అప్పట్లో రవితేజ నేను..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో, ప్రత్యేకమైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కృష్ణ భగవాన్. ఆయన కేవలం కమెడియన్‌గానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు.

Post Published By: dialnews
Updated : 27 June 2026, 6:50 PM IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో, ప్రత్యేకమైన టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కృష్ణ భగవాన్. ఆయన కేవలం కమెడియన్‌గానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో మరపురాని పాత్రలను పోషించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.1988లో వంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహర్షి' సినిమాతో కృష్ణ భగవాన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'ఏప్రిల్ 1 విడుదల' చిత్రంలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నారు. అయితే, ఆ సినిమా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

మళ్ళీ 2003లో 'ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాతో ఆయన ఘనంగా రీ-ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో కమెడియన్‌గా బిజీ బిజీగా మారిపోయారు. 'కబడ్డీ కబడ్డీ', 'దొంగరాముడు అండ్ పార్టీ', 'లక్ష్మీ నరసింహ', 'అందరూ దొంగలే', 'చెప్పవే చిరుగాలి', 'లీలామహల్ సెంటర్', 'వెంకీ', దుబాయ్ శీను' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన తన సినీ కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో హీరోలు రవితేజ, వేణు తొట్టెంపూడి మరియు డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి అందరూ కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండేవారట. సినిమా రంగంలో ఉన్నవారు కావడంతో, రాత్రుళ్లు ఇంటికి ఆలస్యంగా వచ్చే కృష్ణ భగవాన్ మరియు ఆయన మిత్రులు, ఆ కుక్కలను చూసి భయపడి ప్రతిరోజూ గెట్లు, గోడలు దూకి ఇంట్లోకి వెళ్లేవారట. ఆనాటి ఆ సరదా సంఘటనలను తలుచుకుని ఆయన నవ్వుకున్నారు.ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ, తన మార్కు పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కృష్ణ భగవాన్. కామెడీ పాత్రలైనా, ఎమోషనల్ పాత్రలైనా తన నటనతో ప్రాణం పోసే కృష్ణ భగవాన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published : 
  • 27 June 2026, 6:50 PM IST