్టిన అనుబంధం లేదు.. కన్నవాళ్లు అనే కనికరం లేదు.. కట్టుకున్న వాళ్లు అనే ప్రేమ లేదు. కామం కోసం కొందరు.. డబ్బు కోసం కొందరు.. మానవ సంబంధాలను ప్రశ్నార్థంక చేయడమే కాకుండా.. అమాయకుల జీవితాలను బలి తీసుకుంటున్నారు.

 

Published : 
  • 26 June 2026, 6:10 PM IST